ప్రేమ తత్త్వము… గోవింద కృష్ణ చెత్తూర్, భారతీయ కవి

ఈ అవనిమీద జీవించి, ప్రేమించి, సౌందర్యాన్ని దర్శించి

పదునైన కలలు ఆయుధాలుగా చీకటినుండి వేకువ మొలిచేదాకా

శ్రమించి, అందరూ నడిచేత్రోవకీ, కోలాహలాలకీ అతీతంగా

ఎగరడానికి (ఆలోచనల) రెక్కలుగలిగినవా డెవడు

దైవాన్ని చులకనచేసి మాటలాడగలడు?

ఈ క్షణికమైన అనంతతత్త్వాన్ని తెలిసినవారు

అనిమిషులతో సరిసమానులే. వారు సురలోక వాటికలపై

సురలతో పాటుగా విహరిస్తారు.

అనుపమానమైన గంధర్వ గానాన్ని ఆస్వాదిస్తూ.

అలాగే, దివ్యమైన ప్రేమకి వారసులమైన మనం కూడా,

దేవతల వలె, అమరానంద పారవశ్యంతో ఎదిగి

దైవత్వాన్ని సంతరించుకుని, రానున్న భవిష్యత్తులో,

కాలమూ, కన్నీరుల లౌకిక స్పర్శకు అతీతంగా,

ప్రేమ తన దివ్యత్వాన్ని ఋజువుచేసుకుంటుందని కలగంటాము.

.

గోవింద కృష్ణ చెత్తూర్

(1898- 1936)

భారతీయ కవి

.

Love

.

Who that has lived, and loved, and seen fair things

And striven with darkness beating into day,

With spears dream-pointed, and combined with wings

Above the tumult of the lesser way

Shall speak thereafter  slightingly of God?

They that have known this brief infinity

Are one with the immortals.  They have trod

The floors of Heaven in Heavenly company,

Intoxicated with blessed harmonies.

So we, the proud inheritors of love,

Grown God-like in immortal ecstasies

Dream, God-wise, of a day that love shall prove

Magnificently, in the after years,

Beyond the mortal touch of time or tears.

.

(Last Sonnet from   “The Triumph of Love”)

.

Govinda Krishna Chettur

(1898- 1936)

Indian Poet

Works :

Sounds and Images (1920)

The Temple Tank (1932) Poems

The Triumph of Love (1932) Sonnets

Gumataraya (1932) Sonnets

The Shadow of God (1935) Sonnets

The Ghost City… Collection of  Ten Short stories

College Composition (1933)

Altars of Silence (1935) edited volume on Themes for Meditation and Prayer.

Poem Courtesy:

https://archive.org/details/indiancontributi030041mbp/page/n87/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: