-
వయసు వాలిన స్త్రీ … సారా టీజ్డేల్, అమెరికను
. ఆమెని బ్రాడ్వేలో కారులో చూసేను బహుశా నే నా స్త్రీలా మారుతా నేమో నా సఖుడు ఆమెవంక చూసి ఎందుకో అకస్మాత్తుగా నా వంక తిరిగినట్టనిపించింది. ఆమె తలకట్టు కాంతిలేక కళతప్పి ఉంది కానీ ఆ రంగు నా జుత్తురంగులాగే ఉంది చిత్రంగా కళ్ళుకూడా నా కళ్ళలాగే ఉన్నాయి ఏ నాడూ ప్రేమకినోచుకుని మెరిసినవి కావవి. ఆమె శరీరం వడలి పుల్లలా అయిపోయింది బహుశా ఎన్నడూ దొరకని ప్రేమకై తపిస్తూ; ఆమె మనసు…
-
చీమల పుట్ట … రాబర్ట్ విలియం సెర్విస్
మా పెరట్లో ఊదారంగు పైన్ చెట్టుక్రింద నల్ల చీమలు ఒక పెద్ద పుట్ట పెట్టేయి, చివికినట్టుండే ఆ పుట్టని గమనిస్తూ తరచు నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. నిరంతరం శ్రమిస్తూ అవి తిరగడం నాకు చూడ్డానికి చాలా వింతగా అనిపించేది; చూస్తున్నప్పుడు, వాటిలాగే శ్రమించే మనుషులని గమనించే దేముడిలా నన్నునేను ఊహించుకునే వాడిని. అలా ఉండగా ఒక రోజు మా పనిమనిషి వచ్చింది సరిగ్గా సమయానికి ఆమె చేతులు పట్టుకున్నాను గనక సరిపోయింది; ఎందుకంటే, బలిష్టమైన…
-
హెలెన్ గ్రీవ్ కి… వాసర్ మిల్లర్, అమెరికను కవయిత్రి.
. కాలం తన జేబులో వేసుకున్న అనేక దినాల్లో చిన్నపిల్లలా సిగ్గుపడుతూ ఈ రోజు మాత్రం గుర్తింపు కోరుకుంటుంది, ఎందుకంటే, ఈ రోజు మనమధ్య నడిచిన ప్రేమ సంభాషణలో కాఫీని మించి అపూర్వమైన మాటల వాడుకా లేదు, గొప్ప ఆవేశాల ప్రదర్శనాలేదు.అయినా, ఎంతపాతబడి విస్మృతిలోకిజారినా ఈ రోజుని మాత్రం ఏదో ఒక ఊహ గుర్తుచెయ్యక మానదు. . వాసర్ మిల్లర్ (July 19, 1924 – October 31, 1998) అమెరికను కవయిత్రి. . . Bagatelle…
-
ఇద్దరు కవులెప్పుడైనా కలుసుకుంటే… హరీశ్ ఎడవన, మలయాళం
ఇద్దరు కవులెప్పుడైనా కలుసుకుంటే వాళ్ల ఆత్మలు సమావేశాన్ని బహిష్కరిస్తాయి. ఒకరికొకరు వీడ్కోలుచెప్పుకునేదాకా వాళ్ల పద్యాలు విసుగుతో ఆవులిస్తూనే ఉంటాయి. అక్షరాలు నిశ్శబ్దంగా ప్రార్థిస్తుంటాయి దేముడా మమ్మల్ని ఈ హింసనుండి రక్షించమని. పుకార్లకీ వ్యర్థప్రసంగాలకీ అధిదేవతలు సైతానుని సంకీర్తనలతో స్తుతిస్తాయి. ఇద్దరు కవులు ఎప్పుడైనా కలిస్తే తమని తాము ఆకాశానికి ఎత్తేసుకుంటారు పాపము శమించుగాక! ఒకచోట ఇద్దరు కవులెన్నడూ కలవకుందురు గాక! . హరీశ్ ఎడవన మలయాళం . . If Two Poets were ever to…
-
At the Threshold of the Heart…Prasuna, Telugu, Indian
All this while… As I struggled to wriggle out of the bear-hug of the Computer where I was inaudible to myself… How long this torrential rain had been knocking at the door! I don’t know. But, it rushed on to me planting an unexpected kiss on my cheeks… From hence My…
-
అపాచీల వైవాహిక మంగళాచరణం … ఏలియట్ ఆర్నాల్డ్, అమెరికను
ఇక మీ ఇద్దరికీ వర్షం భయం లేదు ఎందుకంటే, ఒకరికొకరు ఆశ్రయంగా ఉంటారు; ఇక మీకు భవిష్యత్తు గురించి చింతలేదు ఎందుకంటే, ఒకరికొకరు సలహాలిచ్చుకుంటారు; ఇక మీకు ఏ తీపులూ ఉండవు, ఎందుకంటే మీరు ఒకరికొకరు ఉపశమనమిచ్చుకుంటారు; ఇక మీకు రాత్రి గూర్చి దిగులు లేదు ఎందుకంటే, ఒకరికొకరు వెలుగై ఉంటారు; ఇక మీకు చలిగూర్చి వెరపు లేదు ఎందుకంటే ఒకరికొకరు కవోష్ణమై ఉంటారు; ఇక మీకు ఎన్నటికీ జడత్వమన్నది ఉండదు, ఎందుకంటే మీ బాధలూ, ఆకాంక్షలూ చిత్తగించేయి;…
-
సెయింట్ ప్రాన్సిస్ ప్రార్థన …ఫాదర్ బొకెరెల్, ఫ్రాన్సు (?)
ప్రభూ! నీ శాంతి సందేశానికి నన్నొక సాధనంగా నియోగించు; ఎక్కడ ద్వేషం ప్రబలంగా ఉందో, అక్కడ నన్ను ప్రేమని విత్తనీ; ఎక్కడ మదికి గాయమయిందో, అక్కడ క్షమనీ; ఎక్కడ అనుమానం ఉందో అక్కడ నమ్మకాన్నీ; ఎక్కడ నిరాశ మిక్కుటమై ఉందో అక్కడ ఆశనీ; ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగునీ; ఎక్కడ విషాదం ఉందో అక్కడ ఆనందాన్నీ నింపనీ. నేను ఒకరి ఓదార్పుకై వగచే బదులు ఒకరిని ఓదార్చగలిగేలా అనుగ్రహించు; ఒకరు అర్థంచేసుకోడానికి బదులు ఒకర్ని అర్థం…
-
Search … Sowbhagya
I turn over dawn like a page You spread out like night extending into the day. I open up the night like an eyelid— you vanish like a withdrawn day. I run marathon for days and nights, and You tease and torment me becoming an ever eluding finish line. To find you , I search…
-
నేను నిన్ను ప్రేమిస్తున్నాను… లారీ ఎస్ చెంగెజ్
. నువ్వు నువ్వయినందుకే కాదు, నీ సమక్షంలో నేను నేనయినందుకు నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమలో నిన్ను నువ్వు మలుచుకున్న తీరుకే కాదు నన్ను నువ్వు మలుచుతున్న తీరుకికూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నాలోని ఒకపార్శ్వాన్ని బయటకి రప్పిస్తున్నందుకు నిన్ను ప్రేమిస్తున్నా పోగుపడ్డ నా హృదయం మీద నీ చెయ్యి వేసి అక్కడ కనిపించిన బలహీనమైనవీ, తెలివితక్కువవీ గుర్తించి సరిదిద్దలేనివి అలా వదిలేసి ఇంతవరకూ ఎవ్వరూ చూడడానికి ప్రయత్నించని సుందరమైన విషయాలు చూసి పనిగట్టుకుని వెలుగులోకి తీసుకువచ్చినందుకు నిన్ను ప్రేమిస్తున్నాను.…
-
అసుర సంధ్యవేళ … హెచ్. డబ్ల్యూ. లాంగ్ ఫెలో, అమెరికను
రోజు ముగిసి వెలుతురు పలచబడుతూ, మెల్లగా చీకటి నలుచెరగులా కమ్ముతున్నప్పుడు దైనందిన కార్యకలాపాలకి ఒకింత విశ్రాంతి దొరికే ఘడియ వస్తుంది; అదే అసురసంధ్యవేళ. నా నెత్తిమీదనున్న గదిలో చిన్ని పాదాల అడుగులు నాకు వినవస్తాయి ఒక తలుపు తెరుచుకున్న చప్పుడుతో పాటు గలగలమనే మెత్తని తియ్యని మాటలుకూడా నా చదువుకునే గదిలోంచి దీపపు వెలుగులో విశాలమైన హాలు లోని మెట్లమీదనుండి గంభీరంగా ఏలిస్, నవ్వుతూ ఏలెగ్రా పసిడితీవెలజుత్తుతో ఎడిత్ దిగడం కనిపిస్తుంది. ఒక…