-
ఏదీ శాశ్వతం కాదు… సిసిలీ హెర్బర్ట్, ఇంగ్లండు
. ప్రతీదీ మార్పుకులోనౌతుంది. మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుతాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది, సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము. . జరిగిందేదో జరిగిపోయింది. సముద్రాల్లోకి ఒలకపోసిన విషాల్ని తిరిగి బయటకి తోడి పారబొయ్యలేము, అయినా, అన్నీ మార్పుకిలోనౌతాయి మనం భవిష్యత్తరాలకోసం చెట్లు నాటుదాం. . సిసిలీ హెర్బర్ట్ ఇంగ్లండు ఈ కవితలోని సౌందర్యం, అనులోమంలోనూ విలోమంలోనూ ఒకే రకమైన మాటలు ఉపయోగించి, ఒక సారి నిరాశా నిస్పృహలు సూచిస్తే, రెండవ సారి ఆశావహమైన…
-
నేను ఏకాకిని కాను … నికి జియొవాని, అమెరికను
నేను ఒంటరిగా నిద్రించే ఏకాకిని కాను… నేను భయపడతానని అనుకున్నావు ఏంలేదు, నేనిపుడు పెద్ద పిల్లనయ్యాను నేనిప్పుడు ఏడవటం లాంటివి ఏవీ చెయ్యడం లేదు. నాకిప్పుడు చాలా పెద్ద మంచం ఉంది దాని మీద సరిపడా జాగా ఉంది విశాలంగా ఎటుపడితే అటు దొర్లవచ్చు; ఇకమీదట… పూర్వం నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినట్టు వచ్చినలాంటి పీడకలలు మరి రావు నువ్వింక నన్ను వదిలి వెళ్ళిపోయేవు కనుక నాకు కలలే రావు. నువ్వేమనుకున్నా సరే…
-
నిర్లక్ష్యానికి నివేదన… ఫేనీ గ్రెవిల్,ఇంగ్లండు
నా ప్రేమకి ప్రతిగా ప్రేమని కోరను, ఆకర్షించడానికి ఏ అందాలూ కోరను; ప్రశాంతతకోసం, సుఖంకోసం నిట్టూర్చే మనసునుండి అవి దూరంగా తొలగిస్తే చాలు. మనసుకి సుఖమూ శాంతీ రెండూ తెలీవు, అది ఒక వాడి సూది మొనలాగ ఆనందమూ, విషాదమూ స్పర్శిస్తే చాలు స్పందిస్తుంది, స్పందిస్తూ, భయపడుతుంది కూడా. దుఃఖాలు మనసుకి గాయం చెయ్యడం మాటకి వస్తే అది ఎప్పుడూ బాధే, తప్పితే, అవస్థలోనే తేడా; సుఖాల విషయానికి వస్తే, ఎప్పుడూ హద్దులే; హద్దుదాటితే, తీరని వేదనే.…
-
చరమశ్లోకం … జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి.
నీలాగే ఒకప్పుడు జీవనసాగరాన్ని ఈదేను, నీలాగే నిరర్థకమైన సుఖాలకై ప్రాకులాడేను నీలాగే జీవితపు పెను తుఫానులో శ్రమించేను స్వల్ప విషయాలకు బాధపడి, ఆటబొమ్మలకు ఆనందించేను. నా బలహీనతలు మరిచిపో; నీకూ బలహీనతలున్నాయి; నా పొరపాట్లు మన్నించు; నువ్వూ పొరపాట్లు చెయ్యకపోవు; ఏ సొగసులూలేని నా దీనగాథ విని నిర్వికారంగా ఉండకు. ఓ మనిషీ! నీకూ, మీ కందరికీ నేను స్నేహితుడినే. . జేమ్స్ బీటీ, (25 అక్టోబర్ 1735 – 18 ఆగష్టు 1803) స్కాటిష్ కవీ, తత్త్వవేత్త.…
-
An Epigram… Sir William Jones, England
. చుట్టూ ఉన్న అందరూ చిరునవ్వులు నవ్వుతుంటే, నగ్నంగా తల్లి ఒడిలో ఏడుస్తున్న ఓ పసికూనా! చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తున్నా, నువ్వు నవ్వగల ప్రశాంతత మదిలో నీ చివరి నిద్రవరకూ నిలుపుకుని చిరంజీవివి కా! . సర్ విలియం జోన్స్ (28 సెప్టెంబర్ 1746 – 27 ఏప్రిల్ 1794) ఇంగ్లిష్- వెల్ష్ భాషాశాస్త్రవేత్త. . . An Epigram . On parent knees, a naked new-born child, Weeping thou sat’st while…
-
A Dab of Music … Sowbhagya, Telugu, Indian
I am a lake… You are a gentle ripple rollicking on its surface bringing along a dream In a still stony silence, I await you without batting an eyelid. Pray, come! let a mild breeze follow your wakes and gently shakes your meandering tresses, humming exotic, ecstatic tunes. I pray! I pray! Toss that flowing hair…
-
సహచరి … వాషింగ్టన్ ఇర్వింగ్
. ఒక స్త్రీ ప్రేమబంధంలో చిక్కుకున్నవ్యక్తి అనుభవించే కనిపించని సౌఖ్యాలతో సరిపోల్చినపుడు సముద్రంలో దొరికే నిధులు ఏమంత విలువైనవి కావు. నేను ఇంటిని సమీపిస్తుంటే చాలు, నా అదృష్టపు సుగంధాలు నన్ను తాకుతుంటాయి. ఆహ్! వివాహం ఎంత కమనీయమైన శ్వాసలనందిస్తుంది! దానిముందు ఏ తోటసువాసనలైనా దిగదిడుపే….. థామస్ మిడిల్టన్. ఆంగ్ల నాటక కర్త (1570 – 1627) * . జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే తీవ్రమైన కష్టనష్టాలని స్త్రీలు ఎంత ధైర్యంగా ఎదుర్కోగలరో ప్రస్తావించవలసిన సందర్భాలు…
-
నీ స్నేహానికి నా కృతజ్ఞతలు … లారీ ఎస్ చెంగెజ్
. నామీద నాకే నమ్మకంలేక సతమతమౌతున్నప్పుడు నా మీద నమ్మకముంచినందుకూ… నాతో ఏకీభవిస్తూ నేను వినాలనుకున్నది కాకుండా… నే నేది వినాలో అది చెప్పినందుకు కృతజ్ఞతలు. నీ మనసు నాతో పంచుకున్నందుకూ నీ ఆలోచనలూ, కలలూ, వైఫల్యాలూ నన్ను నమ్మి, నాతో చెప్పుకున్నందుకూ… నీ అవసరానికి నేను పనికొస్తానని విశ్వసించి, అవసరంలో సాయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. మనస్నేహం పెంపొందడానికి ఎంతో ముందుచూపూ, ఆలోచనా, శ్రద్ధా కనబరిచి నాతో ఎన్నో మధురమైన క్షణాలను పంచుకుని ఎన్నో…
-
చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు … థామస్ మూర్
నువ్వు ప్రేమించిన మిత్రుడు చల్లగా మట్టిలో కలిసిపోయినపుడు అతని తప్పిదాలూ, తెలివితక్కువ పనులన్నీ నువ్వు మరిచిపో. పొరపాటున జ్ఞాపకాల ముసుగుతీసుకుని బయటికి వచ్చినప్పుడు ఒక సారి వాటికై వగచి ఎప్పటిలాగే మరిచిపోడానికి ప్రయత్నించు. హా! బలహీనతలకులోనై అతను ఎంత పక్కతోవలు పట్టేవాడోగుర్తొచ్చి మనసుకలచివేసినపుడు,అతని చీకటి ప్రస్థానంలో ఎంత మసకదైనా ఎంతచిన్నదైనా, అతని చీకటితోవలోవెలుగు చూపి మార్గం మళ్ళించిన రేచుక్కవి నువ్వు కావడం గుర్తుచేసుకుని ఆనందించు. నీ నుండీ, నీ నిర్మలమైన అమాయకత్వంలోంచీ మొదటిసారిగా ఆరాధించతగిన నిజమైన ప్రేమతత్త్వం…