-
పేదరికం… పంచతంత్రము నుండి
ఒక నిరుపేద మిత్రుడి సమాధిదగ్గరకు పరిగెత్తి,ఇలా ప్రార్థించాడు “శవ మిత్రమా, లే! క్షణకాలంపాటు నా భుజాలమీదనుండి ఈ పేదరికపు పెనుభారాన్ని తొలగించు; ఈ మధ్య, భారం మోయలేక బాగా అలసిపోతున్నాను. నువ్వున్నంత హాయిగా నాకూ ఉండాలనిపిస్తోంది.మరణించి ఈ బాధతప్పించుకున్న అదృష్టవంతుడివి.” శవం బదులివ్వలేదు. అతనికిపుడు రూఢి అయింది. పేదరికం మోయడం కంటే మరణమే మేలని. . పంచతంత్రము నుండి అనువాదం: ఆర్థర్ W రైడర్.. Poverty . A beggar to the graveyard hied, And there “Friend corpse, arise,” he cried:…
-
The Falcate Moon… Dr. Umar Alisha, Telugu poet
Like the stretched bow of the Cupid,A silver boat floating on milky-ocean,A cup of wine of damsel Nature, looksThe second day’s waxing moon over the sky. Seems some lass had lit it there, and leftWatching it a kite was so hookedthat it sacrificed its life ultimately;Why am I not so devoted to my heart-throb? It’s…
-
The Uncivil… Aranyakrishna, Telugu Poet
Man is not born alone The flora are his own siblings Absence of trees and birds Marks lack of civilization. No Concrete slab breathes out oxygen. For man to live as green as a forest He should surround himself with greenery. Some fool carries in his lorry Logs, which look like a heap of torsos.…
-
పాత – కొత్త… అజ్ఞాత చీనీ కవి
ఆమె కొండమీద దొరికే వనమూలికలు ఏరుకుందికి వెళ్లింది.దిగి వస్తున్నప్పుడు దారిలో తన మాజీ భర్త ఎదురయ్యాడు.సంప్రదాయంగా ముణుకులు వంచి నమస్కరించి అడిగింది“నూతన వధువుతో మీ జీవితం ఇప్పుడెలా ఉంది?” అని. “నా భార్య చాలా తెలివిగా మాటాడుతుంది గాని,నా మొదటి భార్య అలరించినట్టుగా అలరించలేదు.అందంలో ఎవరూ ఎవరికీ తీసిపోరు,కానీ ఉపయోగపడడంలో ఇద్దరికీ పోలిక లేదు.నా భార్య నన్ను కలవడానికి వీధిలోనికి వస్తేనా మాజీ భార్య ఎప్పుడూ అంతర గృహంలోంచి వచ్చేది.నా నూత్న వధువు పట్టు బుటేదారు పనిలో…
-
జపనీస్ కవి బాషో 7 కవితలు…

1 ఓ జలజలా రాలుతున్న మంచు! ఈ తుచ్ఛమైన జీవితాన్ని నీలో ప్రక్షాళన చేసుకోనీ! 2 రోడ్డువార చిన్ని మొక్క దారినపోతున్న వారిని చూడాలని ముందుకి వంగింది. దారినపోతున్న ఓ గాడిద దాన్ని నమిలి మింగింది. 3 ఓ పిచ్చుక మిత్రమా! వేడుకుంటాను. నా పూల రెమ్మల్లో రాగాలుతీస్తూ ఆడుకుంటున్న కీటకాల జోలికి పోకేం? 4 ఎక్కడో దూరంగా, ఒంటరిగా ఉన్న తటాకం అందులోకి చెంగున ఒక కప్ప దూకీ దాకా నిశ్చలంగా, యుగాలనాటి నిర్వికల్ప సమాధిలో…
-
జపనీస్ సంకలనం Shūi Wakashū నుండి రెండు కవితలు
ఇప్పటికీ మంచు పూర్తిగా కరుగనిఆ కొండమీది పల్లెఆ కోకిల కుహుకుహూలకు తప్పవసంతం అడుగుపెట్టిందనిఎలా గ్రహించగలిగి ఉండేది?.నకత్సుకాసా9వ శతాబ్దం.జపనీస్ కవి కొండ మొదలునిమరుగుపరుస్తున్న నదిమీది పొగమంచుపైకి తేలిపోతుంటేహేమంతప్రభావానికి ఆ కొండఆకాసానికి వ్రేలాడుతున్నట్టు కనిపిస్తోంది..కొయొవారా ఫుకుయాబు900-930జపనీస్ కవి Selections from Shūi Wakashū If it were not for the voice Of the Nightingale, How would the mountain-village Where the snow is still unmelted Know the spring? . Nakatsukasa C.900…
-
జపనీస్ కవితా సంకలనం “Kokinshū” నుండి 3 కవితలు…
1 ఈ ప్రపంచంలో ఏ బాహ్య చిహ్నాలూ అగుపించకుండా వడలి వాడిపోయే వస్తువు బహుశా మగవాడి హృదయ కుసుమమే! . ఒనో నో కొమాచి 825- 900 జపనీస్ కవయిత్రి 2 నా ప్రేమ మహాపర్వతాల అంతరాలలో ఎక్కడో పెరిగే గడ్డి లాంటిది. అది ఎంత ఒత్తుగా పెరిగినా ఏం ప్రయోజనం దాని ఉనికి గుర్తించేవాడెవరూ ఉండరు. . ఒనో నో యొషీకి మరణం 902. 3 ముదిమి వస్తోందని ఎవరికైనా ముందే తెలిస్తే ఎంత బాగుండును?…
-
అరవై నిండినపుడు… పో చూ-యి, చీనీ కవి

ముప్ఫై కి – నలభై కి మధ్య ఇంద్రియభోగాలు మనసు చంచలం చేస్తాయి డెబ్భై కీ – ఎనభై కీ మధ్య మనిషి చెప్పలేనన్ని రోగాలకు లోనౌతాడు కానీ, యాభైకీ – అరవై కీ మధ్య ఈ రకమైన బాధలకి దూరంగా ఉంటాడు. ఏ చాంచల్యాలకూ లోనుగాక మనసు నిశ్చలమై, విశ్రాంతి తీసుకుంటుంది. ప్రేమల్నీ, లాలసలనీ విడిచిపెట్టేసేను. చాలు! లాభనష్టాల, కీర్తిప్రతిష్ఠల ధ్యాస వదిలేసేను. ఇప్పటికి ఆరోగ్యంగా, ముదిమికి దూరంగా ఉన్నట్టే తీర్థయాత్రలకీ, పర్వతారోహణకీ కాళ్లలో ఇంకా…
-
కొడుకు పుట్టిన సందర్భంలో… సూ తుంగ్ పో, చీనీ కవి
ఈ కవితలోని వ్యంగ్యం/ అధిక్షేపణ విప్పి చెప్పనవసరంలేదు. ****** సాధారణంగా కుటుంబాల్లో బిడ్డ పుట్టినపుడు వాళ్ళు తెలివైన వాళ్ళు కావాలని కోరుకుంటారు. నేను, నా తెలివితేటలవల్లనే నా జీవితాన్ని నాశనంచేసుకోవడం వల్ల వాడు అజ్ఞానీ, మూర్ఖుడూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అప్పుడు వాడు రాజదర్బారులో మంత్రిపదవి అలంకరించి ఏ చీకూ చింతాలేక ప్రశాంతంగా జీవించగలడు. . సూ తుంగ్ పో, 8 January 1037 – 24 August 1101 చీనీ కవి. .…
-
ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు… అజ్ఞాత చీనీ కవి
నీకు రకరకాల కోట్లూ, దుస్తులూ ఉన్నాయి, కానీ వాటిని నీతో తీసుకు పోలేవు; నీకు రథాలూ, గుఱ్ఱాలూ ఉన్నాయి, కానీ వాటిని నువ్వు ఎక్కి స్వారీ చెయ్యలేవు. ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు, వాటిని వేరెవరో అనుభవిస్తారు. నీకు విశాలమైన పెరళ్ళూ, భవంతులూ ఉన్నాయి, వాటిని ఊడ్చి, కళ్ళాపిచిలకరించే వారు ఉండరు. నీకు ఢంకాలూ, ఘంటలూ ఉన్నాయి వాటిని ఎన్నడూ మ్రోగించేవారే ఉండరు. ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు, అవి ఇంకెవరి అధీనంలోకో వెళ్ళిపోతాయి.…