Like the stretched bow of the Cupid,
A silver boat floating on milky-ocean,
A cup of wine of damsel Nature, looks
The second day’s waxing moon over the sky.
Seems some lass had lit it there, and left
Watching it a kite was so hooked
that it sacrificed its life ultimately;
Why am I not so devoted to my heart-throb?
It’s beyond one’s imagination to gauge
the fascination of lamp for the moth, for
It will not let her live beyond a day; and
As the moth immolates, it burns out in its wake.
.
Umar Alisha
(28 February 1885 – 23.1.1945)
Telugu Poet
నెలవంక
దర్పకుడు వచ్చి వంచిన ధనువు వలెను
పాలకడలి లోపలి వెండి పడవ వలెను
ప్రకృతి కన్య త్రావెడు పాన పాత్ర వలెను
నభముపై దోచె రెండవ నాటి విధుడు
ఎవతెయో దీపమును బెట్టి ఏగె మింట
దాని గని పతంగంబు సంతసము తోడ
వలచి ప్రాణంబు లర్పించి వైచె; నేను
నా మనోహరి కేల యీ నోమనైతి?
మిడుతపై దీపమునకెట్టి విడువరాని
ప్రేమయో గాని యొక్క రాత్రియును గూడ
బ్రతుక నియ్యదు; మిడుతదా వలచి పడిన
దాను బడి యరిపోవు సంతసము తోడ.
.
డా. ఉమర్ ఆలీషా కవి
(1885 – 23.1.1945)
Poet, Soofi Philosopher.
indian
like
స్పందించండి