Man is not born alone
The flora are his own siblings
Absence of trees and birds
Marks lack of civilization.
No Concrete slab breathes out oxygen.
For man to live as green as a forest
He should surround himself with greenery.
Some fool carries in his lorry
Logs, which look like a heap of torsos.
To fell a tree amounts to poisoning the air,
Erasing the marvel from the looks of man,
Cutting the trees is nothing short of
Making bonfire of morrow’s breaths … today.
Where will be the shade for him to rest
After a grueling walk or work?
Every tree that was felled
Is a new tomb coming up in the city
Every tree that was uprooted
Stands witness to man’s barbarous atrocity
And every tree that disappeared
values more than five score lives of men
And thousands of birds yet to be born
When all the trees disappear on this planet
It heralds the end of the man, too.
That day, there will be no pole left
To stand as cross in his memory.
.
Aranyakrishna
Telugu Poet, India
అనాగరికుడు
మనిషి ఒంటరిగా పుట్టలేదు
చెట్లు కూడా ఆ అమ్మ బిడ్డలే
చెట్టులేని, పిట్టలేని నగరం నాగరికతకు చిహ్నం కాదు
సిమెంటు ముద్దల్లోంచి ప్రాణవాయువులు పుట్టవు
అడవంత పచ్చగా మనిషి బతకాలంటే
మనిషి చుట్టూ చెట్లుండాలి
వాడెవడో మూర్ఖుడు
తల లేని మనిషి మొండేల్ని కుక్కినట్లు
లారీల్లో చెట్టు దుంగల్ని వేసుకెళ్తున్నాడు
చెట్టుని నరకటమంటే గాలిని హత్య చేయటం
మనిషి కంటిచూపులోంచి పచ్చదనాన్ని తుడిచేయటం
చెట్టుని కూల్చటమంటే
రేపటి మన ఊపిర్లని మంటబెట్టుకోవటం
అలసటతో మనిషెక్కడ కూలబడాలి
చెట్లన్నీ కూలిపోతుంటే?
కూలిన ప్రతి చెట్టూ
నగరంలో మొలిచిన ఓ సమాధి
నరకబడ్డ ప్రతి చెట్టూ
నాగరీకుడి అత్యాచరానికి ఒక్కో రుజువు
చచ్చిపోయిన ఒక్కో చెట్టు
వందల మనుషుల బతుకులకి సమానం
వేల పిట్టల కళేబరాలకి సమానం
చివరికి
చెట్లు అంతరించిన నాడే
మనిషి కూడా అంతరించిపోతాడు
మనిషి సమాధి మీద పాతటానికి
ఒక్క శిలువ కూడా దొరక్కపోవచ్చు
(“కవిత్వంలో ఉన్నంతసేపూ….” నుండి)
స్పందించండి