అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 17, 2013

    XXXIV… ఎమిలీ డికిన్సన్ అమెరికను కవయిత్రి

    ప్రకృతి అంటే మనం దర్శించేది, ఈ పర్వతాలూ, ఈ మధ్యాహ్నాలూ, ఆ ఉడతా, ఈ గ్రహణాలూ,  ఆ తుమ్మెదా, కాదు కాదు…. ప్రకృతి అంటే స్వర్గమే. ప్రకృతి అంటే మనం వినేది, ఆ బాబొలింక్* ఈ సంద్రఘోష, ఆ ఉరుములూ, ఆ కీచురాయీ, ఓహ్, కాదు… ప్రకృతి అంటే స్వరసాయుజ్యమే. ప్రకృతి అంటే మనకి పరిచయమున్నదే కానీ దాన్ని వివరించగల కళ మనకి లేదు దాని నిరాడంబరతముందు మన జ్ఞానమంతా నిర్వీర్యమే. . ఎమిలీ డికిన్సన్ (December 10,…

  • నవంబర్ 16, 2013

    బేయార్డ్ టేలర్ … హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

    పుస్తకాలలో జీవన్మృతుడతడు అతని చూపుల్లో ప్రభువు వీక్షణాల ప్రశాంతత.   1మేక్జిమిలియన్ సమాధిస్థలాన్ని   విగ్రహాలు విచారవదనాలతో తిలకిస్తుంటే…   ఈ పుస్తకాలదొంతరలు కూడా బీరువా అరల్లోంచి తమలాగే మౌనంగా ఉన్న అతన్ని పరికిస్తున్నాయి అయ్యో! అతని చేతులు ఇక ఎన్నడూ భద్రపరచిన తమ పుటల్ని తిరగెయ్యవు కదా!   తమ పాటలు ఎంత మధురంగా ఉన్నా, ఆ పెదవులు ఇకెన్నడూ పలుకబోవు కదా!   జీవం లేని ఆ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి! దాని అతిథి,…

  • నవంబర్ 15, 2013

    అందరితోనూ ఒంటరిగా… చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి

    ఎముకల్ని  మాంసఖండాలు కప్పుతాయి, మధ్యలో ఒక మెదడునీ, అప్పుడప్పుడు ఒక ఆత్మనీ పెడతారు ఎవరో; స్త్రీలు గోడకి విసిరి పగలగొడతారు పుష్ప కలశాల్ని; మొగాళ్ళు పూటుగా తాగుతారు; ఎవరికీ వాళ్ళు కోరుకున్నవాళ్ళు దొరకరు అయినా అయినా ఎదురుచూస్తునే పక్కలమీదకి ఎక్కడం దిగడం మానరు. మాంసఖండం ఎముకల్ని కప్పుతుంది. మాంసం మాంసాన్ని మించి ఇంకేదో కోరుకుంటుంది; ఏమాత్రం అవకాశం లేదు! మనందరం అద్వితీయమైన విధి చేతులో చిక్కుకున్నాం. ఎవరికీ వాళ్ళకి కావలసింది దొరకదు. నగరంలో పెంటకుప్పలు నిండుతున్నాయి. చెత్తకుప్పలు…

  • నవంబర్ 14, 2013

    My ‘Jin’ny Devil… Mahesh Kumar Kathi, Telugu , Indian

    Emptying myself into the bottle Putting the lid, I sealed myself into a time-capsule. I had experience; and knowledge enough. But I settled in the bottle. Did I waste myself? Or moulded into a model for the future? Shall I reduce to an exhibit in a museum ultimately? Or shall I dry up without trace?…

  • నవంబర్ 13, 2013

    దీపం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.

    సుదీర్ఘమైన చీకటి దిగుడు బాటపట్టి నేను పోతున్నపుడు నీ ప్రేమని ఒక దీపంలా నా ముందు పట్టుకో గలిగితే అంతులేని నీడలు నను చుట్టుముట్టినా భయపడను; భీతితో కెవ్వుమని కేకలూ పెట్టను.   నేను దేవుడ్ని కనుక్కోగలిగితే, కనుక్కుంటాను. ఎవరికీ అతను కనిపించకపోతే, నిశ్చింతగా నిద్రిస్తాను… భూమి మీద ఉన్నప్పుడు నీ ప్రేమ ఒక్కటే సరిపోలేదా చిమ్మ చీకటిలో దీపంలా…   . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి…

  • నవంబర్ 12, 2013

    అర్థ రాత్రి పచార్లు చేస్తున్న అబ్రహాం లింకన్ … వాషెల్ లిండ్సే, అమెరికను కవి

    ఏదో అమంగళ సూచన, ఈ దేశానికి చెందిన ఆకారం అర్థరాత్రపుడు, అతిసామాన్యమైన మా నగరంలో, సంతాపంతో తిరుగుతోంది, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా, అదిగో కోర్టుకి దగ్గరగా, అటూ ఇటూ పచార్లు చేస్తోంది. తన ఇంటికి పక్కగా, నీడలు పాకే అతని ఆవరణలలో తనపిల్లలు ఒకప్పుడు ఆడుకున్న జాగాలో మెల్లగా ఆగి ఆగి ఒకోసారి బజారులో చరిస్తూ, అరిగిపోయిన రాతి బాటమీదా నక్షత్రాలు నివురుగప్పేదాకా అడుగులో అడుగువేసుకుంటూ… ఒక పొడవాటి వెల్లబారిన మనిషి  పాత సూటులో పేరుబడ్డ  High…

  • నవంబర్ 11, 2013

    I know… Aluri Bairagi, Telugu, Indian

    . I know I know No one meets with love on this miry agonizing cataclysmic mundane path; nor any plant takes root on this craggy surface; that we are all helpless soldiers fighting against hunger in the dark and the clueless sailors caught in a thunderstorm over high seas; that the scissoring gales of life…

  • నవంబర్ 10, 2013

    గుర్తుంచుకోదగ్గ నవ్వు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, జర్మన్- అమెరికను

    మా ఇంట్లో అందమైన కర్టెన్లు వేలాడుతూ మరుగుపరిచే వెడల్పు ఏకాండీ కిటికీ ముందున్న మేజాబల్ల మీద అక్వేరియంలో “గోల్డ్ ఫిష్” గుండ్రంగా తిరుగుతూ ఉండేవి; మా అమ్మ, ఎప్పుడూ నవ్వుతూ, మేమందరం ఆనందంగా ఉండాలని  చెబుతూ ఒకసారి ” హెన్రీ! ఆనందంగా ఉండరా!” అంది. నిజమే. ఉండగలిగితే ఆనందంగా ఉండడం మంచిదే. కానీ మా నాన్న నన్నూ మా అమ్మనీ వారంలో ఎన్నోసార్లు కొడుతూ ఉండేవాడు, ఆరడుగుల రెండంగుళాల విగ్రహం లోపల కోపంతో రగిలిపోతూ, ఎందుకంటే అతన్ని…

  • నవంబర్ 9, 2013

    నువ్వు పోయావని విన్నాక… విల్టన్ ఏగ్నూ బారెట్, అమెరికను

    నువ్వుపోయావని విన్నాక నేను ఆశ్చర్యాన్ని ప్రకటించడం మినహా నోట మరోమాట రాలేదు: మనిద్దరం విడిపోయి చాలా కాలం అయిపోయింది, ఇన్నేళ్ళూ నీపట్ల చాలా ఉదాసీనంగా ప్రవర్తించేను. నువ్వు వెళ్ళిపోయావన్న బాధ నాలో క్రమంగా కోపం నింపింది. ఒకప్పుడు నువ్వు నాకిచ్చిన ఒక పువ్వు… అదే, నే పోగొట్టుకున్న పుస్తకంలో పదిలంగా దాచుకున్న గులాబి… దానిమీద పాట అల్లడానికి ప్రయత్నించేను… నేను నీపట్ల క్రూరంగా ప్రవర్తించేను, మిగతా ప్రపంచం నుండి కూడ అంతకుమించి నీకేం దొరకలేదు, నాకు కోపం రావడానికి కారణం…

  • నవంబర్ 8, 2013

    కవిమిత్రుడి మది ఊరుపు… శ్రీనివాస్ వాసుదేవ్, తెలుగు

    1 నా నరాల్లో సంగీతం ఉరకలెత్తుతోంది అయినా, సరియైన స్వరం అందడం లేదు. నా దగ్గర తీగతెగిన వీణియ ఉంది దాన్ని సరిచేసి శృతిచేయగల వైణికుడు కనిపించడంలేదు. 2 విషాదభరితమైన గాథ ఉంది చెప్పడానికి కాని చెవిఒగ్గివినే శ్రోతే కరువైపోయాడు. పదాల ప్రవాహంతో గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతోంది రసావిష్కారమై పొరలే తీరు మాత్రం కనిపించడం లేదు. 3 నా విశ్వాసాల ప్రపంచం దిగంతాలకి  వ్యాపించి ఉంది అయినా అప్పుడప్పుడు సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి నా దగ్గర ఎన్నో…

←మునుపటి పుట
1 … 167 168 169 170 171 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు