సుదీర్ఘమైన చీకటి దిగుడు బాటపట్టి నేను పోతున్నపుడు
నీ ప్రేమని ఒక దీపంలా నా ముందు పట్టుకో గలిగితే
అంతులేని నీడలు నను చుట్టుముట్టినా భయపడను;
భీతితో కెవ్వుమని కేకలూ పెట్టను.
నేను దేవుడ్ని కనుక్కోగలిగితే, కనుక్కుంటాను.
ఎవరికీ అతను కనిపించకపోతే, నిశ్చింతగా నిద్రిస్తాను…
భూమి మీద ఉన్నప్పుడు నీ ప్రేమ ఒక్కటే సరిపోలేదా
చిమ్మ చీకటిలో దీపంలా…
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.

.
స్పందించండి