అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • డిసెంబర్ 7, 2013

    చేతిరుమాలు … అజ్ఞాత కవి, యుక్రెయిన్

    (యుక్రెయిన్ పడుచులలో ఒక ఆచారం ఉంది. పెళ్ళికి ముందు వాళ్ళు అల్లిన చేతిరుమాలు, నిశ్చితార్థం నాడు వరుడు ముంజేతికో, ఇంకెక్కడైనా ప్రస్ఫుటంగా కనిపించేచోట కడతారు. ) . సముద్రానికి ఆవలి అంచున సూర్యుడు మునిగి ఉన్నాడు ఎర్రగా, రక్త వర్ణంతో; ఆ కెంపువన్నె ప్రవాహంలో ఒక పడుచు మేలిమి రుమాలు అల్లింది. బంగారంలాంటి చక్కని చేతికుట్టుతో అల్లింది… ఈ రేయి ఆమె చెక్కిళ్ళు తెల్లకలువల్లా కనిపిస్తాయి, కన్నీట కడిగిన స్వచ్ఛమైన కలువల్లా ఆల్లిక పూర్తవగానే గుండెలకి గాఢంగా…

  • డిసెంబర్ 6, 2013

    Habit … BVV Prasad, Telugu, Indian

    Sometimes, we should get out of our daily rut And declare independence from the rote routine.   For a change, we should leave the vehicle behind and go on foot; Greet for the first time the unknown person we regularly meet on the road; Forget all the cares and sleep whole day and wake through…

  • డిసెంబర్ 5, 2013

    (స్వర) సంగతులు- 1… కాన్రాడ్ ఐకెన్, అమెరికను

    నెలఱేడు తెలినీలి వెన్నెల కురిపిస్తునాడు నలుదిక్కులా నీరవము అలముకుంటోంది . కరిమబ్బులు చుక్కల్ని మరుగుచేస్తూ కమ్ముకుంటున్నై నిర్మానుష్యమైన ఈ ఉద్యానంలో ఎండుటాకులను కాళ్ళక్రింద తొక్కుతూ నడుస్తున్నాను ప్రేమికులు మౌనంగా కూచున్న ఈ పాలరాతి పలకపై ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఖాళీ పలకలమీద ఎండుటాకులు పేరుకున్నాయి   క్రింద మురికిగుంటలోని నీరు, వణుకుతున్నట్టు చంద్రుణ్ణి అలలపై తేలియాడిస్తోంది. అల్లంతదూరంలో పొడుగాటి చెట్లు చందమామక్రింద అసహనంగా కదులుతున్నాయి. ప్రేయసీ! నేను ఒంటరిగా నడుస్తున్నాను… నాతో పాటే ఎప్పుడూ నడిచే…

  • డిసెంబర్ 4, 2013

    మిస్సిస్సిపి నది మీద… హేమ్లిన్ గార్లాండ్ అమెరికను

    వర్షపుచినుకుల మచ్చలతో, చీకటిలో బూడిదరంగులో మారి, దట్టంగా విశృంఖలంగా పెరిగిన అడవుల్లోంచి విశాలమైన ఆ నది, చాలా ప్రశాంతంగా పారుతోంది. వంపులు తిరిగిన దాని గుండెమీద కదులుతున్న ఒంటరి పొగపడవలోంచి, ఎడమవైపు దీపం మిణుకుమంటోంది నీడల్లా కదులుతున్న ‘ఓక్ ‘ చెట్ల మీదనుండి అరుణతార కనిపిస్తున్నట్టు. సడిచెయ్యని ప్రేతాత్మలా, మిణుగురుల పచ్చని మిణుకుల్లోంచి పడవ పెట్టిన పెనుబొబ్బకి నిశ్శబ్దం బెదిరి పారిపోతున్నట్టు ఒక హెరాన్ రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోయింది. .  హేమ్లిన్ గార్లాండ్ సెప్టెంబరు 14, 1860 –…

  • డిసెంబర్ 3, 2013

    A Land that doesn’t Give-in …Dr. Pulipati Guruswamy, Telugu, Indian

    Let me tell you things That I did not share with anybody before. Pray nobody else; It would disconcert God. Never heckle at others Some arrows Boomerang on you. You can make spikes and spears of words But If you can make florets of them they shall cleanse and perfume you and others alike. Don’t…

  • డిసెంబర్ 2, 2013

    సాహసికుడు… విల్టన్ ఏగ్నూ బారెట్, అమెరికను

    I ఎర్రగా, ముడుతలుపడ్డ ముఖంతో చేతులు బిగించి పట్టుకుని ఏమిచెబదామనో ఆ  ఆరాటం? ఇప్పుడే ఆ చీకట్లోంచి బయటకు వచ్చేడు అక్కడి నిశ్శబ్దం ఇంకా అతని శరీరాన్ని వదలనే లేదు అప్పుడే జీవితంగురించి ఏదో చెప్పాలని ఉబలాట పడుతునాడు. ష్! బహుశా జననమరణాలగురించి గొప్ప రహస్యం తెలిసుంటుంది, ఆ చీకటి ‘గర్భ’ గుడిలో తను తెలుసుకున్నది, జీవితం దాన్ని సంగ్రహిస్తోందని మనతో చెబదామనుకుంటూ చెప్పలేకపోతున్నాడు. అతను ఆనందంగాకంటే, ఎక్కువ విచారంగానే ఉన్నాడు. II దౌడుతీయి, దౌడుతీయరా కన్నా,…

  • డిసెంబర్ 1, 2013

    I … Mahesh Kathi, Telugu, Indian

    The wink that lies between two successive breaths The note that complements a harmony by its omission The word which elevates a poet’s fancy into a poem by its absence The ideation perceived before it turns into a thought  The vacuous horizon where the elements meet I am That moment That note That word That…

  • నవంబర్ 30, 2013

    A Shooting Star … Manasa Chamarti, Telugu, Indian

    If he were a jungle She wanted to nestle in his heart like a jingle of verdure   If he were a Sea She wanted to dissolve like a drop of rain in his expanse   Had he teased her like the sky She wanted to give a peck on his cheek like a star.…

  • నవంబర్ 29, 2013

    ఆగష్టు 1968… ఆడెన్, ఇంగ్లీషు-అమెరికను కవి

    ఆ రాక్షసుడు రాక్షసులేం చెయ్యగలరో అదే చేస్తాడు; అది మనుషులకి సాధ్యం కాదు; కానీ ఒక అమూల్యవస్తువు మాత్రం వాడికి చిక్కదు: రాక్షసుడు మాటను వశపరచుకోలేడు. దాసోహం అన్న నేల మీద, అక్కడి హతాసులూ, నిహతులూ మధ్య ఆ రాక్షసుడు నడుం మీద చేతులేసుకుని పెదాలంట చొంగకారుతుంటే అసహనంగా కదులుతుంటాడు. . వ్యుస్టన్ హ్యూ ఆడెన్ (W H Auden) 21 ఫిబ్రవరి- 29 సెప్టెంబరు 1973 బ్రిటిషు-అమెరికను కవి . ఈ కవిత కమ్యూనిష్టు రష్యా…

  • నవంబర్ 28, 2013

    మిన్నోలు (నెత్తళ్ళు) … జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి

    ఆ వంపునుండి ఎంత సడిలేకుండా పారుతోందీ నీరు; ఈ వేలాడుతున్న సాలవృక్షాలకొమ్మల్లో పిసరంత గుసగుసలైనా చెయ్యదు; వెలుగునీడలు ఆ గడ్డి పరకలమీంచి నెమ్మదిగా పాకురుతూ పోతున్నాయి— ఎంత నెమ్మదంటే, ఆ గులకరాళ్ళ తిన్నెలమీద ప్రవాహం చేరి ఒక జీవిత సత్యాన్ని బోధించే లోపు మనం రెండు సానెట్లు చదువుకోవచ్చు. అక్కడికి నెత్తళ్ళు గుంపులుగా వచ్చి తలలు పైకెత్తుతాయి ప్రవాహానికి వ్యతిరేకంగా తమ శరీరాలు నిలిపి నీటి తాకిడికి చల్లబడిన సూర్యకిరణాలని ఒక్క సారి తనివిదీరా ఆస్వాదించడానికి… ఆనందపారవశ్యంలో…

←మునుపటి పుట
1 … 165 166 167 168 169 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు