అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూలై 25, 2015

    O Lord! Forgive the Killer!… Ashok Kumbamu, Telugu, Indian

    O Lord! Forgive the killer! He is ignorant. He is arrogant. Except for its skin color He can make out nothing of humanity Poor creature! His devotion to the flag Fans hatred towards other sections of the society. Forgive him! After all, he is your child, Unfortunately, He is addicted to hunting and heap up…

  • జూలై 24, 2015

    నా ఆత్మను నిద్ర ఆవహించింది… విలియం వర్డ్స్ వర్త్, ఇంగ్లీషు కవి

    నా ఆత్మని నిద్ర ఆవహించింది నాకిపుడు ఏ లౌకిక బాధలూ లేవు దొర్లిపోతున్న కాలాన్ని ఇపుడామె గుర్తించగల స్థితిలో లేదు . ఆమెలో చలనం లేదు, జీవం లేదు ఆమె చూడనూ లేదు, విననూ లేదు; భూమి మీది రాయి-రప్పా, చెట్టు-చేమతో పాటు ఇక అహరహమూ పరిభ్రమిస్తూనే ఉంటుంది . విలియం వర్డ్స్ వర్త్ 7 April 1770 – 23 April 1850 ఇంగ్లీషు కవి   A Slumber Did My Spirit Seal .…

  • జూలై 23, 2015

    చీకటి చిక్కబడుతోంది… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి

    పగలల్లా భీకరంగా ఎండ కాసి కాసి సంధ్యవేళకి చీకటి చిక్కబడుతోంది, గాలి ఎగరేస్తున్న కెరటాలకి, రాత్రి భీకరంగా ఉంటుందని అర్థమయింది దూరాన ఎక్కడో ఉరుము ఉరుముతోంది. సముద్రపక్షికూనలు కొండల శిఖరాగ్రాల అంచులపై ఎగురుతున్నాయి అలవాటుగా ఇచ్చవచ్చినట్టు ఎగురుతూ ఆనందంగా రెక్కలల్లార్చుతున్నాయి దిగడానికి రెక్కలతెలుపు నీటితెలుపుతో కరిగిపోతూ కనుచూపుమేరలో ఓడల జాడలేదు సూర్యుడు ఇలా క్రిందకి గ్రుంకేడోలేదో దట్టమైన మేఘాలు కూడబలుక్కున్నట్టు దూరాన ఉదయించబోయే చంద్రుణ్ణి మూసేసేయి. పాపం, వెర్రి ప్రేమికా! నువ్వు ఏకాకివి. . రాబర్ట్ బ్రిడ్జెస్…

  • జూలై 22, 2015

    సహవాసి… లీ విల్సన్ డాడ్ అమెరికను కవి

    నన్ను శత్రువను మిత్రుడను నాకు లక్ష్యం లేదు ఎవరు తెగించగలరో వారి వెంటనే నేనూను నేనే శక్తినీ నేనే ప్రేరణనీ నేనే కోరికకి మూలాధారాన్ని నేనే ఆవేశాన్ని నేనే ప్రోత్సాహం, ఆలంబననూ నేనే గీతంగా మారే కెరటాలమీది చంద్రికనీ నన్ను శత్రువను మిత్రుడను నాకు లక్ష్యం లేదు మరణానికి వెరవక ఆలపించేవారివెంటే నేనూను నన్ను శత్రువను మిత్రుడను నేను ఇవ్వడానికే తీసుకుంటాను బ్రతకడానికి మరణించే వారి వెంటే నేనూను . లీ విల్సన్ డాడ్ అమెరికను కవి…

  • జూలై 21, 2015

    సన్యాసిని… మేరీ కెరోలీన్ డేవీస్ అమెరికను కవయిత్రి

    . ఈ రాత్రి ఆ చిన్ని సన్యాసిని మరణించింది ఆమె చేతులు గుండెలమీద ఉంచారు; అస్తమించబోతున్న సూర్యుడు ఆమె ప్రశాంతమైన కురులు ముద్దిడబోయాడు; కన్నీరొలుకుతూ ప్రవహిస్తున్న సెలయేటి తీరాన ఆమె సమాధి నిర్మించబడ్డది. ఆ బాల సన్యాసిని ఆత్మ ఆశ్చర్యపోతూ నెమ్మదిగా నిష్క్రమించింది ఆమె సోదరుడు క్రీస్తు నిలుచున్న కల్పవృక్షపునీడలోనికి. అతను నిట్టూర్చేడు; అతని ముఖం చూడగానే ఆమెకు కంట నీరు చిమ్మింది. ఆమె లేత చేతులు తన చేతులలోకి తీసుకుని ఆయన బాధ దిగమింగుతూ ఆశీర్వదించేడు;…

  • జూలై 20, 2015

    వెరసి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

    కత్తులు నొప్పెడతాయి నదులు బాగా చలివేస్తాయి ఏసిడ్ లు మరకలు వేస్తాయి మందులకి ఒళ్ళు బిగుసుకుంటుంది తుపాకులు చట్టవిరుద్ధం ఉరితాళ్ళు తెగిపోవచ్చు గేస్ భరించలేని వాసన …. నువ్వు బతకడమే ఉత్తమం. . డొరతీ పార్కర్ August 22, 1893 – June 7, 1967 అమెరికను కవయిత్రి Resumé . Razors pain you; Rivers are damp; Acids stain you; And drugs cause cramp. Guns aren’t lawful; Nooses give;…

  • జూలై 19, 2015

    పంచపాదులు…ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి

    1. ఒక నవంబరు రాత్రి జాగ్రత్తగా విను. వినీ వినిపించని సడితో ప్రేతాత్మల అడుగుల చప్పుడులా మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుండి వేరై క్రిందకి రాలుతున్నాయి. 2. ఆ మూడూ ఆ మూడూ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి… రాలుతున్న మంచూ వేకువకి ముందరి ఝాము అప్పుడే మరణించిన వాడి నోరూ… 3. సుసన్నా – పెద్దలూ “అవునూ, నువ్వు ఎందుకు ఆమె గురించి చెడు ప్రచారం చేస్తావు?” “ఆమె అందంగా సుకుమారంగా ఉంటుంది. అందుకు.” . ఎడిలేడ్…

  • జూలై 18, 2015

    ఓ ప్రకృతీ! … ఏలిస్ కార్బిన్, అమెరికను కవయిత్రి

    చీకటి వెలుగులతో, మృణ్మయ రూపివై నా కళ్ళెదుటే మార్పుచెందే ఓ ప్రకృతీ! నీలో ఎన్ని ప్రేమ, వెలుగుల గుప్త నిక్షేపాలున్నాయో కదా! ఓ ప్రకృతీ! సమర్థతనుమించిన అధికారం దొరికినందువలన నాకు ఒరిగేది ఏముంటుంది? ఉన్నదిమార్చనూ, నూతన సమతౌల్యాన్ని తేనూ సృష్టించనూ, నశింపజేయనూ గలనా? ఓ ప్రకృతీ! దానివల్ల ఏమి లాభం? నాకు సృష్టికర్తకున్నంత ఉత్సాహమున్నా నిన్ను నా ఊహలకి దరిదాపుగా కూడా నిన్ను నేను అనువుగా మలుచుకో లేనే! .  ఏలిస్ కార్బిన్ (April 16, 1881…

  • జూలై 17, 2015

    ప్రవాసి… జోసెఫ్ కాంప్ బెల్, ఐరిష్ కవి

    వాహనం ఇంటిముందు సిద్ధంగా ఉంది ఇక వేడుకలకి సమయం మించిపోయింది. రా, వాద్యకారుడా, నా కోసం రాగం ఆలపించు ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు ఈ రోజు పొలాలు చల్లగా చెమ్మగా ఉన్నాయి దడులు కంతలుపడ్డాయి, సొమ్ములు ముసిలివి ఒకప్పటిలా ఇప్పుడు ఏదీ ఉండటం లేదు ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు నాకు మనసులేకపోయినా, పోక తప్పదు నే నెవరినీ ఎరగని మనుషుల మధ్యకి. సేవించు, మిత్రమా, నా క్షేమంకోరి మద్యం…

  • జూలై 16, 2015

    Three Sixty Degrees of the City… Aranya Krishna, Telugu, Indian

    Products of casual friction of some nameless bodies Sans love, rapture or ecstasy,  These children drop down like meteorites onto the city’s pavements. The days that drip like drops of milk from time’s udder Freeze grimly on their black-ice-cube-like skins. Like dirty linen washed and hung in the open to dry Their bodies smack of…

←మునుపటి పుట
1 … 112 113 114 115 116 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు