Three Sixty Degrees of the City… Aranya Krishna, Telugu, Indian

Products of casual friction of some nameless bodies

Sans love, rapture or ecstasy, 

These children drop down like meteorites onto the city’s pavements.

The days that drip like drops of milk from time’s udder

Freeze grimly on their black-ice-cube-like skins.

Like dirty linen washed and hung in the open to dry

Their bodies smack of pangs of hunger.      

The enigmatic conflict between ‘life and living’

Casts gloom over their childhood like a sandstorm.

Their lifing answerable neither to their own lives nor to society 

Struggles floating like scum on the lava of crime.

Yet, they

Like an asylum of cuckoos hunted by a fowler

Never accost us about their future

Never beg us of their present

Nor they ever review their past.

They never despair, plain, dream or pray

For anything whatsoever.

With knees pared, and

Flies swarming over their tender palms sore

The prospects of this race seem deeply dented,

And wallowing in dirt and dust.

 ***

He chants a terribly vacuous song of nemesis  

Seldom audible to anybody,

And those that can hear … care a dime.

Death is its muted burden;

Memories peeking through the opium-heavy eyes

Travel from deep dark realms of consciousness

To the luminous domains of dreamy sleep.

Perhaps

They are reminiscing,

His mother’s death on the road vomiting blood,

Or some stray loitering dogs smelling at her

Or the lipstick-shrieks for help of his sister

Being forcibly taken away in a black car…

Before countless sufferings, humiliations, and privations of the past,

Or the bourns of some kindred sub-human experience.   

His mind that reeled mostly in ‘high’

Dies a wakeful death…

Ceasing with hiccups… gasping for breath.

His corpse now becomes a sail for someone else’s ship

Mark! The dead man till yesterday was

Childhood that roamed across the city streets. 

***

Mansions go aflame within the dark labia of the night

With the cold embrace of vibe-less balls of meat;

The tears that seep through the crevices of window

Shall incense the roads wafting in whiffs;    

Spiked boots run over

Those moaning bodies.

The conflict between heart and belly

Shall be moderated by

Either hunger… or by the truncheon.

Body changes hands

Like a corpse carried on a bier.

No diction can express the distress cries 

Of tender teenage nerves crushed by piggy gorilla hands.

Dark shadows loom large over all girlhood which

Till days ago gamboled in childy frolic.  

And, the Red Light Area beams

Like the gory cancerous growth on the society.

 .

Aranya Krishna

Aranya Krishna  Photo Courtesy:  BOOKS ADDA
Aranya Krishna
Photo Courtesy:
BOOKS ADDA

నగరకోణాలు

.

ప్రేమ పరవశం పులకింత పలకని

ఏ దేహాల యాదృచ్చిక రాపిడిలోనో

పేవ్ మెంట్ల మీద ఉల్కల్లా రాలిపడతారు

కాలం పొదుగునుండి పాల చుక్కలా జారిపడే రోజులన్నీ

నల్లమంచు ముక్కల్లాంటి వాళ్ళమీద కర్కశంగా ఘనీభవిస్తుంటాయి

రోడ్లమీద ఆరేసిన మురికిబట్టల్లాంటి వాళ్ళ శరీరాలు

ఆకలిమంట వాసన కొడుతుంటాయి.

సృష్ఠి స్రవంతికి మనుగడకి మధ్య అర్ధంకాని సంఘర్షణ

ఇసుకతుఫానై బాల్యం మీద ముసురుతుంటుంది

జీవితానికి సమాజానికి బాధ్యతలేని జీవనసరళి

నేరాల నిప్పుల బురదలో గిలగిలా కొట్టుకుంటుంది

అయినా

ఏ వేటగాడో నేలకూల్చిన కోకిల గుంపులాంటి వాళ్ళు

భవిష్యత్తుని ప్రశ్నించరు

వర్తమానాన్ని యాచించరు

గతాన్ని సమీక్షించరు

దేనికోసమూ

నిరాశపడరు బాధపడరు స్వప్నించరు ప్రార్ధించరు

వడగాడ్పులు కాల్చేసిన గులాబిరేకుల బుగ్గలతో

దోక్కుపోయిన మోకాళ్ళతో

అరచేతుల్లో ఈగలు ముసిరే పుళ్ళతో

ఈ జాతి భవిష్యత్ చిత్రం గాయపడినట్లుంటుంది

మట్టిలో దుమ్ములో పడి కొట్టుకుపోయినట్లుంటుంది

*

ఎవరూ వినిపించుకోని

అసలెవ్వరికీ వినబడని

బీభత్సంగా శూన్యమైపోయే ధ్వంసగీతాన్ని ఆలపిస్తుంటాడతను

పసికట్టలేని మృత్యువు దాని పల్లవి

నల్లమందు మత్తులో మూసుకుపోయిన కళ్ళనుండి జ్ఞాపకాల చూపులు

మెలుకువ చీకటి నుండి సుషుప్తి వెలుగువైపు ప్రసరిస్తాయి

బహుశ

అనేక బాధల ఆక్రోశాల అవమానాల ఆకలుల క్రితం

రోడ్డుమీద నెత్తురుకక్కుకు చచ్చిపోయిన అమ్మనో 

కుక్కలు వాసన చూస్తున్న దృశ్యాన్నో

నల్లకారులో లాక్కుపోబడుతున్న

అక్క లిప్ స్టిక్ పెదాలు చేసిన ఆర్తనాదాన్నో

మరే అమానవీయ అనుభవాల అంచులనో

ఆ చూపులు తడుముతుంటాయి

మత్తులో జీవించే హృదయం

స్పృహలో మరణిస్తుంది

జీవించేందుకు ప్రాణవాయువు దొరక్క అతనూ చచ్చిపోతాడు

అప్పుడతని శవం సంపాదనకు ముడిసరుకౌతుంది

మరణించిన అతగాడు

వీధుల్లో నిన్నటి బాల్యం సుమా!

****

స్పందించని మాంసం ముద్దల కౌగిలింతల చిటపటలలో

రాత్రి చీకటిపెదవుల మధ్య భవనాలు భగ్గుమంటాయి

కిటికీరెక్కలసందునుండి రాలిపడే కన్నీటి చుక్కలు

రోడ్లమీద సెంటుగా గుప్పుమంటాయి

మూలుగుతున్న శరీరాల మీద

మేకులు వేలాడే పాదాలు దిగబడతాయి

హృదయానికి దేహానికి మధ్య వైరుధ్యాన్ని

ఆకలి పరిష్కరిస్తుంది

లేదా కొరడా పరిష్కరిస్తుంది

మనసుని మృతపదార్ధంలా మోస్తూ

శరీరాలు చేతులు మారతాయి

గొరిల్లా ఇనుపచేతుల్లో చితికిపోయే

పదహారేళ్ళ లేలేత నరాలు చేసే ఆర్తనాదాలకు భాషలేదు

నిన్నటిదాకా తొక్కుడుబిళ్ళ ఆడుకున్న వయసుమీద

చీకటిబాణాలు పరుచుకుంటాయి

రెడ్ లైట్ ఏరియా

కేన్సర్ వ్యవస్థ నెత్తుటినోరులా ఎర్రగా మండుతుంటుంది.

.

(అరణ్యకృష్ణ)

“Three Sixty Degrees of the City… Aranya Krishna, Telugu, Indian”‌కి ఒక స్పందన

  1. Education of Nature ————— William Wordsworth
    A Slumber Did My Spirit Seal ———–William Wordsworth
    The World Is Too Much With Us ———- William Wordsworth

    Please translate above poems in telugu

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: