O Lord! Forgive the Killer!… Ashok Kumbamu, Telugu, Indian
O Lord!
Forgive the killer!
He is ignorant.
He is arrogant.
Except for its skin color
He can make out nothing of humanity
Poor creature! His devotion to the flag
Fans hatred towards other sections of the society.
Forgive him!
After all, he is your child,
Unfortunately,
He is addicted to
hunting and heap up people for game.
Shower your mercy on him
Embrace him with all your love.
O Lord!
We forgive the killer!
We have lost our children
Who spin the world around us;
We have lost our parents
Who caress us dearly and reassure us
In our crises and fatigues; and
We lost our grandparents
Who kindle sweet hopes about the insecure future
Reminiscing the dark and moony days of the past and present.
After all the connections
Across generations are devastated,
And the perennial flow of blood,
The simmering grief
And sweeping tears
Come to a freeze
What more is left for us
Than to forgive the offender?
Our lives valueless
Uncertain existence
And nescience to cognize death’s varied forms…
They are not of any consequence now.
The only test left to establish our humanness now
Is to prove that we are still humane.
He must punish us for no fault
And we should forgive him unconditionally.
Isn’t it our duty, our lord!?
.
Ashok Kumbamu

Ashok Kumbamu was born and brought up in a peasant family in Azmapur (village), Nalgonda district, Telangana State. He received his Bachelor of Arts (Philosophy, Sociology and Psychology) degree from Nizam College, Hyderabad. He was awarded the Netherlands Fellowship Program scholarship to pursue his Master’s degree in Development Studies at the International Institute of Social Studies at Hague, Netherlands. He received his PhD in Sociology from the University of Alberta, Edmonton, Canada, and completed his post-doctoral fellowship at the same institution. Since 2012 he has been working as an Assistant Professor of Bioethics at Mayo Clinic, Rochester, Minnesota.
ఓ ప్రభువా! హంతకుడిని క్షమించు
.
ఓ ప్రభువా!
హంతకుడిని క్షమించు
వాడు అజ్ఞాని
అహంకారి
మనిషి రంగు తప్ప
మనిషితనం ఎరగనోడు
జెండాల మీద ప్రేమేతప్ప
జనంతో కలసి బ్రతకలేనోడు
వాడు నీ బిడ్డడె
కాకపోతే
మానవవేట మరిగినోడు
మనషులను కాల్చి కుప్పేయడం నేర్చినోడు
వాడిని దయతో దీవించు
కరుణతో లాలించు
ఓ ప్రభువా!
మేము హంతకుడిని
క్షమిస్తున్నాము
ప్రంపంచాన్ని మా చేతులచుట్టూ తిప్పే
మా పిల్లల పోగొట్టుకున్నాము
అలసటొచ్చినప్పుడో, ఆపదొచ్చినప్పుడో
తలనిమిరి ధైర్యమిచ్చె
అమ్మా, నాన్నల పోగొట్టుకున్నాము
గత,వర్తమానాల కష్టసుఖాలు తలపోస్తూ
అభద్రమైన భవిష్యత్తుపై సహితం అందమైన ఆశలు రేపే
తాతల, అవ్వల పోగొట్టుకున్నాము
తరతరాల వంతెనలన్నీ ద్వంసమయిపోయి
పారుతున్న నెత్తురు
పొంగుతున్న దుఖం
కారుతున్న కన్నీళ్ళు
గడ్డకట్టుక పోయాక
ఇక చివరకు మిగిలింది
హంతకుడిని క్షమించుడే కదా!
విలువలేని బ్రతుకులు
ఎప్పుడు పోతవో తెలియని ప్రాణాలు
మృత్యువు రూపాన్నికనిపెట్టలేని జీవితాలు
ఇవేవీ ముఖ్యం కాదు
మేము మనుషులమా కాదా అని అంచనా వేయడానికి
ఇప్పుడు పరీక్షకు నిలిచింది మా మానవత్వ నిరూపణే
వాడు శిక్షించాలి
మేము క్షమించాలి
అదే కదా ధర్మం, ప్రభువా!
.
Ashok Kumbamu
(అమెరికాలోని చార్లెస్టన్ నగరంలో నల్లజాతి వారి చర్చి మీద దాడి చేసి తొమ్మిది మందిని చంపిన 24 గంటలలోపే మృతుల కుటుంబాలు తెల్లజాతి హంతకుడిని క్షమిస్తున్నామని చేసిన ప్రకటనకు స్పందనగ.)
June 23, 2015 Rochester MN
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి