-
అర్థ రాత్రి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
తారకలు పువ్వుల్లా మెత్తగానూ, అంత చేరికలోనూ ఉన్నాయి; కొండలు నెమ్మదిగా వడికిన క్రీనీడల వలల్లా ఉన్నాయి; ఇక్కడ ఆకునీ, గడ్డిపరకనీ విడిగా చూడలేము అన్ని ఒకటిగా కలిసిపోయి ఉన్నాయి. ఏ వెన్నెల తునకా గాలిని చొచ్చుకుని రాదు, ఒక నీలి వెలుగు కిరణం బద్ధకంగా దొరలి అంతలో ఆరిపోయింది. ఈ రాతిరి ఎక్కడా పదునైన వస్తువేదీ కనరాదు ఒక్క నా గుండెలో తప్ప. . డొరతీ పార్కర్ ఆగష్టు 22, 1893 – జూన్ 7, 1967…
-
కళ్ళు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
చక్కని నా కనులారా, ఒకప్పుడున్న నిపుణత మీలో లేదు మునపంటి కంటే వస్తువుల స్పష్టత వాసి తగ్గింది, అవే రంగువయితే, మసక మసకగా ఉన్నాయి, ఒకప్పుడు మీరు రాజుగారి వేటకుక్కల్లా చూసేవారు అప్పుడు నేను ఉదయాన్నే మీతో వ్యాహ్యాళికి వెళ్ళేవాడిని చురుకైన నా చూపులారా మీరు చాలా వస్తువుల్ని చూశారు: నేలలూ, నగరాలూ, ద్వీపాలూ, మహా సముద్రాలూ మనం జోడుగా అద్భుతమైన సూర్యోదయాల్ని చూసేము అప్పుడే కురిసిన మంచు గట్టిపడుతున్నవేళల్లో చిరుగాలి అడుగుజాడల్లో మనం పరిగెత్తాము. అప్పుడు…
-
ఏంటెన్నాల అడవి… రాల్ఫ్ జాకొబ్సెన్, నార్వేజియన్ కవి
ఈ మహానగర గృహాగ్రాల మీద విశాలమైన క్షేత్రాలున్నాయి. దిగువ వీధుల్లో దానికి చోటు లేకపోవడంతో నిశ్శబ్దం అక్కడిదాకా ఎగబ్రాకవలసి వచ్చింది. ఇప్పుడక్కడ ఒక అడవి మొలిచింది చెట్టు మీద చెట్టు పెరిగి చిత్రమైన తోపులు తయారయాయి. నేల మరీ గట్టిగా ఉండడంతో అవేమీ పెద్దగా బలియలేదు కనుక అవి చిన్న చిట్టడవిలా తయారయ్యాయి తూర్పుకి ఒక కొమ్మా, పడమటికి ఒక కొమ్మా చివరకి శిలువగుర్తుల్లా పెరుగుతూ … శిలువల అడవి. గాలి ప్రశ్నిస్తోంది: ఈ దట్టమైన చిట్టడవిలో,…
-
తోటలోని విగ్రహం… ఏగ్నెస్ లీ, అమెరికను కవయిత్రి
నన్నీ చలువరాయి దొరకబుచ్చుకునేవరకు దేవతని ఓ పవనమా, పవనమా, ఆలస్యం చెయ్యకు! నా ఆత్మను ఎగరేసుకుపో కిసలయాలు కిరీటాలయే ఎత్తుకి! అయ్యో ఈ గాలి వినిపించుకోదేమి? సరే, ఆగు ఆగు నా మాట విను చిన్ని పిచ్చుకా! నాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది తెలుసా ఒకప్పుడు నేను అపోలో గుండెమీద వాలి ఉండేదాన్ని! అరే ఒక పిట్టా నన్ను పట్టించుకోదే. ఇక్కడ రోజులన్నీ వింతగా ఉన్నాయి, కలకూజితాలతో నాకు రోజూ తెల్లవారుతుంది! కాని బోసిపోయిన నాభుజాలమీద,…
-
అన్ని అందమైన ఆకారాల్నీ చీకటి సొంతం చేసుకుంటుంది కానీ, అబ్బా, ఆమె రెండు నల్లని అరచేతులూ ఎర్రగా ఉంటాయి. నేను మృత్యువుకి భయపడతాను, మృతులకి కాదు ఈ చీకటి పొత్తానికికాదు, ఎరుపుకీ, భయంకర దృశ్యాలకీ గడ్డిలో మంచుబిందువుల్లా, దీపాలు తెల్లగా ఉన్నాయి ఎక్కడా చలనం లేక ఈ నగరం శ్మశానంలా ఉంది నల్లగా, చీకటి ఆవరించింది. ఇంత త్వరలో మరో గాయపడ్డ సూర్యాస్తమయమొచ్చే అవకాశం లేదు. కాబట్టి, నేను తీరుబడిగా ఈ చీకటి పేజీలు తిరగేస్తాను నల్లగా…
-
పర్వతాగ్రాలనుండి … జార్జి స్టెర్లింగ్… అమెరికను కవి
ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం… వేకువనే బయలు దేరిన మనం ఉదయకాంతి వేగంతో చరించే గాలిని అనుసరిస్తూ ఎడారుల హద్దుల్ని కనుక్కుందికి: దైవం గర్హించే మన ఆశల తీరాలని వెదికినవారమై. ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం… దారి తప్పి చాలా దూరం పోయిన మనం నడి మధాహ్నం వేళకి, విపత్కరమైన చోట్ల జేరి, చెట్టుకొననున్న పిట్టగూళ్ళకీ, పగటిచుక్కకీ నడుమనున్న పర్వతాల ఎత్తేదో తెలుసుకున్నవాళ్లమై ముఖం మీద సాయం సంధ్యపులుముకుని…
-
తాగుబోతు వీధి… రాల్ఫ్ హాడ్జ్ సన్, ఇంగ్లీషు కవి
కొన్ని కవితలు చూడడానికి సీదా సాదాగా ఉంటాయి గాని వాటి భావ విస్తృతి చాలా అధికంగా ఉంటుంది. క్రిమి సంహారక మందులు వేసి పిచ్చుకలలాంటి పిట్టలకి ఆహారం దొరక్కుండా వాటిని అంతం చేస్తే, మందుల ప్రభావానికి తట్టుకుని నిలబడ్డ క్రిములు ఇప్పుడు పంటలకు పెద్ద నష్టం కలిగిస్తున్నాయి. వర్థమాన దేశాలూ, జనాభా అధికంగా ఉన్న దేశాల్లో, Walmart, HEB, Ikea వంటి పెద్ద పెద్ద మాల్స్ వస్తే, వాటిని మధ్యతరగతి ప్రజలు వాళ్లిచ్చే కూపన్ల ఆశలకు ప్రోత్సహించడం…
-
Worldly Wisdom…Narayana Swamy Venkatayogi, Telugu, Indian
Yes, you are right I am not worldly-wise Abetting my farmland Water streams past… Yet, it lies famine dry. I surrender my priceless fields At throw away price to you, And work for wages in my own farm. To the tall promises Of buildings and skyscrapers I give up my land in lots unwittingly…
-
ఓ నా దేశవాసులారా!… కవి ప్రదీప్, హిందీ, భారతీయకవి
మిత్రులందరికీ 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 1963 వ సంవత్సరం గణతంత్రదినోత్సవం సందర్భంగా లతా మంగేష్కర్ ప్రముఖ హిందీ కవి ప్రదీప్ వ్రాసిన ఈ గీతాన్ని, అప్పటి ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ సమక్షంలో జనవరి 27న National Stadium లో ఆలపించేరు. ఆ గీతాన్ని ఇక్కడ వినండి ఓ నా దేశవాసులారా! మీ కనుల్లో నీరు నింపండి మీ నోరారా నినాదాలు ఇవ్వండి ఈ రోజు మనందరికీ శుభదినం మువ్వన్నెల జండా ఎగరెయ్యండి కానీ,…