ఏంటెన్నాల అడవి… రాల్ఫ్ జాకొబ్సెన్, నార్వేజియన్ కవి

ఈ మహానగర గృహాగ్రాల మీద విశాలమైన క్షేత్రాలున్నాయి.

దిగువ వీధుల్లో దానికి చోటు లేకపోవడంతో

నిశ్శబ్దం అక్కడిదాకా ఎగబ్రాకవలసి వచ్చింది.

ఇప్పుడక్కడ ఒక అడవి మొలిచింది

చెట్టు మీద చెట్టు పెరిగి చిత్రమైన తోపులు తయారయాయి.

నేల మరీ గట్టిగా ఉండడంతో అవేమీ పెద్దగా బలియలేదు

కనుక అవి చిన్న చిట్టడవిలా తయారయ్యాయి

తూర్పుకి ఒక కొమ్మా, పడమటికి ఒక కొమ్మా

చివరకి శిలువగుర్తుల్లా పెరుగుతూ … శిలువల అడవి.

గాలి ప్రశ్నిస్తోంది:

ఈ దట్టమైన చిట్టడవిలో,

పాపం, ఎవరివీ సమాధులు?

.

రాల్ఫ్ జాకొబ్సెన్

8 March 1907 – 20 February 1994

నార్వేజియన్ కవి

Rolf Jacobsen

.

Antenna-forest

.

Up on the city’s roofs there are large fields.

That’s where silence crept up to

when there was no room for it on the streets.

Now the forest comes in its turn.

It needs to be where silence lives.

Tree upon tree in strange groves.

They don’t do very well, because the floor is too hard.

So they make a sparse forest, one branch toward the east,

and one toward the west. Until it looks like crosses. A forest

of crosses. And the wind asks

– Who’s resting here

in these deep graves?

.

Rolf Jacobsen

8 March 1907 – 20 February 1994

Norwegian Poet 

(From “North In The World”  Translated from Norwegian by Roger Greenwald)

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.com/2005/06/antenna-forest-rolf-jacobsen.html  

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.