వర్గం: అనువాదాలు
-
ఒక కన్నియ రోదన … వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
ఒకప్పుడతన్ని ప్రేమించలేదు; ఇప్పుడతను లేడు నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. అతను మాటాడుతుంటే మందలించాను; అతను మాటాడగలిగితే ఎంత బాగుండును. అయ్యో!ఇపుడు నేను మందలించను కదా! ఒకప్పుడు అతన్ని ప్రేమించకపోవడానికి కారణాలు వెతికేను అలసిపోయేదాకా నా ఆలోచనలన్నీ గిలకొడుతూ అతన్నీ విసిగించేను,నేనూ వేసారేను; నిన్నటి వరకు నా కోసం జీవించిన అతనే గనుక బ్రతికి రాగలిగితే ఇపుడు నా ప్రేమని అతనికి ఇవ్వడానికి సుముఖమే; ఎప్పుడైతే అతను వృధాశ్రమ అనుకున్నాడో, అతని ముఖాన్ని పవిత్రప్రదేశంలో మృత్యుచాయలో చాటుచేసుకున్నాడు. తన…
-
నీ రోజులు ముగిసిపోయాయి… లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి
నీ రోజులు ముగిసిపోయాయి… నీ కీర్తి మొదలయింది ఇకనుండి ఈ దేశపు గీతాలు తమ అభిమాన పుత్రుడి విజయాలనీ అతని కరవాల విహారాన్నీ కీర్తిస్తాయి అతని వీర గాధలూ, జయించిన సామ్రాజ్యాలూ అతను పునరుద్ధరించిన స్వాతంత్య్రాన్నీ. నువ్వు రాలిపోయినా, మేము స్వేఛ్ఛగా జీవించినంతకాలమూ నీకు మరణం లేదు! నీ శరీరంలోంచి పారిన నెత్తుటేరులు నేలలోకి ఇంకడానికి విముఖతచూపించాయి. అవి మా రక్తనాళాల్లో ప్రవహిస్తున్నాయి, నీ సాహసం మాకు ఊపిరిగా నిలబడుతుంది! నీ పేరు, ముందుకి ఉరుకుతున్న మా…
-
ఆశ్చర్యమా?… ఇబ్న్ అరాబీ, అరబిక్ కవి, సూఫీ
మంటల మధ్యలో ఈ పూలతోట ఏమిటని ఆశ్చర్యంగా ఉందా?! నా మనసు ఏ ఆకృతినైనా దాల్చగలదు: జింకలకి పచ్చికబీడులా సన్యాసులకి మఠంలా విగ్రహాలకి పవిత్రస్థలంగా తీర్థయాత్రికుడికి ‘కాబా’గా, ‘తోరా’ లకు వ్యాసపీఠాల్లా ఖురాను కి ‘కవిలె ‘ ల్లా నా నమ్మిక ప్రేమ; ఆ పథికులు ఏ మార్గం అనుసరిస్తే అదే నా విశ్వాసం అదే నా మతం. . ఇబ్న్ అరాబీ (25 July 1165 – 8 November 1240) అరబ్బీ కవి, సూఫీ…
-
అంకితం… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
ఇదే నీకు నా మొదటిదీ కడసారిదీ బహుమతి ఈ చిన్ని కవితాగుచ్చాన్ని అంకితం ఇస్తున్నాను. నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి ఈ కవితలే వాటిని ఉన్నవున్నట్టుగా నీకు సమర్పిస్తున్నాను. నేను మత్తులో లేకుండా నిజం చెబుతున్నాను, నీ దృష్టికి వీటిని ఎప్పుడో తీసుకురావలసింది తీసుకువచ్చి, నా మనసుతో నింపిన ఈ కీర్తనలని నువ్వు మెచ్చుకుంటే ఎంతో బాగుండేది ఈ దయలేని ప్రపంచం అంతా, ముక్త కంఠంతో నాకూ, నా కవితలకూ, ఎంతకీ ఆగని కరతాళధ్వనులతో…
-
నేను అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను… అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి
నేను వివేకంగా, అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను: ఆకాశం వంక చూడడం, దేవుణ్ణి ప్రార్థించడం, అతివేలమయిన నా కష్టాలు మరిచిపోడానికి చీకటిపడకముందే ఎక్కువదూరం అలా నడవడం. కొండవాలులో అంట్రింత చెట్లు గలగలలాడుతున్నపుడూ, సంజెరంగులోని బెర్రీపళ్ళు గుత్తులుగా వాలినపుడూ నేను ఆనందంగా కవితలు అల్లుకుంటాను… నశ్వరమైన జీవితంగురించీ, సౌందర్యం, మృత్యువుగురించీ. నేను ఇంటికి తిరిగి వస్తాను. మెత్తని బొచ్చుగల పెంపుడుపిల్లి నా అరచేతిని నాకుతుంది. ముద్దుగా కులుకుతుంది. చెరువుగట్టుననున్న రంపపు మిల్లు పొగగొట్టం కొస క్రింద పొయ్యిలో చెలరేగుతున్న మంటలకి…
-
వాయిదా పడిన కల… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
వాయిదా పడిన కల ఏమవుతుంది? ఎండబెట్టిన ద్రాక్షలా ఎండిపోయి ఒరుగు అయిపోతుందా? పుండులా సలిపి సలిపి తర్వాత రసి కారుతుందా? కుళ్ళిపోయిన మాంసంలా కంపుకొడుతుందా? ముదురుపాకంతో చేసిన మిఠాయికి పైన పంచదారలా పేరుకుంటుందా? బహుశా భారీ బరువుకి అది క్రిందకి సాగిపోతుందేమో! లేక, కొంపతీసి విస్ఫోటిస్తుందా?! . లాంగ్స్టన్ హ్యూజ్ (February 1, 1902 – May 22, 1967) అమెరికను కవి Dream Deferred . What happens to a dream deferred? Does…
-
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి. … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి అది మనసుమీద అలవోకగా వాలుతుంది. మాటలులేని మౌనగీతాన్ని ఆలపిస్తుంది ఆ పాటకి ముగింపు లేదు. అందులో మలయమారుతపు తియ్యందనాలు వినిపిస్తాయి తుఫానుల ప్రచండ ఝంఝ నినదిస్తుంది ఆ పిట్టని విహ్వలము చెయ్యవచ్చునేమో గాని దానిపాట మాత్రం ఎందరి ఎదలనో రగుల్కొలుపుతుంది. అతిశీతలదేశంలో ఆ పాట నేను విన్నాను ఎన్నడూ ఎరుగని సముద్ర తరంగాలమీదా విన్నాను; కానీ, ఎన్నడూ, ఎంత దైన్యంలోనూ “నాకో రొట్టెముక్క పెట్టవా?” అని యాచించలేదు. . ఎమిలీ డికిన్సన్…
-
సానెట్ 38… షున్ తారో తనికావా, జపనీస్ కవి
(దూరం అన్న ప్రాథమిక భావనని తీసుకుని అద్భుతంగా అల్లిన కవిత ఇది. “దూరపు కొండలు నునుపు” అని మనకు ఒక సామెత. దూరాలు లోపాలని గ్రహించలేనంతగా, లేదా పట్టించుకోలేనంతగా చేస్తాయి. ఈ దూరమే మనుషుల్ని దగ్గరకు చేరాలన్న ఆరాటాన్ని కలిగిసుంది. కానీ, దగ్గరగా ఎక్కువకాలం ఉన్నకొద్దీ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మధ్య దూరాన్ని సృష్టిస్తాయి. కొంతకాలం గడిచేక ఈ దూరాలు కల్పించిన అవగాహనలేమి, ఈ లోపాలనన్నిటినీ కప్పిపుచ్చి మళ్ళీ మనల్ని ఒక సుందర దృశ్యంగా మలుస్తాయి.…
-
Is This All Man, After All?!… Mercy Margaret, Telugu, Indian
Mounds of scattered flesh smelling still fresh ooze blood. Head to one side, and severed hands and legs the other side. The position of the corpse suggests the victim had tried to jump on the run and dropped dead. The torso, hanging half on either side of the wall seems to wail for the…
-
Sidara Sendrayya… Aruna Sagar, Telugu, Indian
When he laughs the river glitters; When he gets neck deep into it It would embrace him in a vortex. The River is so fond of him. Sitting on its bank He engages in sweet nothings with her; braving the speeding waters he dares to stall it with his hand. The river likes that gesture.…