సానెట్ 38… షున్ తారో తనికావా, జపనీస్ కవి

(దూరం అన్న ప్రాథమిక భావనని తీసుకుని అద్భుతంగా అల్లిన కవిత ఇది. “దూరపు కొండలు నునుపు” అని మనకు ఒక సామెత. దూరాలు లోపాలని గ్రహించలేనంతగా, లేదా పట్టించుకోలేనంతగా చేస్తాయి. ఈ దూరమే మనుషుల్ని దగ్గరకు చేరాలన్న ఆరాటాన్ని కలిగిసుంది. కానీ, దగ్గరగా ఎక్కువకాలం ఉన్నకొద్దీ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మధ్య దూరాన్ని సృష్టిస్తాయి. కొంతకాలం గడిచేక ఈ దూరాలు కల్పించిన అవగాహనలేమి, ఈ లోపాలనన్నిటినీ కప్పిపుచ్చి మళ్ళీ మనల్ని ఒక సుందర దృశ్యంగా మలుస్తాయి. దీనికి ఉదాహరణగా ఎంతమంది వ్యక్తుల్నైనా మనం చూడొచ్చు. ఒక తరంలో బ్రతికిన వ్యక్తులు, కొందరు వ్యక్తులలోని లోపాలు మాత్రమే చూస్తూ దూరాలు సృష్టించుకుంటారు. ఆ వ్యక్తుల్ని ఏమాత్రం తెలియని వాళ్ళకి వాళ్ళ ప్రతిభ (అదిగూడాదూరాన్నుంచి చూడటంవల్లనే) చాలా గొప్పగా కనిపిస్తుంది. కాలం ఆ వ్యక్తుల్ని హరించిన తర్వాత, వాళ్లతో పాటే వాళ్లలోపాలూ దూరమైపోతాయి. కాలం దూరాన్ని పెంచుతున్నకొద్దీ కొందరు తాము బ్రతికినప్పటికంటే ఎక్కువ పేరునో, (మంచి కనిపించనపుడు) ఎక్కువ అపకీర్తినో సంపాదిస్తూంటారు. ఆ వ్యక్తులు కవులో, కళాకారులో, తల్లిదండ్రులో, గురువులో, స్నేహితులో ఎవరైనా కావచ్చు. మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే అటువంటి వ్యక్తులు మనకు చాలమంది స్ఫురిస్తారు. ఈ దూరమే మంచిగానో, చెడుగానో, ఒక Myth సృష్టిస్తుంది.)

***

మహాపర్వతాలు మహాపర్వతాలుగా కనిపించడానికి కారణం
వాటికీ మనకీ మధ్యనున్న అనంతదూరాలు.
దగ్గరనుండి జాగ్రత్తగా గమనిస్తే
వాటిలోనూ నా పోలికలు కనిపిస్తాయి.

విశాలమైన దృశ్యాలు మనుషుల్ని నిలువునా ఆశ్చర్యచకితుల్ని చేస్తూ
వాటికీ తమకూ మధ్యనున్న అనంతదూరాల్ని మరోసారి గుర్తుచేస్తాయి.
నిజానికి వాటి అనంత దూరాలే
మనుషుల్ని మనుషులుగా చేస్తాయి.

ఇంతకీ, మనుషుల అంతరాంతరాల్లో కూడా
అనంతదూరాలు లేకపోలేదు.
అందుకే కొందరిపట్ల మరికొందరికి అంత ఆరాటం…

కానీ, త్వరలోనే వాళ్ళు తమని తాము
దూరాలు వంచించిన క్షేత్రాలుగా,
ఎవరూ పట్టించుకోని స్థలాలుగా గ్రహిస్తారు.
వాళ్ళిప్పుడొక సుందర ప్రకృతిదృశ్యంగా మిగిలిపోతారు.
.
షున్ తారో తనికావా
జననం 1931
జపనీస్ కవి

Sonnet 38

.

It’s distance that makes
mountains mountains.
Looked at closely,
they start to resemble me.

Vast panoramas stop people in their tracks
and make them conscious of the engulfing distances.
Those very distances make people
the people they are.

Yet people can also contain distances
inside themselves,
which is why they go on yearning…

They soon find they’re just places violated by distances,
and no longer observed.
They have then become scenery.

(From 63 Sonnets)

Shuntaro Tanikawa

Born 1931

Read the bio of the poet  here

Poem Courtesy:

 http://www.thethepoetry.com/2011/09/poem-of-the-week-shuntaro-tanikawa/

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: