Mounds of scattered flesh
smelling
still fresh
ooze blood.
Head to one side,
and severed hands and legs the other side.
The position of the corpse
suggests the victim had tried
to jump on the run and dropped dead.
The torso, hanging
half on either side of the wall
seems to wail for the division.
On the severed
Hand
an eon old tattoo
“Jyoti”…
if she were a mistress or a kin,
but the blood seems to kiss it ardently
bathing it .
God knows who tied that thread
On his wrist seeking his blessings,
but damp with warm blood,
and looking gorier, seems to question
they very god about his blessings?
He seems to hail from a rich and pompous family
Two gold rings adorn his fingers.
The wailing bracelet flung afar
seems to ask what happened to his pomposity?
And the purse slipped the other way
was heavy with money.
The person is not clear
In the blood-washed photo
could be his love eagerly awaiting him at home.
Hounds got down from police jeep
And smelt the corpse and its surrounds thoroughly
before running out to trace the culprits.
The SIM card peeping out
from the cellphone broke to pieces
faints grieving for its being incarceration in the socket
and nobody cares anymore for her vault of numbers.
Yet, police meddle with it.
And the crow-set hovering above
seems to ask : “What you felt while alive?
What you have reduced to after you are dead?”
But the bystander, me, is seized
with a clueless array of questions:
“Who is the ‘being’ ? The body now torn to pieces?
Or there was somebody who resided within
and drove the body?”
As a vague vacuous feeling surrounded me
In spells of recurring resilient thoughts,
Cutting them short in streaming tears
I wondered:
How long is my lease as man?
How soon shall they treat me as ‘body’ than ‘person’?
.
Mercy Margaret
Telugu
Indian

B Mercy Margaret
ఇంతేనా మనిషంటే?
.
చెల్లాచెదురై పడి ఉన్న మాంసపు ముద్దలు
ఇంకా తడి ఆరక
వాసనకొడుతూ
రక్తం స్రవిస్తూనే ఉన్నాయి.
తల ఒకవైపు
తెగిపడ్డకాళ్ళూ చేతులూ మరోవైపు
పరుగెత్తి దూకబోయి పడినట్టుంది
శవం
గోడకు అటూ ఇటూ సగంసగంగా పడిన దేహం
నేను అటు ఇటు అని రోదిస్తున్నట్టుంది.
తెగిపడున్న
చేతిపైన
ఎప్పుడో పొడిపించుకున్న పచ్చబొట్టు
“జ్యోతి”
ప్రేయసో, రక్తబంధువో
ఆ పేరును రక్తాభిషేకం చేస్తూ
ముద్దాడుతున్నట్టుంది.
ఏ రక్ష కోసం ఎవరు కట్టారో
ఆ చేతి మణికట్టుకు దారం
రక్తంలో తడిచి ఇంకానెత్తుటికళనింపుకుని
దాని వెనకదాగిన దేవుని
దీవెనలక్కడని ఊడిపోతూ ఆ దైవాన్ని
ప్రశ్నిస్తున్నట్టుంది.
డాబు దర్పం ఉన్న ఇంటివాడిలా ఉన్నాడు
రెండువేళ్ళకి బంగారు ఉంగరాలు
అటుప్రక్కజారిపడిఉన్న కడియం
నీ దర్పం ఏమయ్యిందని
విలపిస్తూ ఏడుస్తున్నట్టుంది
మరోప్రక్క
పడిపోయిన పర్సునిండా డబ్బు
రక్తసిక్తమైన ఫోటో
కనీ కనిపించకుండా
ఎదురుచూస్తున్న ప్రేమకాబోలు
జీపునుండికుక్కలు దిగాయి
శవం అణువణువునా వాసనచూస్తూ
చుట్టుప్రక్కల ఉరకలు పెడుతూ
ముక్కలైన సెల్ ఫోనునుంచి
ఇంకాతన అంకెలెవరికిపట్టవని ఏడుస్తూ
మూర్చిల్లిన సిమ్ కార్డు
బయటకి రాలేక అందులోనే ఇరుక్కుని
అయినా బయటకి లాగిచూస్తున్న పోలీసులు.
బ్రతికున్నప్పుడు నువ్వెవరు?
ఇప్పుడు నీవెవరని?
ప్రశ్నిస్తున్నట్టు
పైన తిరుగుతున్న కాకులగోల.
ఒకప్రక్కగా నిలబడిన నేను
–“ముక్కలైన దేహమే మనిషా?
మనిషిలో ఇన్ని రోజులూ ఉండి
నడిపించిన ఆ ఇంకెవరో మనిషా?” అని
ప్రశ్నించుకుంటూ
వలయాలుగా చుట్టుకున్న శూన్యం
చెవులగుండా దండయాత్ర చేస్తుంటే
కళ్ళనుంచి నీళ్ళుగా నరికి బయటకి నెడుతూ
బ్రతికున్న నా ఉనికెంతసేపని
మనిషిగా నన్ను పిలిచే కాలం ఎంతసేపని
ఏదో ప్రశ్నావళితో చుట్టబడిన
… నేను?
.
మెర్సీ మార్గరెట్
స్పందించండి