వర్గం: అనువాదాలు
-
One Sunday Afternoon… Mohan Rishi, Telugu, Indian
All the guests had left. Mother and I… remained. It was my innocence to long If only the guests all had remained! That nobody remains forever at any place… Is the quintessence of mother’s looks! While I stopped in the hall itself She was after cleaning up kitchen mess. After a…
-
Long long ago…Kavi Yakoob, Telugu, Indian
Like a bear hiding in the Ebony vale Desire smoulders in the bod. People are off towards the glen With weapons to drive it out. … But, what about this bod? There are snares all around … Ambushes galore. Neither is it alarmed Nor stirs. It drives on its own or attacks. But can…
-
కడలి గాచిన వెన్నెల… విక్టర్ హ్యూగో, ఫ్రెంచి కవి
చంద్రుడు ప్రశాంతంగా కడలి తరంగాలమీద ఆడుతున్నాడు— కిటికీ ఇంకా తెరిచే ఉంది, తెమ్మెరకి ఆహ్వానం పలుకుతూ, సుల్తాన కళ్ళార్పక చూస్తోంది, చీకటి ద్వీపాలపై జలతారు పరదాల మాటున కడలికూడా నిట్టూరుస్తోంది. వణుకుతున్న ఆమె చేతుల్లోంచి వీణ పక్కకి ఒరిగింది. ఒక మెత్తని స్వరం ఎక్కడో కలుక్కున ప్రతిధ్వనించడం ఆమె వింది. గ్రీసు ద్వీపాలనుండి టార్టారు పడవలపై అడక వేసుకుంటూ కోస్ తీరాలనుండి వచ్చే తురుష్క వ్యాపారిది కాదుగద? సముద్రపు కాకులు ఒకదాని వెనక ఒకటి కెరటాలదొంతరలని తరుగుతూ,…
-
24-42 … Dr. Pulipati Guruswamy, Telugu, Indian
Read whichever way Grief is the fate of the fated. . Reflection knows The heart standing in front. . Dreams, doubling up Petrify gradually In their dance spree. . My breath of fancy within evaporates For a whiff of your consent. . Who is going to join The parting ways? . Somebody knit Darkness around…
-
యవ్వనమూ – ముదిమీ… ఛార్ల్స్ కింగ్స్ లీ ఇంగ్లీషు కవి
కుర్రాడా! ప్రపంచం అంతా కొత్తగా ఉన్నప్పుడు ప్రకృతి అంతా పచ్చగా కనిపిస్తున్నప్పుడు; బాబూ! ప్రతి బాతూ హంసలాగానూ, ప్రతి పిల్లా మహరాణిలానూ కనిపిస్తున్నప్పుడు; బాలకా! అప్పుడు గుర్రాన్నీ బూటునీ వెతుక్కుని దేశాటన చెయ్యడానికి పోవాలి; పిల్లడా! యువరక్తం దాని దారి అది వెతుక్కోవాలి, ప్రతి జీవికీ దాని రోజంటూ ఒకటి ఉంటుంది. కుర్రాడా! ప్రపంచం అంతా పాతబడిపోయినప్పుడు చెట్లన్నీ పచ్చదాన్ని కోల్పోయినపుడు; బాబూ! ఏ క్రీడలోనూ ఉత్సాహం దొరకనప్పుడు బండి చక్రాలన్నీ అరిగిపోయినప్పుడు; ఇంటికి మెల్లగా చేరుకో;…
-
నీగ్రో గాయకుడు… జేమ్స్ డేవిడ్ కొరోదర్స్, అమెరికను కవి
నా పాటలన్నిటిమీదా పరివ్యాప్తమై ఒక ముఖం జాడ ఉంటుంది; అడవిలో పెరిగే అందమైన పూల మీద నీడలా. ఆ ఆనందపారవశ్యంలో కమ్మని కలలొస్తాయి ; అంత అద్భుతమైన వీణ అందిచ్చిన ఆనందమూ, నిమ్న జాతి గాయకుడికి ఆశీస్సులీయగల అనుకంప కలిగించలేకపోతుంది. ఇది నన్ను చాలా కాలం వేధించింది; అందులో చిత్రమైన వేళల్లో: అప్పుడు హీరా ఉద్యానాలు, సింథియా పొదరిళ్ళూ కళకళలాడుతున్నై; ఎక్కడో దూరంగా ఏకాంతంగా ఉన్న ఎర్రని ఆశల తోరణాలతో… అయినా నన్ను మరింత లోతుగా తవ్వి…
-
అద్భుతమైన లుకేషియా స్నేహనికి గురుతుగా… కేథరీన్ ఫిలిప్స్, వెల్ష్ కవయిత్రి
ఆనందం పరాకాష్ఠకు చేరిన ఈ క్షణం దాకా నా జీవితం జీవితం కాదు. అపవాదుల భయం లేకుండా నేనిపుడు అనొచ్చు, నేను నీదాన్ని కాదు, నేను నువ్వే. ఈ కాయము శ్వాసించింది, నడిచింది, నిద్రించింది దానితో ప్రపంచం అంతా నమ్మింది ఇందులో ఆత్మ ఉండి ఈ పనులన్నీ చేయిస్తోందని. కాని వాళ్ళంతా పొరబడ్డారు. ఎందుకంటే, కీ ఇచ్చిన వాచీ నడిచిన తంతే నా చేష్టలూను; నిన్ను కలిసినదాకా ఈ ఒరిండాకి ఆత్మ అంటూ ఒకటి లేనే లేదు.…
-
వీడ్కోలు… ఛార్ల్స్ కింగ్స్ లీ, ఇంగ్లీషు కవి
నా చక్కని తల్లీ, నీకు వదిలిపెట్టడానికి విలువైనదేదీ లేదు; పేలవమైన నా కథని ఆలపించడానికి ఎవరూ ప్రయత్నించరు; కానీ నేను మరణించేలోగా నీకు అనవరతమూ మార్గదర్శి కాగల ఒక జీవిత సత్యాన్ని బోధించగలను. బంగారు తల్లీ! అందరితో మంచిగా ఉండు; ఎవరి తెలివి వాళ్ళని ప్రదర్శించనీ; పొద్దల్లా కలలుకంటూ కూచోకుండా, గొప్ప పనులు చేసి చూపించు; అలా చేసి, అనంతమైన నీ జీవితాన్నీ, చివరకి మరణాన్ని కూడా ఒక మధురమైన గీతంగా మలుచుకో. . ఛార్ల్స్ కింగ్స్…
-
దేవుని వరాలు… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
దేముడు మొదట మనిషిని సృష్టించినపుడు ప్రక్కన ఒక గ్లాసునిండా వరాలు ఉంచుకున్నాడు, తనలో తాను “మనం మనదగ్గర ఉన్నదంతా ఇచ్చెద్దాం. చెల్లా చెదరుగా ఉన్న సృష్టిలోని సంపదలన్నీ ఒక్కచోటకి పోగుపడనిద్దాం” అనుకున్నాడు. అనడమే తడవు, ముందు బలం దారి తీసింది; అందం దాన్ని అనుసరించింది, తర్వాత వివేకం, కీర్తి, ఆనందం: ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత, దేముడు ఒక క్షణం ఆగేడు, అన్ని సంపదలలోకీ అట్ట అడుగున “విశ్రాంతి” పడిఉండడం గమనించేడు. ఇలా అనుకున్నాడు: నా జీవికి ఈ…
-
మొర … ఎబ్ నెజర్ ఏలియట్, ఇంగ్లీషు కవి
చలిగా, లోతుగా, నల్లగా కెరటాలు సాగుతుంటాయి ఎక్కడా గాలి ఊసు లేని సముద్రం మీద ఎవరికీ ఎరుకలేని ఏ చారెడు నేలకోసమో! . ఆ చీకటి అలలతరగలమీద తేలుతూ వినీ వినిపించక, శతృ, మిత్రుల శోకాలు, ఎవరికీ తెలియని ఏ నేలనో వెతుక్కుంటూ పోతాయి. దూరాన రక్షించమంటూ విధివంచితుడెవరో అరుస్తున్నాడు; ఈ లోకంలోని బాధలనుండి విముక్తుడై మిగతావాళ్ళలాగే ఎవరికీ తెలియని తీరానికి పోతున్నాడు. ఆ వెళుతున్నవాని వెంట కొన్ని వేల మంది పోయినా గాలి ఆడని ఆ…