వర్గం: అనువాదాలు
-
నాటకం చూస్తున్నపుడు నా వెనక కూచున్నామెకు… ఏ పీ హెర్బర్ట్, ఇంగ్లీషు కవి
అమ్మా! మీరు ఈ నాటకం చూసేరు, నేనివాళ వరకు చూడలేదు; మీకు నాటకంలో సన్నివేశాలన్నీ తెలుసు, కానీ, నాకు తెలీవని మనవి చేస్తున్నాను. చివరి వరకు హంతకుడెవడో ప్రేక్షకుడికి తెలియకుండా ఉంచడమే రచయిత ఉద్దేశ్యం. మీరిలా చెప్పుకుంటూ పోతుంటే మీరు అతనికి అన్యాయం చేసినవాళ్ళు అవుతారు. నటులు తమ తమ ప్రత్యేకమైన శైలిలో చాలా హాస్యాన్ని పండిస్తుంటారు మీరు ముందుగానే ఏమిచెయ్యబోతున్నారో చెప్పెస్తే అందులోని సరసత ఆస్వాదించే అవకాశం నాకు ఉండదు. ఒక నాటకంలో ఉండే కుతూహలం…
-
చొక్కా గీతం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
వేళ్ళు అరిగి అరిగి నీరసించి కనురెప్పలు ఎర్రబడి బరువెక్కి స్త్రీకి యోగ్యం కాని చింకిపాతలలో పాపం ఒక స్త్రీ, కూచుని ఆమె సూదినీ దారాన్నీ లాక్కుంటూ ఒక కుట్టు, రెండో కుట్టు, మూడో కుట్టు వేసుకుంటూ పేదరికంతో, ఆకలితో, మురికిలో విషాదము నిండిన గొతుతో ఈ “చొక్కా గీతం” ఆలపించ సాగింది.. పని ! పని ! పని! ఉదయం దూరంగా ఎక్కడో కోడికూయడం మొదలు పని! పని ! పని! రాత్రి చూరులోంచి నక్షత్రాలు…
-
I would be watching them two…Kuppili Padma, Telugu, Indian
Sometimes Forgetting the time Sometimes To forget the time When they two Sweep about the garden Like two Little butterflies; And like two buoyant fish When they swim In the bluish swimming pool. That lone girl Becomes a bond Akin to a red ribbon Tasseling two-braids … And a colourful cloud Raining endless…
-
An Ordinary Day in an Ordinary Street… V. Chinaveerabhadrudu, Telugu, Indian
About ten in the morning, the trees are Still lazying under the thick foggy veil. The young sprouting leaves peep through Like the hanging jukas from earlobes. The early buzz for the daily grind of Autos, the picking up traffic, Children reaching out their schools, Is like attuning for an imminent concert. Stepping out…
-
ప్రభాతం… జాన్ ఫోర్డ్, ఇంగ్లీషు కవి
నిద్ర మరపించే కష్టాలను కాపుకాసే నీడలారా! ఇక్కడనుండి తక్షణం పారిపొండి! కళ్ళు బరువెక్కి మూసుకుపోయినా మనసుమాత్రం మేలుకునే ఉంటుంది; అంతులేని బాధలూ బాధ్యతలతో బందీలైన ఆలోచనల వలలో చిక్కుకుని; ప్రేమలూ దుఃఖాలూ ప్రశాంతతనీయడం కంటే నిట్టూర్పులతోనే వ్యక్తమవుతుంటాయి నిద్ర మరపించే కష్టాలను కాపుకాసే నీడలారా! ఇక్కడనుండి తక్షణం పారిపొండి! . జాన్ ఫోర్డ్ (1586–c. 1640) ఇంగ్లీషు కవి . Dawn Fly hence, shadows, that do keep Watchful sorrows charmed in…
-
కటీఫ్… యెవగనీ యెటుషెంకో, రష్యను కవి
నాకు ప్రేమంటే విరక్తి వచ్చింది; మన కథకి పేలవమైన ముగింపు, జీవితమంత నిరుత్సాహంగా, సమాధి అంత కళావిహీనంగా. మన్నించు… ఈ ప్రేమగీతాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను గిటారు పగలగొడుతున్నా, మనిద్దరికీ దాచుకుందికి ఏవీ లేవు. కుక్కపిల్లకేం తోచడం లేదు. ఆ బొచ్చుకుక్కకి చిన్నవిషయాన్ని మనం ఎందుకు అంత క్లిష్టం చేసుకుంటున్నామో అర్థంకావటం లేదు. అది నీ గది ముందుకొచ్చి మూలుగుతుంది. పోనీలే అని వెళ్లనిస్తాను. అది నా నా గది తలుపులు గోకినపుడు, నువ్వే వెళ్ళిపోతావు. ఓ కుక్కా!…
-
క్షణికానందము … కెన్నెత్ బర్క్, అమెరికను కవి
చెఱువు నిండుగా ఉంది నేల పచ్చగా ఉంది వార్తలు కట్టేయడంతో మనసిపుడు ప్రశాంతంగా ఉంది. ఓ చేతిలో పుస్తకం మరో చేతిలో డ్రింకూ ఇంకేం కావాలి మనిషికి? మంచి కీర్తిప్రతిష్ఠలూ మెరుగైన ఆరోగ్యం బాంకులో ఓ పది మిలియను డాలర్లూ… . కెన్నెత్ బర్క్ 1897 – 1993 అమెరికను కవి Temporary Well Being The pond is plenteous The land is lush, And having…
-
చెరగని అందం… థామస్ కేరీ, ఇంగ్లీషు కవి
ఎవడు గులాబి వంవంటి చెక్కిళ్ళనిప్రేమిస్తాడో పగడాలవంటి పెదాలని ఆరాధిస్తాడో లేదా చుక్కలను బోలిన కనుదోయినుండి తన ప్రేమజ్వాలను ఎగదోసుకుంటాడో; కాలం వాటిసొగసులొక్కొక్కటీ హరిస్తున్నకొద్దీ అతని ప్రేమ కూడా క్రమంగా క్షీణించవలసిందే కాని, అచంచలమూ, నిర్మలమూ ఐన మనసూ, సుకుమారమైన బావనలు, అదుపులోని కోరికలు అన్యోన్య అనురాగంతో మనసులు పెనవేసుకున్నపుడు వారి మధ్య అనురాగం ఎనడూ నశించదు. ఇవి ఏవీ లేనప్పుడు ఎంత అందమైన చెక్కిళ్ళైనా పెదాలైనా, కనుదోయి అయినా, నేను అసహ్యించుకుంటాను. థామస్ కేరీ,…
-
శీలవతి… తూ ఫూ , చీనీ కవి
అందంలోనూ కులీనతలోనూ సాటిలేని ఒక ఉత్తమురాలైన స్త్రీ ఈ దిక్కుమాలిన లోయలో తలదాచుకుంటోంది. ఆమె చెప్పినదాన్ని బట్టి కలిగిన కుటుంబంలోంచే వచ్చింది గానీ ఇప్పుడు ఆ సంపద అంతా నశించిపోయింది; చెట్టూ చేమలాగ దక్షతలేక బతుకుతోంది. విప్లవకారులకి ముఖ్యభూబాగాలు చిక్కిన తర్వాత ఆమె అన్నదమ్ముల్ని వాళ్ళు మట్టుపెట్టేరు; పుట్టుక, హోదా అలాంటప్పుడు అక్కరకు రావుగదా! కనీసం వాళ్ళకి తగిన అంత్యక్రియలు చెయ్యడానికైనా వాళ్ళ అస్థికలు ఇంటికి తీసుకుపోడానికి ఆమెకు అనుమతించలేదు. ఒకప్పుడు వాళ్ళమాటకి ఎదురులేదనుకున్నవాళ్ళకి కూడా ప్రపంచం…
-
The Sun… Sivasagar, Telugu, Indian
(17th April is Sivasagar’s Death Anniversary) The Sun is a dexterous weaver. On the loom of sky With his fine ray-threads Weaves a spectral rainbow. The Sun is a consummate archer. In the coppice of cosmos With his sharp arrow-beams Shoots down the tigress of darkness. Sun is a passionate lover Climbing…