“An Ordinary Day in an Ordinary Street… V. Chinaveerabhadrudu, Telugu, Indian” కి 6 స్పందనలు
సరస్వతి దుర్భ
Saraswathi Durbha
ఎన్ ఎస్ మూర్తి గారి కవితకి వాడ్రేవు చిన వీరభద్రుడు గారి అనువాదం చదివేక నాకు తోచినట్లు నేను కూడా ఇలా అనువాదం చేసేను. చదివి ఎలా ఉందో చెప్పండి.
ఆటోలు, అంతకంతకూ పెరుగుతున్న రద్దీ.
స్కూళ్ళకు చేరుకుంటున్న పిల్లలు.
పొద్దున్నే ప్రారంభమైన ఈ హడావిడి అంతా,
కార్యక్రమానికి ముందు శృతి చేసుకుంటున్న
వాద్యకారుల బృందంలా ఉంది.
రోజూ లాగే కనబడే వీధిలోకి
రోజూ లాగే అడుగు పెట్టాననుకున్నాను.
ఇక్కడ నడుస్తున్నట్లే కనిపిస్తున్నా,
నిజానికి నేనిక్కడ లేనే లేను.
ఎన్నో ఎన్నో తొక్కిన దారులే
మళ్ళీ మళ్ళీ తొక్కుతున్నాను.
ఒకానొక ప్రాచీన సంకేత స్థలికి
మళ్ళీ మళ్ళీ పవిత్ర యాత్ర చేస్తున్నాను.
అది ఒక సామాన్యమైన రాదారిలో
సామాన్యమైన ఉదయం. కానీ,
నా దృష్టిని అంతర్ముఖం చేసీ చేయకుండానే
అహో, పండిపోయిన పాతకాలం నాటి
పాత దారుల నుండి, అప్పటి మనుషులు
తమదైన ప్రపంచాన్నినా కొరకై ఆవిష్కరించారు.
తెలుగు టు ఇంగ్లీషు టు తెలుగు . భలే ఉందే. మూర్తిగారికి నమస్తె. మీ రన్నట్టు కవితాత్మ చెదరలేదు. గ్రేట్ translations both from telugu and from english. interesting too.
స్పందించండి