వర్గం: అనువాదాలు
-
సానెట్ 50… విలియం షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం నా మార్గంలో అడుగులు ఎంత దుఃఖభరితంగా పడుతున్నాయో చెప్పలేను. నేను కోరుకుంటున్న ఈ ప్రయాణం ముగిసే వేళకి నాకు దొరకవలసిన సుఖమూ, విశ్రాంతి దొరకకపోవడమేగాక, గుర్తుచేస్తున్నాయి: ఇకనుండి మైళ్ళు “నీ నుండి నా దూరం”తో కొలవబడుతాయని. నా బరువుతోపాటు బాధలబరువూ మోస్తూ ఈ జంతువు అలిసిపోయింది అందుకే కాళ్ళీడుస్తోంది, నా లోపలి బరువు మోయడానికి వీలుగా, ఈ గుర్రం ఏ అతీంద్రియ శక్తితో తెలిసుకుందో తెలీదు గాని రౌతుకి…
-
థామస్ బైల్ పబ్ లో అన్నది… జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి
ఇంతచమత్కారవంతమూ, రసవత్తరమూ ఐన కవిత ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనిషి తనమనుగడకి ఎంతటి ముప్పుతెచ్చుకుంటున్నాడో చాలా సరళంగా, సునిశితంగా చెప్పాడు కవి. *** నేను దేవుణ్ణి చూశాను. నీకేమైనా సందేహమా? అసలు అనుమానించడానికి నీకెంత గుండె ధైర్యం? ఓయ్, నేను నిజంగా దేవుణ్ణి చూశాను. తనచెయ్యి ఒక పర్వతాగ్రాన ఆంచి ఉంది. అతను ఒక సారి ఈ ప్రపంచాన్ని, దాని పరిసరాల్నీ పరిశీలించాడు. నువ్వు నన్ను చూస్తున్న దానికంటే స్పష్టంగా అతన్ని…
-
The Soil(ed) Slate… Pydi Teresh Babu, Telugu, Indian
The singular biological attribute this globe has is… That it perpetuates motherhood. The other name for a perennial river That flows but never seems so is … ‘mother’ On 3rd November 1963 One Pydi Subbulu became a mother. I have a faint memory of her Getting up in the wee hours, and Running barefoot for…
-
శ్వేతతుషారం… చక్రవర్తి సలహాదారు యకమోచి, జపనీస్ కవి
కొండగాటి పక్షుల వంతెన మీద మిరిమిట్లుకొలిపే ధవళవస్త్రాన్ని పగటిఱేడు శ్వేతతుషారంతో పరచగానే అర్థమయింది నాకు: రాత్రి అట్టేలేదనీ వెలుతురు ఇక చిక్కగా చొచ్చుకొస్తుందనీ. . ఈ కవిత కృతికర్త Koshu ప్రాంతపు గవర్నరు, అప్పటి జపానులోని అంతగా నాగరికత చాయలు కనరాని ఉత్తర తూర్పు ప్రాంతాలకు వైస్రాయి గా ఉండే యకమోచి. అతను సుమారు క్రీస్తు శకం 785 ప్రాంతాలవాడు. క్యోటోలోని రాజ సౌధంలో “Magpies Bridge” అనే వంతెన మార్గం ఉంది. కానీ ఈ కవితలో ఆ…
-
నీలి రెక్కలు… జేమ్స్ స్టీఫెన్స్, ఐరిష్ కవి
చెట్టుమీదనున్న ఓ పిట్టా! నువ్వు పాడగలిగినప్పుడే పాడు రెక్కలు బారజాపుకుని ఆకాశంలో ఎంతో ఎత్తుకి ఎగురుతూ ఆనందంగా ఉన్నా చీకటిపడే వేళకి చల్లదనం ఉధృతమౌతుంది కనుక, పాడగలిగినపుడే పాడు. నిన్ను కబళించే ఉద్దేశ్యంతో నీ మీదకి … రెక్కలు చాచి ఎగురుతూ గద్ద ఒకటి వాలుగా తేలియాడుతూ అనుసరిస్తోంది కనుక కమ్మని నీ గీతం త్వరలో చరమగీతం కాబోతోంది ఈ రోజునీ, నిన్నూ, బాధోపహతుడనైన నన్నూ ఆ నీలి రెక్కలు కప్పి కనుమరుగు చేస్తాయి. అక్కడ ఏ…
-
జవాబు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నేను మట్టిలోకి తిరిగి చేరుకున్నప్పుడు ఆనందంతో తుళ్ళిసలాడిన నా శరీరం ఒకప్పుడు విర్రవీగిన దాని ఎరుపు తెలుపు వన్నెలని వదులుకున్నప్పుడు పురుషులెవరైనా పక్కనుండి పోతూ పేలవమైన, తెచ్చిపెట్టున జాలితో మాటాడితే నా మట్టి గొంతు ఎరువుతెచ్చుకుని మరీ వాళ్ళకి గట్టిగా సమాధానం చెబుతుంది: “ఓయ్! చాలు, కట్టిపెట్టు. నేను సంతృప్తిగానే ఉన్నా. అవసరం లేని నీ జాలిమాటలు వెనక్కు తీసుకో! ఆనందం నాలో ఒక జ్వాల అది ఒక్క సారి దహించేది కాదు, నిలకడైనది. అలవోకగా వంగే రెల్లులా సుకుమారమైనది…
-
For A New Metaphor… Vadrevu Chinaveerabhadrudu
There’s Fall in the air. It’s time the viridity returns to the bark, to the stalk, and to the spirit lying deep Within the living cells. The melodies playing before eyes till now, retreat in endless cycles like winding on a spool. Winter comes to an end. A whirlwind of withered leaves. A pale anemic…
-
Accused Forever…. Neeraja Amaravadi, Telugu, Indian
That the death sentence Shall be abolished in all cases except Serious terrorist activities Heartened even a yet-to-be-born. Rider: There are exceptions And dealt with on case to case basis. If you are sure that foetus is a girl child Execution shall be forthwith. For the crime of giving birth to a girl A mother…
-
మహాత్ముడు… యూనిస్ టీట్యెన్స్ , అమెరికను కవయిత్రి
అతని గొప్పదనాన్ని నే నెన్నడూ తెలుసుకోలేకపోయాను. ఒక్కొసారి తను నా పక్కనే, అడుగులో అడుగు వేసుకుంటూ, నెమ్మదిగా ఎలా నడిచే వాడంటే చాలా సాదాసీదాగా, నా ఆలోచనల్లాగే రెక్కలురానట్టు. అప్పుడు నాతా బాతాఖానీ కొట్టేవాడు, తనకి నచ్చేది కూడా. గరుత్మంతుడంతకాదుగాని, తన వెడల్పు రెక్కలు ముడుచుకుని నాతో నడవడానికి ఇష్టపడేవాడు, అది అతను కావాలని కోరుకున్నదే. కానీ, నా మిత్రుడు చాలా సామాన్యుడిలాగే ఉండేవాడు. నేను మరిచేపోయాను. కాని ఒక్కసారి రోదసీ కుహరాల్లోంచి ఒక పెద్ద పిలుపు…
-
చిత్రం! … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
శ్వాసించలేనివీ, వేటినీ చూడలేనివీ అలాంటి వాటికే ఎందుకు మరణం ఉండదో? ఒక పిసరంత నేలకీ, స్పందనలేని రాతికీ, ఒక ధూళి కణానికీ, కేవలం మట్టిపెల్లకీ శాశ్వతత్వం అనుగ్రహించబడింది. ఒక రైలుదారి పక్క గులకరాయికి మృతిలేదు… భగవంతుని అపురూపవరం లభించింది దానికి. మన పూర్వీకులు కోసిన గడ్డి ఇపుడు వాళ్ళ సమాధులపై మొలుస్తోంది. పారీ పారనట్టి అతి చిన్న వాగులు ఎప్పుడూ ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయి. ఇసకలా జడమై బలహీనమైనవాటిని చంపి ప్రాణంతీయగల మృత్యువు లేదు. మనిషొక్కడే…