The Soil(ed) Slate… Pydi Teresh Babu, Telugu, Indian
The singular biological attribute this globe has is…
That it perpetuates motherhood.
The other name for a perennial river
That flows but never seems so is … ‘mother’
On 3rd November 1963
One Pydi Subbulu became a mother.
I have a faint memory of her
Getting up in the wee hours, and
Running barefoot for farm work
Suppressing the hungry wolf within her fist.
Every drop of blood she so covetously saved,
I remember her expending at the tobacco barns.
The seething pain of nerves
She received as bonus for her yearlong drudgery
I still remember her wrenching in pain
As she would a sodden saree at the wash.
Like she would slice the stalk of a tobacco leaf
I remember poverty slivering her into two dismal halves.
It had been a challenge for me every day to identify my mother
Amongst droves of home-bound grading labor after the sunset.
To embrace my mother gleefully from afar, I remember
Sitting on the slab of wayside library till my legs got numb.
Why should I care for the sweetmeats she would bring, when
Mother herself was a candy reaching home safely by evening?
Her hard labor devoured my mother!
The tobacco industry smoked her out like a cigarette.
Mother was a synonym for the house of travails at Ongole.
But, Subbulu’s only reassurance was…
That her son was picking up the alphabet.
The nights cast over my childhood were all beds of thorns
Once the arrack bottles consumed fathers,
Fathers started harassing the mothers.
After mothers fell asleep on mat waiting endlessly
I remember … dogs upturning the food pot on the hearth.
It’s only for mothers that the dry bramble becomes bundles.
Many a time, I remember, the babul thorns getting angry
For they could find no place to pick on mother’s rough body.
The landlord’s fields sag heavy with corn for mothers.
Instead of the groundnuts gleaned, I remember her saree frills
Getting heavy with the vulgar humour of the landlord.
Every cell of my body
Has been borrowed from my mother.
I am still at sea, to this day
To separate the ‘I’ from her, and see how the ‘I’ looks.
Whenever I feel like seeing my mother
I walk up to the mirror.
The heart that’s not visible in the mirror, however
Would be waiting at her doorstep in Ongole
Anxiously for a letter from her son.
If I were a letter of the alphabet
My mother is the soiled slate.
.
Pydi Teresh Babu ( 3 November 1963- 29th September 2014)
Pydi Teresh Babu
మట్టి బలపం
భూగోళానికి వున్న ఒకే ఒక్క జీవ లక్షణం అమ్మల్ని కనడం
కదుల్తూ కూడా కదలనట్టుండే జీవనది పేరు అమ్మ
1963 వ సంవత్సరం నవంబర్ 3 వ తేదీన పైడి సుబ్బులు అమ్మ అయింది
జాము పొద్దు కాడనే లేచి జానెడు ఆకల్ని గుప్పిట్లో పెట్టుకుని చెప్పుల్లేని కాళ్ళు రెండు వరి నాట్ల కోసం పరుగెత్తినట్లు జ్ఞాపకం బొట్టు బొట్టుగా పొదుపు చేసుకున్న రక్తాన్ని టుబాకో కంపెనీ పొగాకు బేళ్ళ మీద చిలకరించిన జ్ఞాపకం ఆరుగాలం అరవచాకిరీకి బోనసుగా అందిన కుచ్చి నరాల పోట్లకి ఉతుకుతున్న చీరెని మెలేసి పిండినట్లు శరీరం లోంచి బాధను పిండుకుంటూ విల విల్లాడిన జ్ఞాపకం పుగాక్కాడ ఈనెను చీల్చినట్లు దారిద్ర్యం అమ్మను రెండు చీకటి తుంపులుగా చీల్చిన జ్ఞాపకం
చీకటి పడ్డాక ఇంటి దారి పట్టిన గ్రేడింగ్ కార్మికుల బిడారులో అమ్మ ముఖాన్ని గుర్తు పట్టడం నాకు రోజువారీ పరీక్ష దూరంగా కన్పించే అమ్మను నా నవ్వుతోనే కావిలించుకోవడం కోసం రోడ్డువార లైబ్రరీ బేస్ మట్టం మీద నా రెండు కళ్ళూ కాయలై రాలిన జ్ఞాపకం అమ్మ తెచ్చే తాయిలాలు నాకెందుకు సాయంకాలానికి భద్రంగా ఇల్లు చేరే అమ్మే ఒక అద్భుతమైన తాయిలం
అమ్మను రెక్కల కష్టం మింగేసింది పొగాకు పరిశ్రమ అమ్మను సిగరెట్టూ చేసి కాల్చుకుంది ఒంగోలు కట్టుకున్న బాధల గది పేరు అమ్మ సుబ్బులమ్మ ధీమా అంతా తన కొడుకు అచ్చరాలు దిద్దుతున్నాడనే
చిల్ల కంపలు ఎండుమోపులయ్యేది అమ్మల కోసం దిగడానికి చోటు దొరకదేమని ఒంటి మీద తుమ్మ ముళ్ళు ఎన్నో సార్లు అలిగిన జ్ఞాపకం ఆసామి గారి చేను పరిగలయ్యేది అమ్మల కోసం ఏరుకున్న వేరు శనగల్తో గాక ఆసామి నాలుక చరుపులతో పైట చెంగు మూటలు బరువెక్కినట్టు జ్ఞాపకం
నా ఒంట్లో వున్న ప్రతి జీవకణం అమ్మ నుండి కోసుకొచ్చుకున్నదే నేననే వాడిని ప్రత్యేకించి ఎట్లా ఉంటానో నాకిప్పటికీ అంతు పట్టదు అమ్మను చూడాలనుకున్నపుడల్లా నన్ను నేను అద్దంలో చూసుకుంటాను అద్దంలో కనబడని గుండెకాయ మాత్రం ఒంగోలు గుమ్మంలో కొడుకు ఉత్తరం కోసం ఎదురు చూస్తూ వుంటుంది నేను అక్షరాన్నైతే అమ్మ మట్టి బలపం!
great poem and great translation sir. తెరేష్ బాబు నాకెంతో ఇష్టమైన కవి. ఆయన వాడే ఇమేజెస్ గొప్ప ఫోర్స్ తో ఉంటాయి. దళితసాహిత్యానికి కవిత్వాన్ని అద్దిన వారిలో తెరేష్ బాబు ముఖ్యులు. మీకు నచ్చిన కవిత ఏదంటే ఈ కవితను ఉదహరించేవారు తెరేష్. అనువాదం చాలా బాగా వచ్చింది సార్. ధన్యవాదాలు.
స్పందించండి