వర్గం: కవితలు
-
చాడీలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వాళ్ళు నీ మీద నేరాలు చెప్పడానికి వచ్చేరు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయేరు. చెప్పడం పూర్తయేక గట్టిగా ఫక్కున నవ్వేను అవన్నీ నాకు ఇంతకుముందే తెలుసు. ఓహ్! వాళ్లు ఎదురుగుండా కనిపిస్తున్నా చూడలేని గుడ్డివాళ్ళు ఆ నీ తప్పులే నిన్నింకా గాఢంగా ప్రేమించేలా చేసేయి. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి సారా టీజ్డేల్ అపురూపమైన కవయిత్రి. ఆమె ఎంత సరళంగా రాస్తుందో, అందులో…
-
ఒక రైతు మరణం … రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, వెల్ష్ కవి
డేవీస్ నీకు గుర్తున్నాడా? పాపం, పోయాడు, తెలుసా? వెల్ష్ కొండల్లో, పేదరైతు రాళ్లుతేరిన తనపొలంలోనే చచ్చిపోయినట్టు జీవితం మీద ఆశలు వదిలేసుకుని. నాకు ఇంకా గుర్తే … పెంకులచూరుకింద అతని గదీ, అతను పడుక్కునే విశాలమైన పక్కా దానిమీద వెలిసిపోయిన దుప్పటీను… ఒంటరిగా, మార్చినెల మధ్య ఎండల్లో ఈనలేక బాధపడుతున్న ఆడగొర్రెలా ; అంతే కాదు, ఇంట్లో చిక్కుకున్న వడిగాలి తెరలన్నిటినీ చించుకుని బయటకి పోవడమూ, ఎండ నేలమీద విన్యాసాలు చెయ్యడమూ గుర్తే. చుట్టుపక్కలవాళ్ళు గట్టిగా అడుగులేసి నడుస్తుంటే అతని…
-
నిష్క్రమణ … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను
నే నే తోవ తీసుకున్నా నాకు లెక్కలేదు, అదెక్కడికి వెళుతుందో అంతకన్నా పట్టింపులేదు ఈ ఇంట్లోంచి బయటపడాలి, నా గుండెపగిలేలోపు నేను వెళ్ళిపోవాలి, ఎక్కడికో అక్కడికి. నా గుండెలో ఏముందో నాకు తెలీదు నా మనసులో ఏమున్నదీ నాకు తెలీదు కానీ నాకు ఇక్కడనుండి లేచి వెళిపోవాలనుంది నా కాళ్ళు ఎక్కడికి తీసుకెళతాయో నాకు లెక్కలేదు. నేనొక పగలూ రాత్రీ నడవగలిగి సూర్యోదయం వేళకి ఒక నిర్జనప్రదేశంలో కనుచూపుమేర రోడ్డన్నది లేకుండా ఒక కొంపగాని, మనిషన్న ఊసుగానిలేకుంటే…
-
తొలిపలుకు .. హొరేస్ హోలీ, అమెరికను కవి
ఆహ్! నేనొక నిపుణుడైన పనివాడి కత్తికింది ఒదిగే మెత్తని ఓక్ చెట్టు మానునో, రహస్యచిత్రలిపిలో లోతుగా చెక్కబడిన చెదరని ఏకశిలనో అయితే బాగుణ్ణు. అప్పుడు అక్షరం అక్షరం నెమ్మదిగా చదువుకుంటూ ప్రజలు జీవితకాలం ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే నేనొక చోద్యానికి ప్రత్యక్ష సాక్షిని ఆ ఆశ్చర్యంలో ప్రవక్తల నోట వచ్చే భవిష్యవాణిలా నాది కాని ఒక ఉద్వేగమైన భాష వెలువడుతోంది అది చాలా కొత్తగానూ, చిత్రంగానూ ఉందని చెప్పక తప్పదు. అది ఈ మృత్తికతో…
-
బిచ్చగాడి మరణశయ్య … కేరొలీన్ (బౌల్స్) సదే , ఇంగ్లీషు కవయిత్రి.
నెమ్మదిగా అడుగులు వెయ్యండి— తల దించుకొండి గౌరవపూర్వకంగా మౌనంగా తల వాల్చండి ఎక్కడా మృత్యుఘంట మ్రోగదు అయినప్పటికీ, ఒక అనంతాత్మ దేహాన్ని విడిచి పోతోందిప్పుడు. ఓ పరదేశీ, నువ్వెంత గొప్పవాడివయినా, గౌరవసూచకంగా శిరసు వంచుకో; అదిగో ఆ పేద గుడిశలో— నామమాత్రమైన పక్కమీద… నీకంటే గొప్పవాడు పడుక్కుని ఉన్నాడు. ఆ బిచ్చగాడి పూరిపాక కింద చూడు! మృత్యువు దాని అధికారం ప్రదర్శిస్తోంది: లోపలికి వెళ్ళు… జనాలెవరూ లేరులే ఫర్వాలేదు ప్రవేశించు— కాపలాదారులడ్డుకోరులే ఈ భవన…
-
ఒక సాయంత్రం… రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, వెల్ష్ కవి.
కాలాన్ని తన అమ్ముగా చేసుకున్న విలుకాడి వింటి నారి కొంపదీసి తెగిపోయిందేమిటి చెప్మా, ఆ హరివిల్లు మా ఊరిపై అంత నిలకడగా ఉంది? అలా అయితే, మనకి గాయమయే లోగా మనం దాన్ని మౌనంగా వీక్షిద్దాం ఈ రమణీయమైన నిశ్శబ్దంలో క్షణకాలమైనా అనంత ప్రేమలో ఓలలాడుదాం. . రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, (29 March 1913 – 25 September 2000) వెల్ష్ కవి. కవిత్వం పెల్లుబకడానికి ఒక చిన్న ఆలంబన…
-
రెండు దేహాలు … ఆక్టేవియో పాజ్, మెక్సికన్ కవి
రెండు ఎదురెదురు దేహాలు ఒక్కోసారి ఎగసిపడేకెరటాలు రాత్రి ఒక మహాసాగరం రెండు ఎదురెదురు దేహాలు అపుడపుడు రెండు పెద్ద బండరాళ్లు రాత్రి ఒక విశాలమైన ఎడారి రెండు ఎదురెదురు దేహాలు ఒక్కొసారి రెండు రాత్రిలోకి చొచ్చుకుపోయిన రెండు పిల్లవేర్లు రెండు ఎదురెదురు దేహాలు అపుడపుడు రెండు కత్తులు రాత్రి పూట నిప్పురవ్వలు రాలుస్తాయి రెండు ఎదురెదురు దేహాలు శూన్యాకాశం నుండి నేలకు రాలిపడే రెండు ఉల్కలు. . ఆక్టేవియో పాజ్ …
-
Things That Matter… Prasuna Ravindran, Telugu, Indian
Sometimes, it would be just like that! We would rather imprison those butterflies of thoughts in our heart than allow them to float free liberating from the sensibilities Even as the rain water Collected in the cusps of our hands leaks out through the fissures between fingers, the chill and freshness of the…
-
The Run Within…Yakoob, Telugu, Indian
Did I forget something back home? Did I lock the door properly? Did I put off the geyser and put the milk bowl back in the frig? Oh, damn it! The three kittens might make a hell by the time I come home. Well, maybe the tommy might not allow barking at them And might…
-
The Monsoon Nights… Manasa Chamarti, Telugu, Indian
The monsoon nights let not sleep a wink. With the drops of rain suddenly pecking at the ground… The earth tingling anew all over bathed in flowers… And the sweet trilling of a Dove in its nest with its mate Let not sleep a wink the monsoon nights. The thorn of chill prickles…