Poor Richard’s Almanac 42 … Benjamin Franklin, American

411.   Poor Dick eats like a well man, drinks like a sick.

               పాపం, డిక్! ఆరోగ్యవంతుడిలా తింటాడు, రోగిష్టిలా తాగుతాడు.

  1.    Poor plain Dealing! Dead without issue.

            పాపం ‘నిజాయితీ వ్యవహారం!’ సంతు లేకుండా మరణిస్తుంది. (ఒకరిని చూసి మరొకరు నిజాయితీగా వ్యవహరించరని భావం)

  1.   Poverty, poetry, new titles of honor, make men ridiculous.

           పేదరికం, కవిత్వం, బిరుదసత్కారాలూ, మనిషిని హాస్యాస్పదుణ్ణి చేస్తాయి.

  1.  Poverty wants some things, luxury many things, and avarice all things.

           పేదరికం కొన్నివస్తువులు కోరుకుంటుంది, విలాసం చాలావస్తువులని కోరుకుంటుంది, లోభత్వం అన్నీతనకే కావాలంటుంది.

  1.  Praise to the undeserving is severe satire.

          అర్హతలేని వారిని చేసే పొగడ్త, ఘాటైన అవహేళన.

  1.  Pray, don’t burn my house to roast your eggs.

          బాబ్బాబు! నీ కోడిగుడ్లు వేయించుకుందికి, నా కొంప తగలబెట్టకు.

  1. Prayers and provender hinder no journey.

         ప్రార్థనలూ, భోజనమూ ఏ ప్రయాణానికీ ఆటంకాలు కావు.

  1. Presumption first blinds man, then sets him a-running.

         అనుమానం, ముందు మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. తర్వాత పరిగెత్తిస్తుంది.

  1. Pretty and witty will wound if they hit ye.

         అందానికీ, అపహాస్యానికీ నువ్వు గురి అయితే, అవి నిన్ను గాయపరుస్తాయి.

  1. Pride and gout are seldom cured throughout.

         అహంకారమూ, వాత నొప్పులూ పూర్తిగా తగ్గవు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.