Poor Richard’s Almanac 41 .. Benjamin Franklin, American

401. One mend fault is worth two find-faults, but one find-fault is better than two make-faults.

 

          ఒక దిద్దుకున్న తప్పు, రెండు పట్టుకున్న తప్పుల కంటే మెరుగు. కానీ ఒక పట్టుకున్న తప్పు రెండు చెయ్యబోయే తప్పులకన్నా మెరుగు.

 

402. One today is worth two tomorrows.

 

         ఒక “నేడు” …. రెండు “రేపు”ల పెట్టు.

 

403. Onions can make even heirs and widows weep.

 

           ఉల్లి వారసుల్నీ, విధవల్నీ ఏడిపించ గలదు. (వీలునామాలే కాదు)

 

404. Pain wastes the body; pleasures the understanding.

 

           బాధ శరీరాన్ని కృంగదీస్తుంది. భోగాలు అవగాహనని తగ్గిస్తాయి.

 

405. Pardoning the bad is injuring the good.

 

          చెడును క్షమించడం, మంచికి హాని చేయడం.

 

406. Patience in the market is worth pounds in a year.

 

          ధరల తగ్గుబాటు కోసం నిరీక్షిస్తే, ఏడాదిలో పౌన్ల మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

 

407. Pay what you owe, and you know what is your own.

 

         మీ బాకీలు తీర్చెయ్యండి. మీ అసలు ఎంతో అప్పుడు తెలుస్తుంది.

 

408. Philosophy as well as foppery often changes fashion.

 

          అభిప్రాయాలూ, ఆడంబరాలూ సంప్రదాయాల్లో మార్పులు తీసుకు వస్తాయి.

 

409. Plough deep, while sluggers sleep.

 

          సోమరులు ఇంకా పక్కమీదే ఉండగా, పొలాన్ని లోతుగా దున్ను.

 

410. Pollio, who values nothing within, buys books as men hunt beavers for their skin.

 

         పొట్ట చీరితే అక్షరం ముక్క లేని పాలియో, ‘బీవర్’ లని వాటి చర్మం కోసం వేటాడినట్లు, లెక్కలేనన్ని పుస్తకాలు కొంటూంటాడు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.