Poor Richard’s Almanac 40… Benjamin Franklin, American

 

  1. No wood without bark.

         

              బెరడు లేకుండా మాను ఉండదు.

 

  1.  No workman without tools, nor lawyer without fools, can live by their rules.

 

          పరికరాలు లేని వడ్రంగీ, తెలివితక్కువ వాళ్ళు లేని వకీలూ తమ తమ కొలబద్దలూ చట్టాల (Rules మీద శబ్ద శ్లేష) మీద బ్రతకలేరు.

     

  1.   Observe all men; thyself most.

     

            మనుషుల్ని జాగ్రత్తగా గమనించు; ముఖ్యంగా నిన్ను నువ్వు.

 

  1.   Observe old vellum; he praises former times, as if he had a mind to sell them.

 

            ముసలి వెల్లాన్ని చూడు: అమ్మబోతున్నట్టు ఎప్పుడూ పాతరోజుల్నే పొగుడుతాడు.

 

  1.   Of learned fools I have seen ten times ten; of unlearned wise men I have seen a hundred.

 

             చదువుకున్న మూర్ఖులు పది పదుల్ని చూశాను; చదువులేని వివేకవంతుల్ని వంద మందిని చూశాను.

 

              (ప్రతి చదువుకున్న మూర్ఖుడికీ ఒక చదువులేని వివేకి ఉంటాడని భావం.)

 

  1. Lazy bones! Do you think God would have given thee arms and legs, if he had not designed you should use them.

 

           ఓ సోమరిపోతులారా! వాటిని ఉపయోగించడానికి కాకపోతే, దేముడు మీకు కాళ్ళూ చేతులూ ఎందుకు ఇచ్చాడు?

 

  1.  Old boys have their playthings as well as young ones; the difference is only in the price.

 

            చిన్నవాళ్ళకి మల్లే పెద్దవాళ్ళకీ ఆటవస్తువులు ఉన్నాయి. ఎటొచ్చీ, ధరలోనే తేడా.

 

  1.    Old young and old long.

 

            యవ్వనపు చురుకుదనం పోనివారు, నెమ్మదిగా ముసలివాళ్ళు అవుతారు.

 

  1.    One good husband is worth two wives; for the scarcer things are the more valued.

      

             మంచి భర్త ఇద్దరు భార్యలకి సమానం. అవును మరి. అరుదైనవాటికే విలువ ఎక్కువ.

 

  1.  One may be more cunning than the other, but not more cunning than everybody else.

 

           ఒక వ్యక్తి మరొకరు కంటే జిత్తులమారి కావచ్చు. కానీ అందరికంటే జిత్తులమారి కాలేడు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.