Poor Richard’s Almanac 39… Benjamin Franklin, American

  1. None knows the unfortunate, and the unfortunate do not know themselves.

        దురదృష్టవంతులెవరో ఎవరికీ తెలియదు; దురదృష్టవంతులకి కూడా.

 

  1. None preaches better than the ant, and it says nothing.

        చీమకంటే ఎవరూ బాగా బోధించలేరు; అదేమీ బోధించదు. (చేసి చూపిస్తుంది.)

 

  1. No resolution repenting hereafter can be serious.

        ఇకపై ఇలాంటి తప్పు చెయ్యకూడదనుకునే తీర్మానము, నిజాయితీతో చేసేది కాదు. 

 

  1. Nor eye in a letter, nor hand in a purse, nor ear in the secret of another.

         ఇతరుల ఉత్తరాలలోకి తొంగి చూడకు; పర్సులో చెయ్యి పెట్టకు; రహస్యం వినకు.

 

  1. Nothing but money is sweeter than honey.

        తేనె కన్నా తీయనిది డబ్బు తప్ప మరొకటి లేదు.

 

  1. Nothing dries sooner than a tear.

        కన్నీరు ఇంకినంత తొందరగా మరేదీ ఇంకదు.

 

  1. Nothing humbler than ambition when it is about to climb.

       అత్యాశని మించిన అణకువ దేనికీ ఉండదు; అది మొగ్గతొడిగే సమయంలో మరీను.

 

  1. Nothing more like a fool, than a drunken man.

        తాగుబోతుని మించిన మూర్ఖుడు ఉండడు. 

 

  1. Nothing so popular as goodness.

        మంచిదనాన్ని మించిన ప్రాచుర్యం లేదు. 

 

  1. Now I have a sheep and cow, everybody bids me good morrow.

        నా దగ్గర ఇప్పుడు గోవూ, గొర్రె ఉన్నాయని ప్రతి వాడూ శుభోదయం చెబుతున్నాడు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.