Poor Richard’s Almanac 38… Benjamin Franklin, American

371. Neither praise nor dispraise, till seven Christmases be over.

         

         ఏడు క్రిస్మస్ లు గడిచే దాకా, పొగడనూ వద్దు, తెగడనూ వద్దు.(బహుశా ఇది కొత్తగా పెళ్ళి చేసుకున్న వారి గురించి అయి ఉంటుంది)

 

372. Never intreat a servant to dwell with thee.

       

        సేవకుడిని, నీ ఇంట్లో నివసించమని బలవంతం చెయ్యవద్దు.

 

373. Never praise your cyder, horse or bedfellow.

       

           వడ్డించే సారానీ, నీ గుర్రాన్ని, నీ భర్త/ భార్యనీ పొగడకు.

 

374. Never spare the parson’s wine, nor baker’s pudding.

         

          మతబోధకుడు ఇచ్చే సారానీ, బేకర్ తయారు చేసిన వంటకాన్నీ విడిచిపెట్ట వద్దు.

 

375. Nice eaters seldom meet with a good dinner.

       

         మంచి భోజనప్రియులకి, తృప్తినిచ్చే విందు ఎప్పుడూ దొరకదు.

 

376. Nick’s passion grows fat and hearty; his understanding looks consumptive.

       

           నిక్ ప్రేమ రోజు రోజుకీ అధికమౌతోంది. అతని అవగాహనే, రోజు రోజుకీ క్షీణిస్తోంది.

 

377. Nine men in ten are suicides.

         

          పది మందిలో తొమ్మిది మంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళే. (బహుశా పెళ్ళి గురించి చమత్కారం అయి ఉంటుంది)

 

378. No gains without pains.

       

          శ్రమించకుండా ఏ ప్రయోజనమూ కలుగదు.  

 

379. No man ever was glorious who was not laborious.

         

           కష్టించకుండా కీర్తి సంపాదించిన వాడు లేడు.

 

380. None are deceived but they who confide.

         

          నమ్మిన వాళ్ళు తప్ప మోసపోయిన వాళ్ళు లేరు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.