Poor Richard’s Almanac 37… Benjamin Franklin, American

361. Most fools think they are only ignorant.

చాలామంది మూర్ఖులు కేవలం తాము అజ్ఞానులమనే  అనుకుంటారు.

Most of the learning in use, is of no great use.

వాడుకలో ఉన్న పరిజ్ఞానంలో చాలా మట్టుకు ఉపయోగకరమైనది కాదు

  1. Most people return small favors. Acknowledge the middle ones and repay great ones with ingratitude.

చాలామంది ఇతరులు చేసిన చిన్న మేలుకి ప్రతిగా చిన్న మేలు చేస్తారు, పెద్దవాటికి కృతజ్ఞతలు చెబుతారు; చేసిన గొప్ప మేళ్ళన్నిటికీ, కృతఘ్నతతో బదులిస్తారు.

  1. Much virtue in herbs, little in men.

మూలికలకి చాలా విలువ ఉంది, మనిషిలో మాత్రం లేదు.

  1. Necessity has no law; I know attorneys of the same.

అవసరానికి చట్ట పరిమితులు లేవు. అటువంటి న్యాయవాదుల్ని నే నెరుగుదును.

  1. Necessity has no law; why? Because, it is not to be had without money.

అవసరం చట్టానికి అతీతం. ఎందుకు? ఎందుకంటే, డబ్బులేకపోతే అటువంటి అవసరమే రాదు కనుక. 

  1. Necessity never made a good bargain.

అవసరం లాభసాటి బేరం ఆడనియ్యదు.

  1. Never take a wife till thou hast a house (and fire) to put her in.

నీ భార్యకోసం స్వంత ఇల్లూ, (కుంపటీ) ఏర్పాటు చేసుకోగలిగే దాకా, పెళ్ళిమాట తలపెట్టకు.

  1. Neglect kills injuries. Revenge increases them.

ఉపేక్ష గాయాల్ని మాన్పుతుంది. ప్రతీకారం మరింత రేపుతుంది.

  1. Neglect mending a small fault, and it will soon become a great one.

సరిదిద్దుకుందికి ఆలస్యం చేసే చిన్న పొరపాటు,  త్వరలో పెద్ద తప్పుగా మారుతుంది.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.