Poor Richard’s Almanac 43 … Benjamin Franklin, American

  1. Pride breakfasted with plenty, dined with poverty, supped with infamy.

 

అహంకారం సమృద్ధితో ఫలహారం, పేదరికంతో పగటి భోజనం, అపకీర్తితో రాత్రి భోజనం చేస్తుంది.

 

  1. Pride dines upon vanity, sups on contempt.

 

అహంకారం ఆడంబరంతో పగలు భోంచేస్తే, ‘అవమానంతో రాత్రి భోంచేస్తుంది.

 

  1. Pride is as loud a beggar as want, and a great deal saucy.

 

కోరికలా అరిచి దేబిరించడమే కాదు, అహంకారం పొగరుబోతుగా ప్రవర్తిస్తుంది కూడా.

 

  1. Pride gets into a coach, and shame mounts behind.

 

అహంకారం ముందు పెట్టెలో కూచుంటే, సిగ్గుమాలినతనం వెనక పెట్టెలో ఎక్కుతుంది.

 

  1. Proclaim not all you know, all you owe, all you have, nor all you cannot.

 

నీ జ్ఞానాన్నీ, అప్పుల్నీ, ఆస్తిపాస్తుల్నీ, శక్తియుక్తుల్నీ ఎన్నడూ పూర్తిగా బయటపెట్టకు.

 

  1. Prodigality of time produces poverty of mind as well as of estate.

 

కాలాన్ని వృధా చేస్తే మెదడు మెద్దుబారటమే కాదు, ఉన్న ఆస్తికూడా కరుగుతుంది.

 

  1. Promise may get thee friends, but nonperformance will turn them into enemies.

 

హామీలు స్నేహితుల్ని కూడగట్టొచ్చునేమో గాని, అవి నెరవేర్చక పోవడం మాత్రం తప్పక వాళ్ళని శత్రువులుగా మారుస్తుంది.

 

  1. Proud modern learning despises the ancient. Schoolmen are now laughed at by schoolboys.

 

నేటి చదువులు, నిన్నటి చదువుల్ని చిన్నచూపు చూస్తున్నాయి. తమ బడిలో మునుపు చదువుకున్న పెద్దల్ని ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఆటపట్టిస్తారు.

 

  1. Quarrels could never last long, if on one side only lay the wrong.

 

పొరపాటు ఒక పక్షాన్నే ఉంటే, తగవులు ఎక్కువ కాలం కొనసాగవు.

 

  1. Rather go to bed supperless, than run in debt for a breakfast.

 

ఫలహారానికి అప్పు చెయ్యడం కంటే, ఈ రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవటం మేలు

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.