Sweet Lays on the Shore… Kasiraju, Telugu Poet
Behind the surging lofty waves
Or beneath the slightly moist sands
There lie some sweet enduring lays
That converse with every lonely soul.
Foot prints on the wet sand
Before being swept away by the breaking wave
Pleaded for a patient ear
To narrate their impressive stories.
Meanwhile, a long tide
Kissed my feet and rolled over
Introducing the warmth of a moist touch.
I saw some shells smiling pleasantly.
As I started gleaning them one by one
I heard your voice
Asking “are you harvesting smiles?”
Father!
Whenever I come to beach, thence,
You show up in my thoughts.
.
Kasiraju
Telugu
Indian Poet
From: “BhuumadhyarEkha”

తీరంలో తీపిమాట
ఉవ్వెత్తునలేచే అలల చాటునో
తడిపొడిగా ఉన్న తీరంలోని ఇసుకలోనో
కొన్ని ఊసులున్నాయ్
అవి ప్రతి ఏకాంతంతోనూ కొన్ని కబుర్లు చెప్పాయ్.
నడిచిన ముద్రపడి
అలలకు చెదిరిపోయే అడుగులుకొన్ని
కథచెబుతాం కాస్సేపు కూర్చోమన్నాయ్.
ఉరుకుతూ ఉన్న అల ఒకటి
కాళ్ళపైకొచ్చి
తడిస్పర్శను పరిచయంచేసి పోయింది.
గవ్వలుకొన్ని నవ్వుతూ కనిపించాయ్
ఒక్కొక్కటీ ఏరి చేతిలో వేసుకుంటుంటే
నవ్వులుపోగేస్తున్నావా అంటూ
వెనకనుండి నీ మాటలు వినిపించాయ్
నాన్నా!
ఇకపై సముద్రాన్ని చూసినప్పుడల్లా
నువ్వే గుర్తొస్తావ్!
.
కాశిరాజు
భూమధ్యరేఖ కవితా సంకలనం నుండి.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి