Ustad Rashid Khan …
Is a towering musical wave.
When that gust of pleasant camphoric fragrance
Wafts in every direction
Oh! What a festival treat it is for all yearning ears!
As the vibrant voice pervades and fills
The environ like a fragrant cloud,
Won’t its daub of celestial music
Heal the wounds of the heart within
And transport the subject to the limits of ecstasy?
That mellifluous rendering of lilting Tarana
In the ‘Desi” Rag,
That peerless natural presentation
Streaming spontaneously
From an unruffled meditative state
Rekindles the latent dormant life-force
And the sonorous voice
Brings to fore eons of quiescent vitality.
O, Future hope of Hindustani classical vocal!
Let more and more Khayals ignite in your voice,
Let the festoons of Taranas
Remind us of the musical festivals.
Let this earth bathe in the gentle winds
That have a touch of your Sweet scented voice.
.
Elanaga
Telugu, Indian

Elanaaga
పరిమళ మేఘం.
ఉస్తాద్ రాషిద్ ఖాన్.
ఒక ఉత్తుంగ సంగీత తరంగం.
గుప్పుమనే ఒక కమనీయ కర్పూర సౌరభం.
అన్నిదిక్కులా అది పరచుకున్నదంటే
ఎన్ని కర్ణేంద్రియాలకు పండుగో!
చుట్టూ పరిమళమేఘంగా
పరివ్యాప్తమయే ఆ స్వరచాలనం
ఆ గంధర్వగానామృత లేపనంతో
గుండెలోపలిగాయాలు మాయమై
పల్లవించదా పారవశ్యం?
‘దేశం‘ (1)లో తళుకులీనిన
ఆ తారళ్యపు తరానా
నిశ్చలసమాధిలో
నిసర్గంగా వెలయించిన అనిరుపమ గానం (2)
పరిమళించే ప్రాణశక్తిని లేపుతూ
యుగయుగాల సుప్త చేతనను
మేల్కొలిపే కంఠమాధుర్యం.
భావిభారత సంగీతరంగపు ఆశాదీపమా! (3)
ఖయ్యాలులు ని కంఠంలో రగులనీ మరింతగా
తరానాల తోరణాలు
తలపించనీ సంగీత వసంతోత్సవాలని.
నీ సుస్వర సమీరాల సుగంధస్పర్శతో
పులకించనీ ఈ పుడమినంతా!
.
ఎలనాగ
-
“దేశ్” రాగంలో తరానా
-
గోరఖ్ కళ్యాణ్ రాగంలో దాదాపు 62 నిముషాల పాటు అద్భుతంగా సాగే ఖయ్యాల్
-
ఉస్తాద్ రాషిద్ ఖాన్ గురించి భారత రత్న పండిత్ భీం సేన్ జోషి చేసిన వ్యాఖ్య.
స్పందించండి