Youth is an itinerant vagabond
Old age is an uninvited guest
Who rests for too long
In a lackluster house.
When a fleeting light falls on you
And glistens
Memories of distant past
Fly like fireflies
In the thicket of my dark eyes.
While the opportunities of morrow
Stretch before you
Like enduring pastures
The days slipped out my hands
Float like wasted flowers
On the river of turbulent times.
On this ever spiraling earth
Leaning thoughtfully aside
Every being has its seasons.
But it is only the tree that Spring
Greets over and over with its sweet touch.
.
Vinnakota Ravi Sankar
Telugu
Indian

Vinnakota Ravisankar is living in Columbia, South Carolina, USA for the last 20 years. He has to his credit three collections of poetry in Telugu published so far — kuMDeelO marri ceTTu (The Bunyan in a Flowerpot) (1993), vEsavi vaana (Summer Rain) (2002) & remDO paatra (The Second Role)(2010).
మళ్ళీ వసంతం
యౌవనం నిరంతర సంచారి
ముసలితనం
అలసిన గృహంలో చిరకాలం తిష్టవేసే
ఒక అనాహ్వానిత అతిథి.
పారిపోయే వెలుగు
నీపై పడి మెరిసినపుడు
ఎప్పటెప్పటి జ్ఞాపకాలో
నా చీకటికళ్ళ గుబుర్లలో
మిణుగురులై మెదుల్తాయి.
రేపటి అవకాశాలు నీ ముందు
అంతులేని పచ్చిక బయళ్ళలా పరుచుకున్నప్పుడు
చే జారిన నా గత దినాలు
ఒడుదుడుకుల కాలం నదిలో
రాలిన పూలై కదుల్తాయి.
సాలోచనగా వాలి
నిత్యం పరిభ్రమించే భూమి మీద
ప్రతి జీవికీ ఋతువులుంటాయి
కాని ఒక చెట్టుని మాత్రమే వసంతం
మళ్ళీ మళ్ళీ వచ్చి తట్టి పలకరిస్తుంది.
.
విన్నకోట రవిశంకర్
rvinnako@yahoo.com
11th Sept 2017 Andhra Jyothi Daily
స్పందించండి