In the Moil of Hands… Bala Sudhakar Mauli, Telugu, Indian
Image Courtesy: Matruka Sept 2017
No
Drop of empathy is shed
No
Helping hand stretches out
But the moil of hands
Presents life
In thousand and one
Scenarios.
And,
In Each such Scene
Every Drop of Sweat
Remains a metaphor
For the monumental humanity
In the annals of history.
Yet
neither the hunger is half-served
nor the trails of blood are half-erased.
In the moil of hands
The Night
Tucks its wings to sleep
The Day
Spans its wings to wake up.
The poor
Jasmine flowers
However,
Laboring
Day and night
Dream of
Peaceful sleep some day.
.
Bala Sudhakar Mauli
Telugu
Indian
Photo Courtesy:
Balasudhakar Mauli
.
రెక్కలకష్టంలోనే
.
ఒక్క
ఓదార్పు చినుకూ రాలదు
ఒక్క
చేయి సాయమూ మిగలదు
రెక్కలకష్టం మాత్రం
బ్రతుకుని
వేయిన్నొక్క దృశ్యాలుగా
చిత్రిస్తుంది
ఒక్కో దృశ్యంలో
ఒక్కో చెమటబొట్టూ
మానవరూపానికి
నిలువెత్తు ప్రతిబింబమై
చరిత్రపుటల్లో మిగిలిపోతుంది.
కానీ
కడుపుల ఆకలి తీరదు
కరిగే
నెత్తుటి జీరలు చెరగవు.
రెక్కలకష్టంలోనే
రాత్రి
రెక్కలు ముడుచుకుని
నిద్రపోతుంది.
పగలు
రెక్కలు కూడదీసుకుని
నిద్రలేస్తుంది.
ఒంటరి
బొండుమల్లెలు మాత్రం
రాత్రీ పగలూ
శ్రమని కలగంటూ
నిద్రని
చెరిపేసుకుంటాయి.
.
బాల సుధాకర్ మౌళి
(“మాతృక” సెప్టెంబరు 2017 సౌజన్యంతో)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి