The Room… Nyayapati Srinivasa Rao, Telugu, Indian

Because I can’t help it

I enter the room

Saying open sesame

To the lock blocking my way.

If some letters

Slip through the door

I have to pick them up.

Of course,

I may as well ignore and walk in.

  

The animate,

The inanimate, and I

In this Room are

So familiar to one another 

That, even when the doors were closed

We feel as if we were watching

A wonderful attraction

At the City Center.

True!

There were times when I felt

Lonely or Grave yard silence in this Room

But not anymore.

 

It is in this Room

That I achieved self-control.

Creating my own alter egos

I learnt living in my own company.

(I must acknowledge the yeoman service

Rendered by my Room in this endeavor)

My room saved me

From blaming others like Selkirk.

What more,

Even before I started loving the room

It had started loving me.

This Room’s influence on me

Is not just great;

It is utmost.

Because I live

Away from my home and people

I can cite many examples:

The railway station

No longer looks as invaluable

As the Cashmere Shawl.

 

Whenever I think of trains

My eyes no longer

Get bleared with swelling tears.

Didn’t I tell you

I achieved self-control in this Room?

If I am the soul of this Room

The Room is my bod.

 

Just as we come back and

Re-read a sentence

While reading a book…

At times,

While locking the door

I forget what I wanted to do

And, opening the door

I walk in instead

  

When I stand at the threshold

Of my Room as I lock it,

I look like a follicle of hair

Coming out of an inflated mole.

 

In that well known fable

Just as the fox and the crocodile

Negotiated friendship on the seashore

The camaraderie between

Me and my Room

Lasts forever.

.

Vasu

(Nyayapati Srinivasa Rao) 

(Born 17 Nov 1964)

Telugu

Indian


 

Born on 17 Nov 1964 in Berhampur, Odisha, Vasu (Nyayapathi Srinivasa rao) is an IT professional working and living in Bangalore. He wrote mostly during the period 1987-93 and published his collection of poems, titled “కాసేపు” (For A Little While) in 2004 with a fore-word by eminent Telugu poet, critic and litterateur, Vadrevu China Veerabhadrudu. He breathes and lives poetry and adores all great poets of all ages, regardless of genre and political affiliations. He firmly believes – with strong justification – that Sri Sri is the greatest of Telugu poets for without him, Modern Telugu Poetry would not have been as
diverse and rich as it is today. He is active on Facebook.

 

ది రూమ్

 

తప్పదు గనుక

అడ్డుపడిన తాళాన్ని తీసేసి

రూమ్లోకి వెళతాను.

తలుపు సందులోంచీ

వుత్తరాలు జారిపడితే

వొంగి అందుకోవాలి.

లేదా తిన్నగానే వెళ్ళొచ్చు.

రూమ్లో సజీవులూ,

నిర్జీవులూ, నేనూ

ఒకర్నొకరం ఎరుగుదుం గనక

తలుపులు మూసుకున్నా

మా కందరికీ సిటీ జంక్షన్ లో

చోద్యం చూస్తున్నట్టే ఉంటుంది.

రూమ్లో ఏకాంతం, శ్మశాన నిశ్శబ్దం

ఒకప్పుడు కనిపించేవి.

ఇప్పుడు కాదు.

 

రూమ్లోనే ఆత్మనిగ్రహం సాధించేను.

ఏకోనేకోనమస్మి అనుకుని

సాయం సృష్టించుకోవడం

నేర్చుకున్నాను.

 (ఇందులో రూమ్ సహకారం ఎంతైనా ఉంది.)

సెల్కిర్క్ లాగ నేను నిందకి దిగకుండా

రూమే నన్ను సేవ్ చేసింది.

అంతెందుకు? 

నేను రూమ్ ని ప్రేమించక ముందే

రూమ్ నన్ను ప్రేమించడం 

మొదలుపెట్టింది.

నా మీద రూమ్ ప్రభావం ఎంతైనా కాదు.

ఎంతో ఉంది. 

ఇంటికి దూరంగా ఉంటున్నాను గనుక

దీనికి ఉదాహరణలు ఇవ్వగలను. 

ఇప్పుడు స్టేషను ఆవరణ

కాశ్మీరు శాలువలా కనిపించడం

మానేసింది.

 

రెయిళ్ళని తలుచుకుంటే పూర్వంలా

పొగనీళ్ళకళ్ళు ఎర్రబారట్లేదు.

చెప్పానుగా నేనీ రూమ్‌లో

ఆత్మనిగ్రహం సాధించానని.

నేను రూమ్ ఆత్మని. 

రూమ్ నా శరీరం.

ఒక్కోసారి మనం

పుస్తకం చదువుతూ చదువుతూ

చదివిన వాక్యమే మళ్ళీ

చదవబోయినట్టు

రూమ్ బయటకొచ్చి తాళం వేస్తూ

వేస్తూనే

తాళం తీసి రూమ్ రూమ్‌లో కెళ్ళిపోతాను.

నేను రూమ్

బైట నిలబడి తాళం

వేస్తూ గడపమీద

నించుంటే

దృశ్యం ఉబ్బిన

పుట్టుమచ్చలోంచీ

వెంట్రుకబైటపడినట్టుంటుంది. 

 

అదేదో కథలో

నక్కకీ మొసలికీ

చెలియలికట్టముందు

చెలిమి కుదిరినట్టు

నాకూ, నా రూమ్‌కీ ఎన్నాళ్ళైనా

పొసుగుతుంది.

.

(25 జూన్ 1987) 

వాసు

(Nyaayapati Srinivasa Rao)

“కాసేపు” కవితాసంకలనం 2004

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“The Room… Nyayapati Srinivasa Rao, Telugu, Indian” కి 2 స్పందనలు

    1. Chinaveerabhadrudu garu,
      Your comment gives me great fillip. Thank you very much.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: