బిచ్చగాడి మరణశయ్య … కేరొలీన్ (బౌల్స్) సదే , ఇంగ్లీషు కవయిత్రి.

నెమ్మదిగా అడుగులు వెయ్యండి— తల దించుకొండి

గౌరవపూర్వకంగా మౌనంగా తల వాల్చండి

ఎక్కడా మృత్యుఘంట మ్రోగదు

అయినప్పటికీ, ఒక అనంతాత్మ

దేహాన్ని విడిచి పోతోందిప్పుడు.

 

ఓ పరదేశీ, నువ్వెంత గొప్పవాడివయినా,

గౌరవసూచకంగా శిరసు వంచుకో;

అదిగో ఆ పేద గుడిశలో—

నామమాత్రమైన పక్కమీద…

నీకంటే గొప్పవాడు పడుక్కుని ఉన్నాడు.

 

ఆ బిచ్చగాడి  పూరిపాక కింద

చూడు! మృత్యువు దాని అధికారం ప్రదర్శిస్తోంది:

లోపలికి వెళ్ళు… జనాలెవరూ లేరులే

ఫర్వాలేదు ప్రవేశించు— కాపలాదారులడ్డుకోరులే

ఈ భవన ముఖద్వారాన్ని.

 

చల్లగా తడిగా ఉన్న కాలిబాట నిర్మానుష్యం… 

ఏ సభికులూ ఉల్లాసంగా నడిచిపోరు;

బక్కచిక్కిన చేతులతో మౌనంగా

ఒక స్త్రీ మాత్రం లేవనెత్తుతోంది

ప్రాణం వీడుతున్న ఆ తలని

 

పాపం, ఒక శిశువు ఒంటరిగా ఏడుస్తోంది,

అక్కడ తోడుగా ఏడవడానికి ఎవరూ లేరు;

మరొకసారి ఎగదన్నుకు వస్తున్న ఎక్కిళ్ళను

క్షణం సేపు ఊపిరిబిగబట్టి ఆపుకునే ప్రయత్నం…

వెంటనే పైకితన్నుకొచ్చిన ఆపుకోలేని ఆర్తి. 

 

ఆహ్! ఏమి మార్పు! ఎంత అద్భుతమైన మార్పు!

జైలు ఊచలు బద్దలయ్యాయి;

ఈ క్షణం వరకు, ఇక్కడే

బాధతో కిరకిరచుట్టుకుపోయి,

మరుక్షణం… నక్షత్రాలకావల!

 

ఆహ్! ఏమి మార్పు! బ్రహ్మాండమైన మార్పు!

ఇప్పుడక్కడ ఉన్నది ప్రాణంలేని మట్టిముద్ద;

ఆద్యంతరహితుడైన సూర్యుడు ఉదయిస్తున్నాడు

అతనితో పాటే సరికొత్త అమరుడుకూడా లేస్తున్నాడు


అతని దేవునితో పాటే!

.

కేరొలీన్ (బౌల్స్) సదే

(6th Dec 1787– 20th July1854)

ఇంగ్లీషు కవయిత్రి.

.

The Pauper’s Death-bed

 

.

Tread softly—bow the head—

In reverent silence bow—

No passing bell doth toll—

Yet an immortal soul

Is passing now.

 

Stranger! however great,

With lowly reverence bow;

There’s one in that poor shed—

One by that paltry bed—

Greater than thou.

 

Beneath that beggar’s roof,

Lo! Death doth keep his state:

Enter—no crowds attend—

Enter—no guards defend

This palace gate.

 

That pavement damp and cold

No smiling courtiers tread;

One silent woman stands

Lifting with meagre hands

A dying head.

 

No mingling voices sound—

An infant wail alone;

A sob suppressed—again

That short deep gasp, and then

The parting groan.

 

Oh, change! oh, wondrous change!

Burst are the prison bars:

This moment there, so low,

So agonised, and now

Beyond the stars!

 

Oh, change! stupendous change!

There lies the soulless clod;

The Sun eternal breaks—

The new Immortal wakes—

Wakes with his God!

.

Caroline (Bowles) Southey

(6th Dec 1787– 20th July1854)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: