నెల: జూన్ 2012
-
బాధ … సారా టీజ్డేల్
కెరటాలు సముద్రపు శ్వేత పుత్రికలు చిరు చినుకులు ఆ వర్షపు చిన్ని పిల్లలు నులివెచ్చని నా తనువున ఏ మూలనో మాతృత్వపు తీపు? . రాత్రి ఈ తారకలకు మాతృమూర్తి నురగలని చేతుల్లోకెత్తుకుని ఆడిస్తోంది గాలితల్లి విశ్వమంతా సౌందర్యంతో పొంగిపొర్లుతోంది కానీ, నేనే ఇంటిపట్టున ఉండిపోవాలి . సారా టీజ్డేల్ మాతృత్వ కాంక్ష ఎలా ఉదయిస్తుందో సారా టీజ్డేల్ ఈ కవితలో చక్కగా చెప్పింది. ఆ కాంక్ష మనసులో రగిలినప్పుడు ప్రకృతిలోని సమస్త వస్తువులూ మాతృత్వపు ప్రతిబింబాలుగా కనపడినట్టు చెప్పడం…
-
గాలి ఘోషిస్తోంది … బాబ్ డిలన్
. మనిషిని మనిషిగా గుర్తించడానికి అతను ఇంకా ఎంత దూరం నడవాలి? ఆ తెల్లని పావురం ఇసుకలో నిద్రించడానికి ఇంకా ఎన్ని సముద్రాలు దాటాలి? అవును, ఎన్ని ఫిరంగి గుళ్ళు ఇంకా గాలిలో ఎగరాలి వాటిని శాశ్వతంగా నిషేధించడానికి? మిత్రమా! దీనికి సమాధానం గాలి ఘోషిస్తోంది, గాలి ఘోషిస్తోంది. . అవును, ఇంకా ఎన్ని సంవత్సరాలని పర్వతం నిల్చోవాలి అది సముద్ర స్నానం చెయ్యడానికి? అవును, ఎన్ని సంవత్సరాలు ఇంకా మనుషులు బతికి బట్టకట్టాలి, వాళ్ళని స్వతంత్రంగా జీవించనివ్వడానికి?…
-
లండను నగర దృశ్యం.4.. శ్మశానవాటి… లెటిషా ఎలిజబెత్ లాండన్
. నిన్ను బ్రతిమాలుకుంటా ఈ చివికిపోతున్న ఎముకలమధ్య నన్ను సమాధిచెయ్యొద్దు. కిక్కిరిసిపోతున్న ఈ రాళ్ళగుట్టలు నేలను మరీ గట్టిగా ఒత్తుతున్నాయి. వాళ్ళ ఆడంబరాలతో, ఆనందాలతో జన జీవితం మరీ చేరువగా ఉంది; ప్రాపంచికసుఖాలకు అలవాటుపడ్డ ఈ నేలమీద నిన్ను బ్రతిమాలుకుంటా, సమాధిచెయ్యవద్దు ఎడతెరిపిలేని ఈ వాహనాల చప్పుళ్ళు చనిపోయిన వాళ్ళకి నిద్రాభంగంచేస్తాయి ఓహ్, నా తలమీంచి ఇలా జీవితం రాదారివెయ్యడం నేను జన్మజన్మలకీ భరించలేను. ఇక్కడ స్మృతిఫలకాలు, నిస్తేజంగా, బావురుమంటున్నాయి అవి దేనికదే ఒంటరిగా నిలబడి…
-
సుఖమయ జీవితానికి ఆనవాళ్ళు … సర్ హెన్రీ వాటన్
. స్వతంత్రుడుగా పుట్టినవాడుగాని, బానిసగా బతకకూడదని నేర్చినవాడుగాని ఎంత సుఖంగా ఉంటాడో గదా! నైతికవర్తనే అతని కవచం; సత్యమే నైపుణ్యం. ఆవేశాలు అతన్ని శాసించలేవు మృత్యువంటే అతనికి భయమూ ఉండదు; కీర్తి ప్రతిష్టల లాలసగాని, స్వంత ఆస్థుల లౌల్యం గాని అతన్ని కట్టిపడెయ్యవు అదృష్టం అందలమెక్కించినవాళ్ళనుచూసి అసూయ ఉండదు; వ్యసనాల ఊసు లేదు; పొగడ్తలతో మానని గాయాలు చెయ్యడం తెలియదు; సద్వర్తనమే తప్ప, చట్టాల నిబంధనలు తెలియవు. పుకార్లకి దూరంగా ఉంటాడు ప్రశాంత చిత్తమే అతని బలమైన…
-
మనిషి… సర్ జాన్ డేవీస్
. నాకు తెలుసు ఈ జీవికి అన్నీ తెలుసుకోగల సమర్థత ఉందని, కానీ, అది అన్ని విషయాలలోనూ గుడ్డిగానూ, అవివేకంగానే ప్రవర్తిస్తుంది. నాకు తెలుసు, ప్రకృతి ముద్దుబిడ్డల్లో నేనూ ఒకడినని కానీ, ఎప్పుడూ తుఛ్ఛమైన విషయాలకే బానిసనవుతుంటాను. . నా జీవితం బాధామయమనీ, కానీ క్షణికమనీ తెలుసు; నా ఇంద్రియాలు నన్ను అన్నివిషయాలలోనూ వంచిస్తాయనీ తెలుసు; చివరగా, నేను మనిషినని కూడ నాకు తెలుసు— అది గర్వకారణమే కాదు, దౌర్భాగ్యం కూడా. . సర్ జాన్ డేవీస్ (16…
-
మంచుకురుస్తున్న సాయంత్రం… ఊరికి దూరంగా… రాబర్ట్ ప్రాస్ట్.
. ఈ కళ్ళాలు* ఎవరివో నాకుతెలుసుననుకుంటున్నాను, అయితే, అతని ఇల్లుమాత్రం ఊర్లోనే ఉంది; అతను నేనిక్కడ ఆగడంగాని, అతని తోటనిండా మంచు పరుచుకోడం గాని చూడలేడు. ఈ ఏడాదిలోనే ఇంతచీకటి ఎరుగని సాయంత్రవేళ గడ్డకట్టుకుపోయిన సరస్సుకీ ఈ కళ్ళాలకీ మధ్య ఏ ఖండ్రికా లేనిచోట ఆగిపోవడం నా చిన్ని గుర్రానికి వింతగా తోచవచ్చు దాని జీరాకి తగిలించిన చిరుగంటలు ఒకసారి మోగిస్తూ సంజ్ఞచేసింది పొరపాటున ఆగలేదుగదా అన్నట్టు. ఇక్కడ వినిపిస్తున్న ఇతర శబ్దమేదైనా ఉందంటే, అది చల్లగా వీస్తున్న గాలిదీ,…
-
Driftwood… Sara Teasdale
. కొట్టుమిట్టాడుతున్న నా ఆత్మజ్యోతికి ఒక ఆకారాన్నీ, ఒక హృదయాన్నీ, ఒక పేరునీ ఇచ్చింది నా తాతముత్తాతలే గాని నిలకడలేని ఆ దీపకళికకి ఇంద్రధనుసు వన్నెలనద్దింది మాత్రం నా ప్రేమికులే… రగుల్తున్న బల్లచెక్క తన రతనాలవెలుగులను సముద్రంమీద దిక్కులేక కొట్టుకొస్తున్నప్పుడు, నీలి అలల దీప్తులనుండీ, రంగురంగుల రేయింబవళ్ళనుండీ నేర్చుకున్నట్టు. సారా టీజ్డేల్ . Driftwood . My forefathers gave me My spirit’s shaken flame, The shape of hands, the beat of…
-
సుద్దులు … ఫాతిమా అల్ మతార్, కువైటీ కవయిత్రి
నీళ్ళు ఎలా సంతోషంగా ముందు కూజా ఆకారంలోకి ఒదిగిపోతాయో, మరు నిమిషంలోనే మంచినీళ్ళ గ్లాసులా ఎలా మారగలుగుతాయో ఆమె తన మనసుకి ప్రదర్శించింది; ఆమెకి తెలుసు వేడి టీ కప్పులో పంచదారని సాత్త్వికంగా కలిపినా, మోటుగా కలిపినా, త్వరత్వరగాకలిపినా, నెమ్మదిగాకలిపినా ఇష్టపూర్వకంగానే కరిగిపోతుందని; ఒక టులిప్ దుంప ఎక్కడ పాతితే అక్కడే మొలిచి, శ్రద్ధగా పెకలించి మరొక తోటలోకి తీసుకెళ్ళి పాతితే, అక్కడకూడ అంత బాగానూ పెరిగి, అభివృధ్ధిచెందుతుందనీ తెలుసు; ఆమె అయిష్టంగా ఉన్న తనమనసుకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది: పలుపుతాడుతో…
-
అనుభూతి … రింబో, ఫ్రెంచి కవి
. వేసవి వినిర్మల సాయంత్రపువేళలో, నీలాకాశం దిగువన అలా కాలిబాటల్లో లే పచ్చికమీంచి నడుచుకుంటూ పోతుంటాను వరికంకులు గుచ్చుకుంటుంటాయి, నా కాళ్ళక్రింద ఆ చల్లదనాన్ని ఏదో కలలోలా, అనుభూతిచెందుతాను. రక్షణలేని నా శిరసుమీదినుండి చిరుగాలి ఒరుసుకుని పోనిస్తూ… నేనేం మాటాడను… ఏ ఆలోచననీ దరి రానీయను… అంతులేని ప్రేమతో నా ఆత్మ నిండిపోతుంది. నే నెక్కడెక్కడికో పల్లెసీమలవెంట దేశద్రిమ్మరిలా తిరుగాడుతుంటాను… నాకిపుడు ఎంత ఆనందంగా ఉందంటే… చెంత నా సహచరి ఉందేమోన్నంత. . రింబో ఫ్రెంచి కవి…
-
నాకు పూలంటే ఇష్టం లేదు … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి
నాకు పూలంటే ఇష్టం లేదు… అవి ఎప్పుడూ విందుభోజనాలనీ, నాట్యశాలల్నీ, పెళ్ళిళ్ళనీ శవయాత్రలనీ గుర్తుచేస్తుంటాయి. కానీ, చిన్నప్పుడు నాకు ఊరటగా నిల్చిన నశ్వరమైన గులాబీల నిత్య నూతన సౌందర్య శోభ ఇన్ని సంవత్సరాలూ నాలో నిలిచిపోయింది…వారసత్వంలా… మోచాత్ అజరామర సంగీతం గొంతులో కూనిరాగాలు తీసినట్టు. . అనా అఖ్మతోవా (జూన్ 23, 1889 – మార్చి 5, 1966) సోవియట్ రష్యను కవయిత్రి . (ఈ కవితలో ఆవేదన పూలంటే నిజంగా ఇష్టం లేకపోవడం కాదు. వాటిని…