When the Vowel in Me is Lost… Afsar
After a lifetime,
Dear daddy!
I get to know you… gradually
And ever slowly.
Like a warm sigh died down…
Like the dim blinking evening lamp in the niche
Refusing to blow out or snuff out.
.
The lesson of life…
What hundreds of dawns
And few more hundreds of evenings
And the silent nights and friendless midnights
And the un-thawing gloomy days
Had failed to teach…
Turns a new leaf today.
.
After you had completely slipped down my eyes,
This house became a boat afloat
On the river of infinite silence
Following your absence.
Only after you had left,
In the shadow of the lamp lit near your head,
Perhaps, I was really noticing you.
.
I am a hovel
Leaning on the post of a deep sigh
Perplexed as what to choose
Between life and death.
Death is an untaught lesson … every time.
The same monotonous repetition,
Of a fly
And a peacock’s feather,
On the same page.

Afsar
Lecturer, Telugu at University of Texas, Austin,
.
ఒక నేను వెళ్లిపోయింది
వొక జీవిత కాలం తరవాత, నాన్నా
నువ్వు అర్ధం అవుతున్నావ్ నెమ్మదిగా.
అతి నెమ్మదిగా
ఆగిపోయిన వేడి నిట్టూర్పులాగా సాయంత్రపు గూటిలో ఆరిపోవడానికో
పారిపోడానికో నిరాకరించే గుడ్డి దీపంలాగా.
వందల వుదయాలు
ఇంకా కొన్ని వందల సాయంకాలాలు
సడి సేయని కొన్ని రాత్రులూ స్నేహరాహిత్యపు నడి రాత్రులూ
ద్రవించని చీకటి పగళ్ళూ
నేర్పలేని బతుకు పాఠం ఏదో
కొత్త పేజీ తిప్పుతోంది ఈ పూట
నువ్వు పూర్తిగా నా కంటిలోంచి జారిపోయాక
ఈ ఇల్లు నీ అనంతర నిశ్శబ్దపు నదిలో
పొగిలిపోతున్న పడవ
నువ్వు వెళ్ళాకనే
నీ తలాపు దీపపు నీడలోనే
నిన్ను నిజంగా చూస్తున్నానేమో నేను
ప్రేమించాల్సింది బతుకునో
మరణాన్నో తెలియక
వొక నిట్టూర్పు నిట్టాడి మీద
నిటారుగా వొరిగే గుడిసె నేను .
మరణం ఎప్పుడూ వో కొత్త పాఠమే!
అదే పేజీ మీద
అదే ఈగ
అదే నెమలీక
అదే పునరుక్తి.
it is a very loving poem and a faithful translation. high fidelity is visible when they are looked together. yes most of the sons including me realizes their fathers only after disappearance of their fathers. a touching poem.
Pulikonda Subbachary.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you for your visit and comments.
with best regards
మెచ్చుకోండిమెచ్చుకోండి
NS Murthy garu
please see my latest poems in my blog
మెచ్చుకోండిమెచ్చుకోండి
I am not able to log on to your web site. Please provide link to your web site or its name.
with best regards
మెచ్చుకోండిమెచ్చుకోండి
dear Murty garu.
please visit the following
Subbachary
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఇక్కడ ఒక తండ్రి విలువ (మనిషి విలువ కూడా నేమో ) మరణం తర్వాత మాత్రమే అర్ధం అవుతుంది.
ఒక మరణం తర్వాత విలువైన అనుభవ పాఠాలెన్నో దిశా నిర్దేశాలు ,తప్పనిసరి అయిన మోయాల్సిన హృదయ భారాలు.
అనుభవైకవేద్యమైన కవిత కదిలించింది. అక్షరం అక్షరం సమ్మోహనావేదనగా..
అనువదించిన మీకు మరియు పరిచయం చేసినందులకు ధన్యవాదములు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
వనజగారూ,
బాగా చెప్పారు. మనకి ప్రేమకంటే, ప్రేమ అన్నభావన మీద మక్కువ ఎక్కువున్నట్టే, మనకి నాస్టాల్జియా మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. ఈ నాస్టాల్జియాలో వ్యక్తిని నిష్పక్షపాతంగా అంచనావెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే, ఇతరుల అభిప్రాయాలూ అంచనాలూ కూడా పోయిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని బేరీజు వెయ్యడంలో పనిచేస్తుంటాయి. ఆ వ్యక్తి ఎదురుగా ఉన్నంతసేపూ మన అభిప్రాయాలూ, మన అంచనాలూ అతని వ్యక్తిత్వాన్ని విలువకట్టడానికి అవరోధాలుగా నిలుస్తాయి. అందుకే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు తెలుసుకోలేని విలువ వాళ్ళ తదనతరం తెలుసుకుంటుంటాం. కాకపోతే, అప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయి వేదనో, పశ్చాత్తాపమో మిగుల్తాయి. మన జ్ఞానం ఎదురుగుండా ఉన్న వ్యక్తి గుణాలనే గాని దోషాలని చూడకుండా ఉండగల మానసిక పరిణతిని తీసుకురాలేకపోతోంది.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
తెలుగులో ఇంతకుముందు చదివాను….ఆ ఫీల్ గుండెనిండా నింపుకున్న పొగలా ఇంకా అలానే ఉంది ఇప్పుడు మళ్ళో ఆ ఫీల్ ని మరోసారి నింపుకున్నాను,..చాలా వరకూ సఫలీకృతులయ్యారనే చెప్పాలి. మరణం, అదీ తండ్రిమరణం వాక్యూమ్ అంటే పరిచయం అయ్యేది, తెలిసేది ఇప్పుడే..ఆ బలమైన భావనని ముందు అఫ్సర్ తర్వాత మీరు శక్తివంతంగానే చెప్పగలిగారు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
వాసుదేవ్ గారూ,
నిజం. తల్లిదండ్రుల మరణం ప్రకృతిసిధ్ధమే అయినా, అదెప్పుడూ ఒక వెలితిని సృష్టిస్తూనే ఉంటుంది. ఆ వెలితిని ఎవ్వరూ పూడ్చలేరు. వాళ్ళు ఎలాంటివాళ్ళయినా మనకి జన్మనిచ్చి, ఈ ప్రకృతినీ, ఇందులోని సౌందర్యాన్నీ, ఇంద్రియాలద్వారా అనుభవించగలిగే అవకాశాన్నీ, తర్కంద్వారా విశ్లేషించగల బుధ్ధిజీవులుగా బ్రతికే అవకాశాన్నీ కల్పించేరు. లేకపోతే మనం ఏ సహారా ఎడార్లో ఇసక రేణువు గానో, మురికిగుంటలో పొర్లే క్రిమికీటకాదులుగానో, అనంత నిశ్శబ్ద వనాల్లో ఏ స్థావరం గానో, మందబుధియైన జంగమం గానో, సమాధుల్లో రాయిముక్కగానో మిగిలిపోయి ఉండేవాళ్ళం. వాళ్ళు మనకి ఇంకే లౌకికమైన వస్తుసంపద వారసత్వంగా ఇవ్వలేకపోయినా, ఇంత అమూల్యమైన శరీరాన్ని ఇచ్చేరు. వాళ్ళకి సదా ఋణపడి ఉండడానికి ఇంతకంటే ఏమిటి కారణం కావాలి?
అభివాదములతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి
పైన కొన్ని టైపోస్ దొర్లాయి..తండ్రి మరణం ఓ వాక్యూమ్ ని నింపుతుంది మనలో…వాక్యూమ్ అంటే ఏంటో తెలిసేదీ ఇప్పుడే!
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you for this poem.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you Dr. Bonnie Zare
Best regards
మెచ్చుకోండిమెచ్చుకోండి