అనువాదలహరి

Everything Looks the Same … Bolloju Baba

.

Everything seems it has been seen somewhere
And has been experienced sometime before.

Everything thing looks just the same…
births, deaths;
victories, agonies;
strategies and betrayals,
dreams, tears,
bonds and affections…
They all look just alike.

Everything seems to have been dreamt of once;
The life that revolves amidst
yes, no;
maybe, occasionally…
like an ox tethered to the oil-ghanny …
appears to have been thought of before.

The dreams of life sound as banal
As the monotonous cooing of a caged bird

No matter you read what
the same letters and meanings seem
repeating themselves over and over.

Even the weeds that grow on the
mound of time
look like cloned progeny
ultimately.

.

Image Courtesy: http://sahitheeyanam.blogspot.in/

 

.

అన్నీ ఒకేలా ఉంటాయి

.

ప్రతీదీ ఎక్కడో చూసినట్టే ఉంటుంది.
ఎప్పుడో అనుభవించినట్లే ఉంటుంది.

అన్నీ ఒకేలా ఉంటాయి.
ఉదయాలు, మరణాలు
విజయాలు, వేదనలు
ఎత్తుగడలు, దొరికిపోవటాలు
కలలూ కన్నీళ్లూ, బంధాలూ ప్రేమలూ,
అన్నీ ఒకేలా ఉంటాయి.

ప్రతీదీ ఎప్పుడో ఒకప్పుడు
స్వప్నించినట్లే ఉంటుంది.

అవును, కాదు
కావొచ్చు, అప్పుడప్పుడూ,
లాంటి మాటల మధ్య జీవితం
గానుగెద్దులా తిరుగుతుందన్న విషయం
ఎపుడో ధ్యానించినట్టే ఉంటుంది.

పంజర పక్షి పదే పదే వినిపించే గానంలా
జీవితం కనే కలలు
ఎప్పుడూ ఒకేలా ధ్వనిస్తాయి.

ఏం చదివినా
అవే అక్షరాలు, అవే అర్ధాలు
పునరావృతమైనట్టే అగుపిస్తాయి.

ఆఖరుకు
కాలం దిబ్బపై మొలచిన
పిచ్చిమొక్కలు కూడా
క్లోన్డ్ సంతతిలా అనిపిస్తాయి.

బొల్లోజు బాబా

2 thoughts on “Everything Looks the Same … Bolloju Baba”

    1. అమ్మా మధురవాణీ,
      అవును. ఒక్కోసారి జీవితం నిస్సారంగా, గానుగెద్దు జీవితంలా, చేస్తున్నవే చేస్తూ ఎందుకు చేస్తున్నామో తెలియక ఆరాటపడే స్థితిని అనుభవిస్తుంటాం. జీవితం మీద ఉత్సాహం చచ్చిపోతుంది. ఈ మానసిక స్థితిని బాబా గారు ఈ కవితలో బాగా పట్టుకొచ్చేరు.
      ఆశీస్సులతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: