My village … Radhika

Fig Tree 2 - Santa Barbara
Fig Tree 2 – Santa Barbara (Photo credit: gem66)

.

Maybe
She felt my absence
The Fig Tree in the midst of the village
Had shed its leaves…

Maybe, it thought it was no more relevant
The stone bench had showed up cracks.

The temple-steps and the banks of the village tank
Seemed eagerly waiting for me…

There was no trace of the creaking
Of the rope-swing laid on to the guava tree

Perhaps they might have thought that I won’t return,
Some close and dear
Had deserted the place.

Now, the village stands
A dilapidated testimony
To my history.

Oh! I shouldn’t have gone there.
It would, at least, have remained lively in my memories.

Radhika.
Image Courtesy: http://snehama.blogspot.in/

… Radhika

Original From: http://snehama.blogspot.in/2009/08/blog-post.html

(With apologies to Radhika garu for not taking her permission.)

As per the information available in her blog, she is a home maker living in Wisconsin, US. I will be thankful if any of the readers of this blog could communicate my sincere appreciation for some of her poems she published in her blog.

.

నా ఊరు …

నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు

.

రాధిక

“My village … Radhika” కి 4 స్పందనలు

  1. మూర్తి గారూ నేను రాధిక గారి అభిమానినండీ..ఆవిడ రాసిన ఈ కవిత నాకు చాలా నచ్చింది. మీ అనువాదానికి మంచి కవిత నెంచుకున్నారు.

    మెచ్చుకోండి

  2. అమ్మా జ్యోతిర్మయీ,
    ఆమె మీకు పరిచయముంటే నాకు తెలియపరచండి. ఆమెకు నా తరఫున అభినందనలు అందజెయ్యండి.
    ఆశీస్సులతో

    మెచ్చుకోండి

  3. మూర్తి గారూ నా కవితని అనువాదానికి ఎంచుకున్నందుకు చాలా ఆనందం గా వుందండి.నా బ్లాగులో దేనికీ కాపీ రైట్స్ పెట్టలేదండి.అందరికీ చేరడమే ముఖ్యం.మీరు అపాలజీ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు.
    నా కవితకి చక్కటి గౌరవాన్ని అందించినందుకు మరొ`క్కసారి ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

    1. రాధికగారూ,
      మిమ్మల్ని మీ బ్లాగుమూలంగా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ కవితలు నిన్ననే చదివాను. అందులో నాకు బాగా నచ్చినవి ఇంకా ఉన్నాయి. అవికూడ వీలువెంబడి అనువాదం చేద్దామనుకుంటున్నాను. అంతమంచి భావనలు వెలువరించిన మీరు మీ బ్లాగు కొనసాగించనందుకు కొంచెం బాధపడ్డాను. మీ బ్లాగులో కాపీ రైట్స్ పెట్టకపోయినా, కవికి ముందుగా సమాచారం అందజేసి అనుమతి తీసుకోవడం సభ్యతకదా. అలా తీసుకోలేకపోయినందులకే క్షమాపణలు అంతే.
      అభివాదములతో,

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: