Weapon for Thousand Tumors … K. Geetha

“వేయి వ్రణాల ఆయుధం” కవయిత్రి కె.గీత స్వరంతో ఇక్కడ వినండి

(http://archive.org/details/VeyyiVranalaAyudham)


Death is a charter on stone

Connate with life, the place is predetermined.

One has to submit to it without demur.

Death is a stigma that sticks through life;

And shadows life without ever being erased.

Life hangs on to death

Like a drop of dew to a leaf’s apex.

Yet, life is nobler than death

And one has to fight unto the last moment.


O dear body! Don’t wail!

A grim silent war wages within, you are unaware

A tumour silently crept into the cells.

Death might be on the wings like a kite

Or, ready to pounce like a cheetah in the thicket,

But, you kindle life … back to fire.


O dear body! Don’t grieve.

Don’t dab in tears the swelling emotions within.

Don’t make me crazy crying for corporal beauty

Instead of comeliness of life.


***

Yet, my darling!  This is a vain affliction.

Will there be a surrogate body sleeping where I was?

Will another frame adorn my attire and ornaments?

And in your warm hands that seize me, will there be…?

Oh! What silly noxious thorny thoughts fill my mind

Smarting me sharper than reality,

Whichever way I turn in my bed!

No. No. I am not dead.

It’s more a fear for treatment, than fear for life.


Darling! What can I say?

The bosom that hugged you dearly each day

Might be missing, but not the heart behind;

When children feel for the cuddle

Your fatherly bosom stands in for mine;

In the trail of chemos and radiations

Whatever happened within,

Hair dropped down like powder, without.

Yet my loveliness…

The loveliness of my heart did not cease.

I did not decease as yet.

Forget about the beauty…

Every time the body resisted

It threw up guts with vengeance.


Darling! Pray! Save me!

Show me an easier and better alternative.

The thoughts that swing like a pendulum to and fro

Are scarier than nightmares.

Is there no exception for virtuoso artists?

Won’t the days when I ruled the roost return?

Behind that visual beauty

There lies that dream-eating Cancer worm

There was something wrong somewhere

The baby is yet to learn babbling

And the eldest son is hardly ten


O, God! Please don’t curse my children.

Don’t alienate for the greenhorns

Their mother from them

Don’t leave this body with a pain,

More painful than death itself.


***

No.  No.

There is no room for fear.

In this life of Snakes and Ladders,

how can we afford not repairing the impaired steps?

How long can we go on wailing vainly

As if we were afflicted with a weeping sickness?

Even if our moments are numbered,

How can we live dying each moment,

Until we actually do?


My beloved body!

Come on! Blossom!

Fill those cells with spirit and eyes with confidence

Be the weapon

That doesn’t give a hoot to thousand tumours.

Beat the drum of life

Sending shivers across the decrees of death.

.

(To the sufferers from Breast Cancer)

.

Dr. K. Geeta

Born in 1970 at Jaggampet of East Godavari District of Andhra Pradesh.  Dr. Geeta Madhavi is a PG in Telugu and English Literature and did her Ph.D. in Telugu Literature in 2004  from the Andhra University.  She is very popular and widely published poet. She has 3 volumes of poetry in Telugu to her credit and bagged several notable awards for her work. She also runs her blogs : http://kalageeta.wordpress.com; http://kgeeta.blogspot.in/ and http://21stcenturytelugu.blogspot.in/. She contributes regularly to many web magazines. She lives in Mountainview, CA, USA.


వేయి వ్రణాల ఆయుధం


మరణం ఒక శిలాశాసనం

పుట్టగానే ఎక్కడో ఒకచోట పాతిపెట్టబడి ఉంటుంది

శిరసా వహించాల్సిందే

అనుక్షణం అడుగు వెనకే పడే మచ్చ మరణం

జీవితం వెనకాల చెరగకుండా వెంటాడుతుంది

ఆకు చివర వేలాడే మంచు బొట్టులా మరణం అంచున వేలాడే జీవితం

అయినా జీవితం మరణం కంటే గొప్పది

ఆఖరి క్షణం వరకు పోరాడాల్సిందే

శరీరమా! ఏడవకు

లోపల నీకే తెలీని ఒక నిశ్శబ్ద ఘోర యుద్ధం

చడీ చప్పుడూ లేకుండా కణాల్ని పాకిన వ్రణం

మరణం ఎప్పటి నుంచో గద్దలా కాపు కాసి ఉన్నా

పొద పక్కనే చిరుత పులిలా పొంచి ఉన్నా

జీవితం అగ్నిలా రాజుకోనీ

శరీరమా దు:ఖించకు

మనసులో ఎగిసి పడే మమకారాల పట్టికకు కన్నీళ్ల మరకలే మిగల్చకు

పిచ్చి పట్టినట్లు జీవితం కోసం మానేసి సౌందర్యం కోసం రోదించేలా చెయ్యకు

***

అయినా ప్రియతమా ఏదో పిచ్చి దు:ఖం!

రేపు నే నిద్రించిన స్థానే కొత్త శరీరం నిద్రిస్తుందా!

నా నగలు, చీరలు మరో శరీరం అలంకరించుకుంటుందా!

నన్ను చుట్టు ముట్టే నీ వెచ్చని చేతుల్లో నా బదులు

ఎన్నెన్ని చేదు విషపు ముళ్ల ఆలోచనలో నా శరీరం నిండా

వాస్తవం కంటే ఎక్కువగా ఎటు ఒత్తిగిలినా గుచ్చుకుంటూ

లేదులేదు నేను మరణించలేదు

ప్రాణం కంటే వణికించే వైద్యం భయం 

ప్రియతమా! ఏమని చెప్పను నీకు?

నిన్ను ప్రతిరోజూ హత్తుకున్న నా గుండెలు మాయమైనా

నా హృదయం ఇంకా మిగిలే ఉంది

పిల్లలకి మమకారపు పాలు పంచుకున్న చోట

అమ్మ గుండెకి  బదులు నాన్న గుండె ప్రతిష్టించబడింది

కీమో లు, రేడియేషన్ల పర్వంలో

లోపలేం జరిగినా  పైపైని జుట్టు పొట్టై రాలిపోయింది

అయినా నా సౌందర్యం

హృదయం లో నా సౌందర్యం ఎక్కడికీ పోలేదు

నేనింకా మరణించలేదు

సౌందర్యం మాట దేవుడెరుగు శరీరం తిప్పికొట్టిన ప్రతీసారీ

పేగుల్ని పైకి తోసే కక్కులొకటి

ప్రియతమా! నన్ను రక్షించు

ఇంకేదైనా సులభ మార్గం చూపించు

ఎన్నో సార్లు వెనక్కీ ముందుకీ లోలకంలా ఊగుతున్న ఆలోచనలు

దుస్సప్నం కంటే బాధించే వాస్తవాలు

సకల కళా నేర్పరులకూ మినహాయింపు లేదా!

నేనే కొరడానై ఝళిపించిన రోజులకు ఇక తావు లేదా!

పైకి కనిపించే కళల వెనుక

కలల్ని దోచేసిన కేన్సరు క్రిమి

ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది

పసిదానికి నోరైనా రాలేదే

పెద్దబ్బాయికి ఇంకా పదేళ్లేనే

భగవంతుడా! నా పిల్లల్ని శిక్షించకు

ముక్కు పచ్చలారని పసి పిల్లలకి అమ్మని దూరం చేయకు

మరణం కంటే బాధించే జీవితాన్ని శరీరానికి మిగల్చకు

***

లేదులేదు

ఏమీ భయం లేదు

జీవన పరమ పథ సోపానం లో విరిగిన మెట్లని సరిచేసుకోపోతే ఎలా?

వ్యధా రోగం పట్టినట్టు నిత్యమూ వృధా రోదిస్తే ఎలా?

జీవించేదెన్ని క్షణాలైనా అనుక్షణమూ మరణిస్తే ఎలా?

శరీరమా!

పుష్పించు

కణాలలో, కళ్లల్లో ధైర్యవిశ్వాసాల్ని నింపు

వేయి వ్రణాలైనా లెక్క చేయని ఆయుధమై మొలకెత్తు

మరణ శాసనాలు దద్దరిల్లేలా జీవన నగారా మోగించు

.

(బ్రెస్ట్ కేన్సరు బాధితులకి)

 కె.గీత

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో 1970 లో జన్మించిన కె. గీతా మాధవి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులోనూ ఇంగ్లీషులోనూ MA, ఫ్రెంచ్ లో డిప్లొమా చెయ్యడమే గాక, తెలుగులో  2004 లో Ph.D చేశారు. ఇంతవరకు రెండు కవితా సంకలనాలు … ద్రవభాష, శీతసుమాలు… తీసుకువచ్చారు. ఆమె కవితా ఖండికలకి రంజనీ కుందుర్తి అవార్డు, దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డు పొందారు. ద్రవభాష సంకలనానికి అజంతా అవార్డు పొందారు.

“Weapon for Thousand Tumors … K. Geetha” కి 5 స్పందనలు

  1. వేదన ఎంత వ్యధాభరితమో, ఆశ ఎంత అవసరమో ….గొప్ప కవిత…గొప్ప అనువాదం.

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      కొన్ని కవితలు ఎన్నిసార్లు చదివినా కంటతడిపెట్టిస్తాయి. అందులో ఇదొకటి. ఈ కవిత నా మనసులో ఎక్కడో దాగున్న బాధని పైకి తవ్వి తీసింది.
      నాకూ మా చిన్నక్కకీ ఎంతో స్నేహం. నాకూ తనకీ బహుశా 10 ఏళ్ళ అంతరం ఉండొచ్చు. కానీ నా జీవితంలో కొన్ని మరిచిపోని సంఘటనలకీ, సాహిత్యం లో ఓ న మాలు అనతగ్గ శ్రధ్ధకలగడానికీ తను ఒకరకంగా కారణం. 1970లో తను బ్రెస్ట్ కేన్సరుతో చనిపోయింది. పిల్లలకి అప్పటివయసి 5,3,1 ఉంటాయేమో. ఈ కవిత చదివితే, గీతగారు అక్షరాలా మా అక్కని చూసి రాసేరా అన్నంతగా ప్రతిమాటా పొల్లుపోకుండా ఉన్నాయి. అందుకే ఈ కవిత చదవగానే, మా అక్క మరొకసారి గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. గీతగారికి ఈ అనువాదం ద్వారా నా మనః పూర్వక కృతజ్ఞతలు తెలియబరుచుకుంటున్నాను కూడా.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. రేవతీదేవి “శిలాలోలిత” (http://www.eemaata.com/em/library/silaalolita/1022.html) లోని ‘ఈ రాత్రి’ కవిత (http://www.eemaata.com/em/library/silaalolita/1016.html) గుర్తుకువచ్చింది. కవయిత్రి మరణానికి దగ్గరగా ఉండటాన, స్వీయానుభవమే ననిపించినా,ఈ కవిత లో మాదిరిగానే చావు బ్రతుకుల నడుమ, ఆశానిరాశల లోలకానికి కట్టిన హృదితో రాసిన మాటలవి.

    {మా మామ్మ బ్రెస్ట్ కాన్సర్ తోనే పోయారు, నా బాల్యం, యవ్వనం అంతా మా మామ్మ ఒడిలోనే, గుండెల మీదనే. మరొక మాట మరిచి “మహా మృత్యుంజయ మంత్రం” జపిస్తూ తన ఇద్దరి పిల్లల కోసం తను బతకాలని తపిస్తూ నా కజిన్ మరణించిందీ కాన్సర్ తోనే. ఇంకా కావాల్సిన ఆత్మీయులొకరు కాన్సర్ ఈ మధ్యనే గతించారు. మరొకరు ఇపుడు పోరాడుతున్నారు…ఈ “రాచ పుండు” ( మూడు తరాల మునుపు ఇదే పేరు దీనికి) కి రగులుతున్న జీవితాలు ఎన్నో}

    మెచ్చుకోండి

  3. శరీరమా దు:ఖించకు-

    ప్రాణం కంటే వణికించే వైద్యం భయం

    భగవంతుడా! నా పిల్లల్ని శిక్షించకు-

    వ్రణాలైనా లెక్క చేయని ఆయుధమై మొలకెత్తు-
    మరణ శాసనాలు దద్దరిల్లేలా జీవన నగారా మోగించు!!

    భాధని మృదువుగా గుర్తుచేస్తూనే,ధైర్యాన్ని నింపే ప్రయత్నం.. తన గొంతులోంచి వింటుంటే మనముందే,మనతోనే మాట్లాడుతున్నట్టు ఉంది. మీరు,రేవతి గారు మీ అనుభవాల్లోంచి మాట్లాడినా, నాకు అనిపించింది..
    ఇవి కళ్ళు చెమర్చే , కదిలించే భావాలని..

    మీరు సంగమంలో మాట్లాడ్తున్నప్పుడు , దేని గురించి రాయడం కవులు మర్చిపోతున్నరో అని చదివి ఏవి నన్ను కదిలిస్తున్నాయ అని అలోచించి సరిగా తేల్చుకోలేకపోయాను. ఇది చదువుతుంటే కొంచెం తెలిసింది.

    ఓ గొప్ప కవితని పరిచయం చేసినందుకు,ధన్యవాదాలు మూర్తిగారు. మీ అనువాదం ఎప్పటిలాగే బాగుంది.

    మెచ్చుకోండి

  4. నందకిషోర్ గారూ,
    ప్రభుత్వాలు ప్రజలజీవితాల్ని రాను రాను ఎంతదుర్భరం చేస్తున్నాయంటే, వాళ్ళకి తమకి ప్రతిఘటనతెలిపేందుకు కూడా తీరిక ఉండటం లేదు. ఎందుకంటే, ఆ మాత్రం సమయం లో తమ మనుగడకి (కేవలం మనుగడకి) కావలసిన డబ్బులు సంపాదించుకో వచ్చునని, అది దాటిపోతే ఆ పూట గడిచేదెలా అని భయం పీకుతుంటుంది. బాగా చదువుకున్న వాళ్ళూ అధికారులూ కుమ్మక్కై ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన అధికారాల్నీ, అవకాశాల్నీ ప్రజలకు కాకుండా, తమ స్వంత ప్రయోజనాలకోసం, తమ సంతతుల అధికారం శాశ్వతంచేసుకోవడనికి కావలసిన ధన సంపాదనకోసం వెచ్చిస్తున్నారు. సహజంగా ఆవేశంగా ఆలోచనాత్మకంగా ఉండే యువతరం దృష్టి ప్రధాన సమస్యలమీద కాకుండా, పక్కదోవపట్టడానికి కావలసిన హంగులన్నీ సమకూరుస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ సందర్భం లో, మీ లాంటి చదువుకున్న యువకులూ, భావుకత ఉన్న యు వకులూ సమకాలీన సమస్యలు పట్టించుకోకపోతే, రేపు దేశం గతి ఏమవుతుంది? జీవించడానికీ, బ్రతకడానికీ, నచ్చిన వృత్తిచేసుకుందికీ, నమ్మిన విశ్వాసాన్ని కొనసాగించుకుందికీ ఈ దేశ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ప్రభుత్వాలు నేలరాలుస్తుంటే, భావితరాలకు మన జవాబుదారీని మరిచిపోయి, దేశవనరుల్ని విచ్చలవిడిగాకొల్లగొడుతూ ఉంటే, బాధ్యత గల పౌరులుగా మన సామాజిక బాధ్యత ఏమిటి? ఇలాంటి సమస్యలు కొత్తగా వచ్చినవి కావు. వివిధ దేశాల్లో, కాలాల్లో ఇటువంటి సమస్యలే తలెత్తినపుడు కవులూ కళాకారులూ స్పందించారు. సమస్యలకి సమిష్టిగా సమాధానాలు కనుక్కున్నారు. ఎక్కడా కళారాధనా, మానవత్వపువిలువలూ మరిచిపోలేదు. మనం కూడా ఆ పని చెయ్యాలన్నదే నా ఉద్దేశ్యం.
    అభివాదములతో,

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: