Sri Bolloju (Ahmad Ali) Baba is working as a Lecturer of Zoology in Razole, EG Dt. Andhra Pradesh, and is running his blog http://sahitheeyanam.blogspot.in since April 2008.
.
జీవన సౌందర్యం
వేసవి చివరి తెమ్మెరపై తేలుతూ వచ్చిన తొలకరిమబ్బు అవని పెదవులపై ఆకుపచ్చని చుంబనాన్ని వొదిలిపోయింది.
వర్షాకాలపు ఆఖరు చినుకుపై స్వారీ చేస్తూ వచ్చిన శీతవాయువు దేహ దేహానికీ వెచ్చని స్పర్శలను ప్రసాదించి సాగిపోయింది.
శీతవేళ చివరి ఘడియలో మొలకెత్తిన వేసవి గుప్పెడు మల్లెల్ని పెద్దలకు పుట్టెడు జ్ఞాపకాల్ని పిల్లలకూ ఇచ్చి కనుమరుగైంది.
పుడమి సంగీతాన్ని నూత్న సృష్టి, మృత్యువు లు నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.
జీవితపు దారులను ప్రేమ తన పరిమళాలతో ప్రకాశింపచేస్తూనే ఉంటుంది.
నందకిషోర్ గారూ,
ఆధ్యాత్మికులు చెప్పే ఆత్మార్పణలో, అవతలి వస్తువుతో మన మమేకమవడం ఉంది. ఆస్థితిలోనే మనల్ని మనం పరోక్షంగా చూసుకోగలం. ఇందులో బాబా గారు సృష్టి చక్రాన్ని (ఋతుచక్రాన్ని) చక్కగా ఆవిష్కరించేరు. జీవితం అశాశ్వతం అనేది మనలని భయపెట్టడానికో, చచ్చేలోపు ఉన్నదంతా అధికారాన్ని వియోగించుకుందికో కాదు, అది మనల్ని వినమ్రులని చెయ్యడానికి. మనపాత్రని బాధ్యతాయుతంగా నెరవేర్చగలగడానికి. అలాగే, నిరాశలో ఉన్నప్పుడు, సుఖం ఎలాగ అశాశ్వతమో, దుఃఖంకూడా అశాశ్వతమని చెప్పి మనలో ఆశాలతలని చిగురింపజెయ్యడానికి. ఈ సత్యం మనకు అవగతమైతే, మనం ఏ ధర్మాన్ని పాటించినా, మానవత్వాన్ని మరిచిపోనివారం అవుతాం. ఇంత మంచికవితకి బాబాగారికి మనిద్దరి తరఫునా ధన్యవాదాలు తెలుపుతున్నా.
అభివాదములతో,
స్పందించండి