[For the first look and for a finicky reader, it may sound funny and ridiculous(may even sound foolish) when you say you are searching for something you never knew. But if we honestly assess our lives and its pursuits, we would have to, perhaps, admit that our life is a marathon search for something we never knew clearly. Even if we had achieved something, instead of living contented with what we have achieved, like a child who cries for the toy that it did not have ignoring all that it had, we suffer with a sense of dissatisfaction and a craving for something that we did not achieve. Even at the threshold of death, our search for that unknown shall not cease. Its my opinion that this poem puts that idea so succinctly.]
.
Yesterday… today…
Day in and day out…and,
For eons…
I have been on the search ….
What is it that I am seeking after?
Who for I am searching for?
What are the places I am looking about?
But,
Why should I search for, at all?
I don’t know!
It is an infinitum of questions …
With no definite answers.
*
Did I ever allow something
To slip through my hands any where?
I don’t think so.
But yet,
I search for that elusive thing
With the illusion that I own it.
Time is fleeting… days are thawing.
Hopes are vanishing… Faith is retreating
Life is ceasing… and the Spirit, depleting
Yet, that crazy search continues…
Cutting through the dense deep darknesses…
To the limits of horizon and to the depths of oceans
For that evanescent enigmatic something
Till breath snaps
Till spirit saps
My being becomes ethereal…
Maybe,
This search shall endure… ever… for ever! .
Dr. Madhuravani
Doctorate in Plant Biology, Dr. Madhuravani is a Research Scientist living in Germany for the last 6 years. She is a blogger since 2008 and runs 3 blogs మధుర చిత్రాలు, (Some of the most breath-taking pictures you can see here) సుజనమధురం and మధురవాణి. She is very familiar to all bloggers and netizens.
.
[మనకు తెలియని వస్తువుగురించి మనం వెతుకుతున్నామని చెబితే, స్థూల దృష్టికి చిత్రంగానూ, వంకలు వెతికే వారికి, హాస్యాస్పదంగానూ కనిపించవచ్చు. కాని, మీరు అవేవీ పట్టించుకోకుండా, “మీ జీవిత గమ్యం ఏమిటి? మీరేం సాధిద్దామనుకుంటున్నారు?” అని నవ్వుతున్నవారిని ఒక్కసారి అడిగి చూడండి. ఆ నవ్వులు, హేళనలూ ఆగిపోతాయి. ఈ దైనందినజీవితపు పరుగుపందెంలో అందరితోపాటు మనమూ పరిగెత్తితున్నాం. ఎందుకుపరిగెత్తుతున్నామో తెలీదు. దేన్ని సాధించడానికి పరిగెత్తుతున్నామో తెలీదు. ఒకవేళ ఏదైనా సాధించినా, అది ఇచ్చే సంతృప్తి కంటే, సాధించలేని విషయాలిచ్చే అసంతృప్తి ఎక్కువ. జీవిత చరమాంకంలో కూడా ఈ అసంతృప్తి మనల్ని వదలదు.’శిలాలోలిత’లో, రేవతీదేవిగారు రాసిన “దిగులెందుకో చెప్పలేని దిగులు”లాంటి భావన ఇది. ఈ భావాన్ని, మధురవాణిగారు ఇందులో చక్కగా ప్రకటించగలిగేరని నా అభిప్రాయం.]
ఇంకా ఇంకా చీకటిని చీల్చుకుంటూ ఆకాశపు అంచుల దాకా.. సముద్రపు లోతుల దాకా..
ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!
.
మధురవాణి
Plant Biologyలో డాక్టరేటు చేసిన మధురవాణి గారు గత 6 సంవత్సరాలుగా జర్మనీలో శాస్త్ర పరిశోధకురాలిగా ఉంటున్నారు. ఆమె 2008 నుండీ బ్లాగులోకంలో ఉంటూ బ్లాగర్లందరకూ చిరపరిచితురాలే. ఆమె మధుర చిత్రాలు (ఇందులో మిమ్మల్ని ఊపిరితీసుకోనివ్వకుండ కట్టిపడేయగల ఎన్నో ఫోటోలున్నాయి), సుజనమధురం మరియు మధురవాణి అని 3 బ్లాగులు నడుపుతున్నారు.
శర్మగారూ,
రెండు సారవంతమైన సంస్కృతుల సమ్మేళనం లో 6 సం వత్సరాలబట్టి మధురవాణిగారు శాస్త్రపరిశోధన జరుపుతున్నారు. నానృషిః కురుతేకావ్యం … మనకి ఋషి అనగానే ఏదో అడవుల్లో ముక్కుమూసుకుని తపస్సుచేసుకుంటారనే ఇమేజ్ తారాడుతుంది. కాని ఋషిత్వం సత్యాన్వేషణ… అదే Research. ఈ అన్వేషణ చాలా చిత్రమైనది. మనకళ్ళకెదురుగుంటూ, మనకాళ్ళకడ్దంపడుతూనే, మనకు మానసిక పరిణత వచ్చేదాకా చేతికి దొరకదు. ఒక్కొక్కసత్యం జీవితాంతం దొరకకదోబూచులాడుతుంది. ఈ పరిణతసంతరించుకునే దశలో మనసులోకలిగే ఆవేదన ఇంతా అంతా కాదు. మనం సరియైన దిశలో వెళుతున్నామన్న ధైర్యం కొన్ని సందర్భాల్లో కలిగినా, సత్యం చేతికిచిక్కనప్పుడు మనమీద మనకే అధైర్యం, మనం నడుస్తున్న మార్గం సరియైనదేనా అన్న సందేహం ఎక్కువగా బాధిస్తుంటాయి. ఈ మానసికవేదనని ఆవిడ స్వానుభవం లోంచి చాలా చక్కగా ఆవిష్కరించేరని నాకు అనిపిస్తుంది.
అభివాదములతో
అన్వేషణ, బాగుంది అన్నది చిన్న మాట….వీరు మన బ్లాగరు కావడం కడు ముదావహం.మాటలు చాలవు….. మౌనం మాట్లాడలేదు….ఎలా?
మెచ్చుకోండిమెచ్చుకోండి
శర్మగారూ,
రెండు సారవంతమైన సంస్కృతుల సమ్మేళనం లో 6 సం వత్సరాలబట్టి మధురవాణిగారు శాస్త్రపరిశోధన జరుపుతున్నారు. నానృషిః కురుతేకావ్యం … మనకి ఋషి అనగానే ఏదో అడవుల్లో ముక్కుమూసుకుని తపస్సుచేసుకుంటారనే ఇమేజ్ తారాడుతుంది. కాని ఋషిత్వం సత్యాన్వేషణ… అదే Research. ఈ అన్వేషణ చాలా చిత్రమైనది. మనకళ్ళకెదురుగుంటూ, మనకాళ్ళకడ్దంపడుతూనే, మనకు మానసిక పరిణత వచ్చేదాకా చేతికి దొరకదు. ఒక్కొక్కసత్యం జీవితాంతం దొరకకదోబూచులాడుతుంది. ఈ పరిణతసంతరించుకునే దశలో మనసులోకలిగే ఆవేదన ఇంతా అంతా కాదు. మనం సరియైన దిశలో వెళుతున్నామన్న ధైర్యం కొన్ని సందర్భాల్లో కలిగినా, సత్యం చేతికిచిక్కనప్పుడు మనమీద మనకే అధైర్యం, మనం నడుస్తున్న మార్గం సరియైనదేనా అన్న సందేహం ఎక్కువగా బాధిస్తుంటాయి. ఈ మానసికవేదనని ఆవిడ స్వానుభవం లోంచి చాలా చక్కగా ఆవిష్కరించేరని నాకు అనిపిస్తుంది.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
చాలా బాగా translate చేశారు originality ఎక్కడా తగ్గకుండా…అభినందనలు!
మెచ్చుకోండిమెచ్చుకోండి
చిన్ని ఆశగారూ,
మీ అభిమానపూర్వకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ బ్లాగు చూస్తున్నాను. స్పందనలని ఈ మధ్య మీరు highlight చేస్తున్న తీరు బాగుంది.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి