సముద్రపొడ్డున … సారా టీజ్డేల్

Image Courtesy: http://farm7.staticflickr.com

.

సముద్రపొడ్డున కూచోడమన్నా,

ఈ మహానగరాలన్నా

సుతిమెత్తని పూవుల సౌకుమార్యరహస్యమన్నా,

సంగీతమన్నా,

కవితరాస్తూ గడపడమన్నా నాకు చాలా ఇష్టం.

ఆ క్షణాలు స్వర్గంలో తేలియాడినట్టుంటుంది.

.

మంచుమునిగిన కొండమీద పొడిచే తొలిచుక్కలన్నా

జ్ఞానమూ, దయా ఆమ్రేడితమైన పెద్దల పలుకులన్నా,

చిరకాలము నివురుగప్పినట్టుండి, చివరకి

కలుసుకున్నచూపుల్లో తొణికిసలాడే ప్రేమన్నా ఇష్టమే.

.

నేను అమితంగా ప్రేమించాను,

గాఢంగా ప్రేమించబడ్డాను కూడా.

కాని, ఇపుడు జీవితం పై ఆశ సన్నగిలింది.

దయచేసి నన్నీ నిశ్శబ్దానికీ, చీకటికీ విడిచిపెట్టండి

అలసిపోయిన నేను, సంతోషంగా నిష్క్రమించడానికి సిధ్ధం.

.

Image Courtesy: http://img.freebase.com

సారా టీజ్డేల్

1884–1933

.

I have Loved Hours at Sea

.

I have loved hours at sea, gray cities,

The fragile secret of a flower,

Music, the making of a poem,

That gave me heaven for an hour;

.

First stars above a snowy hill,

Voices of people kindly and wise,

And the great look of love, long hidden,

Found at last in meeting eyes.

.

I have loved much, and been loved deeply—

Oh when my spirit’s fire burns low,

Leave me the darkness and stillness,

I shall be tired and glad to go.

.

Sara Teasdale

(1884–1933)

American Poet.

“సముద్రపొడ్డున … సారా టీజ్డేల్” కి 2 స్పందనలు

  1. ఎంత చక్కని భావం! మీ అనువాదాల వలన నాకు తెలియకుండానే ఈవిడని అభిమానించడం మొదలుపెట్టాను.

    మెచ్చుకోండి

    1. అమ్మా రసజ్ఞా,
      నేను కూడా ఆమెగురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆవిడ కవితలు ఒకటొకటిగా చదువుతుంటే, ఎంత రసవత్తరంగా ఉన్నాయంటే, ఆవిడని విమర్శకులు ప్రథమశ్రేణి కవిగా గుర్తించలేదని చదివాక ఆశ్చర్యం వేసింది. ఒకోసారి, విమర్శకులుకూడ అంత ప్రెజ్యుడిస్ తో విమర్శిస్తారా అని ఆశ్చర్యం కలగక మానదు. నా మట్టుకు సారా టీజ్డేల్ అపురూపమైన భావసౌకుమార్యం కలిగిన రచయిత్రి. మొన్న మొన్నటిదాకా జీవించిన తెలుగు కవయిత్రి ఆదూరి సత్యవతీ దేవిలా ఉంటాయి ఆమె మాటలు. అయితే ఇద్దరికీ ముఖ్యమైన తేడా సత్యవతీ దేవి ప్రకృతిగురించి అంత లలితంగా వ్రాస్తే, ఈమె ప్రేమ, విరహం గురించి మంచి పదచిత్రాలతో, భావుకతతో వ్రాసింది. ఆమె కవితలు చాలా జాగ్రత్తగానూ చదవాలి, అంత జగ్రత్తగానూ అనువాదం చెయ్యాలి. నేను ఆమె ‘Fan’ ని.
      ఆశీస్సులతో,

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.