‘The’ Tree — Sikhamani

Image Courtesy: http://www.ubushina.com/media/imono/20070919-tree_c.jpg

.

If you have any sense of the word,

Tree is an open book.

If you dare to look at your own reflection

Tree is a full-length dressing mirror.

If you have sensibilities within

Tree is a sea on high tide.

If you observe mere trunk, boughs and twigs

Inflorescence and frondescence

You are just a Suyodhana*.

But if you can mark that little bird

Amidst the valley of verdure foliage

You are an indomitable Kiriti**.

Never look down upon fallen leaves.

They are passionate martyrs

Who sacrificed their lives

For the sake of coming generations.

They are the unforgettable ‘yesterday’s

Which bequeath a legacy to the ‘today’s.

Did you ever watch an old leaf floating down?

Listened to the clack of a dry twig ?

The quotidian visiting bird

Did not find

The flowers of yesterday

Or the fruits of the day before.

The light in the day

And moonshine at night

Acquaint themselves with the tree everyday.

The Tree you is not “The” Tree, for truth.

Like the miner in a gloomy pit,

Whatever explores you deep within unawares

Is the occult code of life

That enlivens you and me.

The verdure to the leaves

And ruddiness to the blood

Have come only from there!

.

* Suyodhana is the other name of Duryodhana, the anti Hero of Mahabharata, who represents here one that looks at the peripheral and cannot focus on the important things.

** Kiriti is Arjuna, the Matsya-Yamtra (the moving fish) famous archer from the Mahabharata, who is reputed to have an uncanny ability to focus his attention on his target without being disturbed by the canopy or movement around it.

అసలైన చెట్టు

.

నీకు అక్షర జ్ఞానం వుంటే

చెట్టొక తెరిచిన పుస్తకం

నీ బొమ్మ

నీవు నిర్భయంగా

చూసుకో గలిగితే

చెట్టొక నిలువుటద్దం!

నీలో స్పందన వుంటే

చెట్టొక పోటెత్తిన సముద్రం

ఉత్త కాండమూ- కొమ్మలూ రెమ్మలూ

పూలూ పండ్లూ యివే కనబడితే

నీవు తప్పక సుయోధనుడవే.

తరుశాఖ లోయలలో

చిరుపక్షిని  చూచినప్పుడు

నీవు ఎదురులేని కిరీటివి.

రాలిపోయిన పండుటాకుల్ని ఎన్నడూ చిన్నచూపు చూడకు

అవి కొత్త తరం కోసం

తమకు తాము త్యాగం చేసుకున్న

దయార్ద్ర మూర్తులు.

“నేడు”కు వారసత్వాన్ని మిగిల్చిన

మరిచిపోకూడని “నిన్న”లు.

పండుటాకు రాలుతుండగా

ఎన్నడైనా చూసావా

ఎండుపుల్ల విరిగిన సడి

ఎన్నడైనా విన్నావా

రోజూవచ్చి వాలుతున్న పక్షికి

మొన్నటి పండు

నిన్నటి పూవు

ఎంతవెతికినా కనిపించలేదు.

పగటిపూట వెలుగూ

రాత్రిపూట వెన్నెలా

తమని తాము చెట్టుకు పరిచయం చేసుకుంటున్నాయి.

.

నువ్వు చూసే చెట్టు

అసలు చెట్టు కానేకాదు

చీకటి గనిలోని కార్మికునిలా

అంతరంగపు లోతుల్లో

అజ్ఞాతంగా అన్వేషిస్తున్నదేదైతే వుందో

అదే నిన్నూ నన్నూ బ్రతిస్తున్న జీవ రహస్యం

ఆకుకు పచ్చరంగూ

రక్తానికి  ఎరుపు రంగూ

అక్కడినుండి వొచ్చిందే.

.

శిఖామణి

(“మువ్వల చేతికర్ర” కవితా సంకలనం నుండి)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: