Hind Reassuring Hand- Arun Bavera
Image Courtesy: http://www.trueswords.com
.
I submitted an appeal, to surrender
Before you, along with my history.
I acknowledged in writing
To prone before you, with my culture.
I snipped all my rebellious legacy
And filled your cupped hands to the brim.
I stacked my weaponry
At your doorstep, and
Pledged my battle fields
To your threats and intimidation.
Alienating from my flock
I reduced to a wretch seeking after your favors…
I held my hand to eat humble the leftovers of
your rehabilitation programs.
I
And my compulsions,
Fear of Death not exempted,
Prostrated before your appeals to “Join the Main stream”.
But
To what a Machiavellian
Scheming you resorted to!
How strategically did
You disclose your true nature!!!
Now, you start wrenching me anew for
The intelligence about the revolution.
Making a weapon of me
You chant and employ me against the very fight I left.
I never expected that I would
So unwittingly subserve your imperatives, or
Further your evil and heinous designs.
I never imagined there lurks behind,
Behind the back of your reassuring hand
A cruel couth cold-blooded hand.
.
Be it so.
But never expect to conquer my constraints always.
Never ever presuppose that
Your strategies win each time… and forever.
I come out strong … where I lost my bearing.
I can uphold the politics … where I cast them off.
And ultimately,
I can reveal myself
In the war against you.
.
Arun Bavera
.
అభయహస్తానికి రెండోవైపు
.
నేను
చరిత్రతో సహా
నీ ముందు లొంగుబాటూకు
దరఖాస్తుపెట్టుకున్నాను.
.
నేను నా సంస్కృతితో సహా
నీ ముందు మోకరిల్లడానికి
లిఖితపూర్వకం గా
వొప్పుకున్నాను
నా పోరాట వారసత్వం
యావత్తూ చిదిమి
నీదోసిట్లో పోసాను
నా ఆయుధాల్ని
నీ కాళ్ళముందు గుమ్మరించాను
నా యుధ్ధభూమిని
నీ బెదిరింపులకి
తాకట్టుపెట్టాను
నేను
నా సమూహం నుండి
వేరుపడి – నీ చుట్టూ
దేబిరింపులకు దిగాను
నీ పునరావాసా పథకాల
మోచేతినీళ్ళకు దోసిలి పట్టాను
నేనూ, నా బలహీనతలూ,
నా ప్రాణభయం తో సహా
నీ “జనజీవనస్రవంతి”
ముందు సాగిలపడ్డాం.
కానీ నువ్వెంతటి
నయవంచనకి తగబడ్డావు?!
నీ స్వభావాన్ని
ఎంత వ్యూహాత్మకంగా
బయటపెట్టుకున్నావు!?
ఇప్పుడుకొత్తగా
ఉద్యమ రహస్యాలకోసం
నా గొంతునే పిండుతున్నావు,
నేను లేచొచ్చిన
పోరాటం మీదకి
నన్నే ఒక ఆయుధంచేసి
మంత్రించి విడుస్తున్నావు
నేను నీ అవసరాల్ని
యింత అమాయకంగా
తీరుస్తాననుకోలేదు,
నీ దుర్మార్గాలకి
యింత అజ్ఞానంగా
సహకరిస్తాననుకోలేదు,
నీ అభయహస్తానికి
రెండోవైపు
ఒక క్రూర హస్తం పొంచి
వుందని ఊహించలేదు.
సరే,
నా బలహీనతల్ని
ఎల్లకాలం జయిస్తావనుకోకు.
ఎప్పటికీ,
నీ ఎత్తుగడలే గెలుస్తాయనుకోకు
నేనెక్కడబలహీనపడ్డానో
అక్కడే తిరిగి బలం పుంజుకోగలను
నేను రాజకీయాల్ని
వదిలినచోటే మళ్ళీ
భుజాలకెత్తుకోగలను
అంతిమంగా
నీ మీది పోరాటం లోనే
నన్ను నేను
ఆవిష్కరించుకోగలను.
.
అరుణ్ బవేరా
(Apr 8, 2002)
ఒక కన్నీటి చుక్కకోసం కవితా సంకలనం
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి