About Knowing… Sikhamani

Image Courtesy: http://4.bp.blogspot.com

My father used to say those days:

it’s not enough if you write poetry,

you must have some wisdom.

I still feel

Wisdom might be useful for everything else

But what you need to write poetry

Is some innocence of the mind

And a compassion towards fellow beings.

.

Very recently

A post-modernist commented:

OK,  you write well,

But you are not an intellectual poet.

So what ? I looked up, my mannerism

Somewhat suggestive of

Challenging him rounding up my moustache.

.

Yesterday my wife had also said:

Of what use are these scribblings?

You don’t know anything. Better keep quiet.

But how to convince her

That  even I know that I know nothing?

Maybe she would come to know

After noticing my happiness within.

.

And ultimately, today

Even my children have commented:

Daddy! You know nothing.

The only difference being,

they said so in English…

.

I yearn to know  what this thing is

When so many people say I know it not.

.

In a way, perhaps,

It is an endeavor to know the know not

Be it  Life!

Or Poetry!!

.

Sikhamani.

.

తెలియడం గురించి
.
అప్పట్లో మా నాయన అనేవాడు

కవిత్వం రాయగానే సరికాదు

కాస్త జ్ఞానం ఉండాలిరా అని

జ్ఞానం దేనికైనా అవసరపడుతుందేమోగానీ

కవిత్వం రాయడానికి కావాల్సింది

కాస్తంత అమాయకత్వం

లోకం మీద ఇంత దయా

అనుకుంటాను ఇప్పటికీ
.
ఆ మధ్య

ఒక ఉత్తరాధునికుడు

నువ్వు బాగానే రాస్తావుగానోయ్

ఇంటలెక్చ్యువల్ పొయట్ వి మాత్రం కాదన్నాడు

అయితే ఏంటటా అన్నాను

మీసం మెలేసే మేనరిజం తో.
.
నిన్న మా ఆవిడకూడ అంది.

ఎందుకు పనికొస్తాయి ఈ రాతలు

మీకేమీ తెలియదు ఊరుకొండని

నాకేమీ తెలియదన్న సంగతి

నాకు కూడా తెలుసునని

ఆమెకు తెలియజెప్పడం ఎలా?

.

బహుశా ఎప్పటికైనా తెలుసుకుంటుందేమో

నా ఈ లోపలి సంతోషాన్ని చూసి.

.

చివరకి ఈ రోజు

మా పిల్లకాయలు కూడా చులాగ్గా అనేసారు

నాన్నా! నీకేమీ తెలియదని

కాకపోతే ఇంగ్లీషులో…

.

ఇంతమంది తెలియదంటున్నదానిని

ఎప్పటికైనా తెలుసుకోవాలంది.

.

ఒక రకంగా

తెలియనిదాన్ని

తెలుసుకునే ప్రయత్నమేనేమో

జీవితమైనా! కవిత్వమైనా!!
.

తెలుగు మూలం: శిఖామణి

“తవ్వకం” కవితా సంకలనం నుండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: