-
ఈ జీవితం… విలియం డ్రమ్మోండ్ ఆఫ్ హాదార్న్ డెన్, స్కాటిష్ కవి
ఎంతో సుందరంగా కనిపించే ఈ జీవితం ఆడుకునే పిల్లలు గట్టిగా ఊపిరి బిగబట్టి గాలిలోకి ఊదే సబ్బునురగలాంటిది. ఆ బుడగని పట్టుకుందికి అన్ని దిక్కులా పరిగెత్తి దాని చలనాన్ని వారసత్వంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకోసారి అది స్వేచ్చాజీవిలా కనిపిస్తుంది బంగారంతో చేసిన వస్తువులా గాలిలో అతికించినట్టు ఆ ఎత్తులో నిలకడగా వేలాడదీస్తున్నట్టు కానీ, ఆ వైభవం అట్టే కాలం ఉండదు. అది కేవలం ఊహల్లోనే అతిగా కొనియాడబడుతుంది. కారణం, అంతకు ముందు దాని ఉనికి లేదు, తర్వాత ఉండదు.…
-
నమస్సులు… శలవు… రోజామండ్ మేరియట్ వాట్సన్, ఇంగ్లీషు కవయిత్రి
ఓ నా యవ్వనమా! శలవు! ఇక మనిద్దరం విడిపోక తప్పదు, ఇదిగో, దారులు ఇక్కడ చీలుతున్నై; ఇక్కడ చేతులోంచి చెయ్యీ, మనసులోంచి మనసూ దూరం చెయ్యవలసిందే- ఇక ఈ ఎడాబాటు నిత్యమూ… అనంతమూ. నా కోసం నువ్వు వాడిన పూలు ధరించకు, నేను నీకై ఇక రోజుల తరబడి శోకిస్తుంటాను. ఇక పొదలలో, పొదరిళ్ళలో పాటలలో ఇన్నాళ్ళూ కనిపించిన ఇంద్రజాలమహిమ కనిపించదు. మన ఎడబాటు ఖరారుచేసి శీఘ్రతరంచేసి ముద్ర వేసే ముదిమి తోడుగా ఇక నేను ముందుకి…
-
మునిగిపోయిన నగరం… విల్ హెల్మ్ మ్యుల్లర్, జర్మను కవి
ష్.ష్.ష్! మునిగిపోయిననగరపు ఘంటల చప్పుడు మరోసారి అలవాటుగా సాయంత్రం నెమ్మదిగా వినవస్తోంది, వినండి! సముద్రగర్భపు లోతుల్లోంచి స్వేఛ్ఛగా ఒక అద్భుతమైన పాట తేలివస్తోంది, ఎప్పటిదో ఏ కాలమునాటిదో. గుడులు, గోపురాలు, ఎన్నో అంతస్థుల రమ్య హర్మ్యాల గుమ్మటాలు అన్నీ సాగరగర్భంలో సమాధియై పడి ఉన్నాయి ఎవరికంటికీ కనపడక, ఒక్క సాయం వేళ కడలి కెరటాలపై పసిడికాంతులు విరిసినపుడు కనవచ్చే వాటి దివ్యకాంతులు తప్ప. ఆ తళత్తళలు చూసిన ఏ నావికునికయినా, అతని చెవిలో ఈ శబ్దాలు రహస్యంగా…
-
ఆత్మశోధన… ఐజాక్ వాట్స్, ఇంగ్లీషు కవి
ఈ రోజు నేను ఏ ఏ పనులు చేశానో ముమ్మారు గుర్తుచేసుకునేదాకా నిద్రలోకి నేను మెల్లిగా జారుకోకుండా ఉందును గాక! ఈ రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను? నేనెక్కడికెళ్ళినా, నే చూసినా వన్నిటినుండీ, నే విన్నా వన్నిటినుండీ, నేర్చుకున్న దేమిటి? నేనింకా తెలుసుకో యోగ్యమైన దేమిటి? నేను చేయవలసినదేది చేశాను? నేను ఏది వదిలించుకోవాలసినదేది ప్రయత్నించాను? నే చెయ్యకుండా విడిచిపెట్టిన కర్తవ్యాలేమిటి? నేనే కొత్త తెలివితక్కువపనులు చేశాను? ఆత్మశోధన చేసుకునే ఈ ప్రశ్నలే సన్మార్గంలో నడవడానికీ, దైవాన్ని…
-
సానెట్ 35… షేక్స్పియర్
నువ్వు చేసిన వాటి గురించి ఇక వగవొద్దు: గులాబులకి ముళ్ళూ, స్వఛ్ఛమైన జలకి బురద, సూర్యచంద్రుల్ని కనుమరుగుచేస్తూ మేఘాలూ, గ్రహణాలూ తియ్యని మకరందాన్నిచ్చే పువ్వుకి గొంగళి పట్టడమూ సహజమే. మనుషులందరికీ ఏవో లోపాలుంటాయి, నన్ను కూడా కలుపుకుని నీ తప్పుల్ని ఉపమనాలతో సమర్థిస్తున్నందుకు, నన్ను నేను వంచన చేసుకుంటున్నాను, నీ తప్పుని లేపనంగా రాసుకుని నీ చేసినవే కాదు, చెయ్యని నేరాలని కూడా ఉదారంగా క్షమిస్తూ; ఎందుకంటే, నీ విషయాసక్తమైన పొరపాటుకి ఆస్కారం కల్పిస్తూ (నీ ప్రతివాదినీ…
-
సానెట్ 34… షేక్స్పియర్
ఇంత అందమైన రోజుని ఎందుకు వాగ్దానం చేసి నన్ను ఏ మెయికప్పులూ లేకుండా బయలుదేరేలా పురికొల్పావు? బడుగు మేఘాలు దారిలో నన్ను దాటి ముందుకుపోయి వాటి దట్టమైన నల్లటి పొగల్లో నీ ప్రతాపాన్ని కనుమరుగుచెయ్యడానికా? నువ్వు అప్పుడప్పుడు మేఘాల్ని చీల్చుకువచ్చి వర్షం దెబ్బతిన్న నా ముఖం మీది చినుకుల తడి ఆరబెడితే సరిపోదు గాయాన్ని మాన్చగలిగినా అవమానం తొలగించలేని గాయం గురించి ఏ మనిషీ గొప్పగా చెప్పుకోలేడు నీకు జరిగిన అవమానం నా దుఃఖానికి ఉపశమనం ఇవ్వదు…
-
సానెట్ 32… షేక్స్పియర్
మిత్రమా! మొరటు మృత్యువు నా ఎముకల్ని మట్టితో కప్పి, తృప్తిగా జీవించిన నా జీవితం నీ కంటే ముందు ముగిసినపుడు, నా అదృష్టం ఒకసారి సింహావలోకనానికి ఉపక్రమించి ఈ నీ ఆరాధకుడి పిచ్చిరాతలేవో నీకు చదవాలనిపించినపుడు ఇతరులు రాసిన రాతలన్నిటి ముందూ ఇవి వెలవెలపోయినా, వీటిని కేవలం నామీద ప్రేమకొద్దీ దాచుకో! ఇందులో గొప్ప కవిత్వం ఉందని కాదు; కాలంతోపాటు వాటి విలువ ఎలా పెరుగుతుందో సరిపోల్చుకో. లబ్దప్రతిష్ఠుల కవితలను మించి నిలబడతాయి. అప్పుడైనా, ఈ ఒక్క…
-
సానెట్ 30… షేక్స్పియర్
నా ఆలోచనా నివహాల పర్వాలకు గుట్టుచప్పుడుకాకుండా గతకాలపు విషయాల జ్ఞాపకాలను ఆహ్వానిస్తానా… నే సాధించాలనుకున్న ఎన్నో విషయాలు సాధించలేదని గుర్తొచ్చి విలువైన నా జీవితకాలాన్ని వృధాచేశానే అని బాధకలుగుతుంది: నాకు ఏడవడం అలవాటు లేకపోయినప్పటికీ, ఏడవడం ప్రారంభిస్తాను: అంతుతెలియని చీకటిలోదాగిన నా అపురూపమైన మిత్రులకోసం అప్పటికి ఎన్నడో మానిపోయిన ప్రేమ గాయాలకు మరోసారి శోకిస్తాను, కంటికి కనరాని నే పోగొట్టుకున్న అనేక వస్తువులకై అలమటిస్తాను మళ్ళీ మీదచెప్పిన బాధలకే మరొకసారి బాధపడతాను ఒకదాని వెనక ఒకటి, ఒకదాని…
-
సానెట్ 29… షేక్స్పియర్
ప్రజల దృష్టిలో చులకనై, అదృష్టంచే వెలివేయబడి నా బహిష్కరణస్థితికి ఒంటరిగా శోకిస్తూ వ్యర్థమైన ప్రార్థనలతో వినిపించుకోని దైవాన్ని వేడుకుంటూ నన్ను నేను పరికించుకుని, అదృష్టహీనతకి నిందించుకుంటూ ఎన్ని లేకున్నా ఆశ నన్ను విడనాడకుండా ఉంటే బాగుణ్ణని కోరుకుంటూ ఎక్కువమంది మిత్రులున్న అతనిలా ఉంటే బాగుండుననో ఈ వ్యక్తికున్న నైపుణ్యము, ఆ వ్యక్తికున్న పరిచయాలూ వాంఛిస్తూ నాకు సంతృప్తినిచ్చేదాంతో సంతుష్టిచెందలేకుండా ఈ ఆలోచనల ప్రవాహంలో నన్ను నేను అసహ్యించుకుంటూ నీ గురించి ఒక్కసారి తలుచుకుంటానా, అంతే, ఒక్క సారి…
-
సానెట్ 28… షేక్స్పియర్
విశ్రాంతి నుండి లభించే సుఖానికి దూరమైన నేను అలాంటపుడు, సుఖావస్థకి ఎలా చేరుకోగలను చెప్పు ? పగలుపడ్డ శ్రమ రాత్రికి తీరడం పోయి, రాత్రీ పగలూ, పగలూ రాత్రీ వేధిస్తుంటే ఎలా? ఆ రెండూ ఒక దానికొకటి శత్రువులైనా, స్నేహితుల్లా నను వేధించడానికి మాత్రం చేతులు కలుపుతున్నాయి. ఒకటి శ్రమకి గురి చేసీ, రెండవది నేను ఎంత కష్టపడినా, నీనుండి ఇంకా దూరమేనని గుర్తుచేస్తూను. నేను పగటితో అంటాను సంతోషపరచడానికి:నువు కాంతిమంతుడవు; ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మినా, అతనిని…