అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూలై 14, 2016

    లుసీల్… ఓవెన్ మెరెడిత్, ఇంగ్లీషు

    మనం కవిత్వం, సంగీతం, లలితకళలు లేకుండా బ్రతకొచ్చు; మనం మనసూ, హృదయం లేకుండా బ్రతకొచ్చు; మనం స్నేహితులూ, పుస్తకాలూ లేకుండా బ్రతకొచ్చు; కానీ నాగరిక మానవుడు వంటవాళ్ళు లేకుండా బ్రతకలేడు. పుస్తకాలు లేకుండా బ్రతకొచ్చు… వేదన తప్ప జ్ఞానం ఏమి మిగులుస్తుంది? ఆశలేకుండా బ్రతకొచ్చు… ఆశ అంటే మోసం తప్ప మరేమిటి? ప్రేమ లేకుండా బ్రతకొచ్చు… చింతించడానికి తప్ప ఆవేశం దేనికి పనికొస్తుంది? కానీ అన్నం తినకుండా బ్రతకగలిగిన మనిషెక్కడున్నాడో చూపించండి? . ఓవెన్ మెరెడిత్ 9…

  • జూలై 11, 2016

    మత్తులో పడండి… చార్లెస్ బోద్ లేర్, ఫ్రెంచి కవి

    నిత్యం మత్తులో జోగండి అంతే! అది చాలా అవసరం! భయంకరమైన కాలం బరువు మీ భుజాలను పుండు చేసి భూమికి కృంగదీసే అనుభూతి పొందకుండా ఉండాలంటే  పూటుగా తాగి ఆ మత్తులో అలాగే ఉండండి! ఏమిటి తాగాలి? మదిరో, కవిత్వమో, శీలమో, ఏదో ఒకటి. కానీ, తాగడం మాత్రం మరవొద్దు. ఒక్కోసారి మీకు ఏ రాజప్రాసాదాల్లోనో, గోతిలోని పచ్చగడ్దిమీదో, అంధకారమయమైన మీ ఒంటరి గదిలోనో మీ మత్తు దిగిపోయో, ఎగిరిపోయో పొరపాటున స్పృహ వస్తే గాలినో కెరటాన్నో…

  • జూలై 10, 2016

    అసుర సంధ్యవేళ… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి

    Hear this lovely poem here   పగటికీ రాత్రికీ మధ్య మునిమాపులో చీకటి నలుదిక్కులా ముసురుకునే వేళ పగలుచేసే పనులకు విశ్రాంతి సమయం వస్తుంది దాన్నే (బాల)”అసుర సంధ్యవేళ” అంటారు. సరిగా నా నెత్తిమీది గదిలో పిల్లల పాదాల చప్పుడు వినిపిస్తోంది, తలుపు అప్పుడే తెరుచుకున్న ధ్వని చిన్నారుల తియ్యని మెత్తని గుసగుసలు. నే చదువుకునే గది దీపం వెలుగులో పెద్ద హాలులోని మెట్లు దిగుతూ గంభీరంగా ఏలిస్, నవ్వుతూ ఏలెగ్రా, బంగారు జుత్తులో ఈడిత్…

  • జూలై 9, 2016

    శలభము చెప్పిన పాఠము… డాన్ మార్క్విజ్, అమెరికను

    (గమనిక: ఈ కవిత బొద్దింకలో ప్రవేశించిన కవి చెబుతున్నాడు.) ఓ రోజు సాయంత్రం నేనో దీపపు పురుగుతో మాటాడుతున్నాను అది విద్యుత్ బల్బులోకి ఎలాగైనా దూరిపోయి అక్కడి ఫిలమెంటుమీద మాడిపోవాలని ప్రయత్నిస్తోంది నే నడిగాను, మీరెందుకు ఇలాంటి సాహసాలు చేస్తారని. అది ఈ పురుగులకి సంప్రదాయమా? “అది బల్బు గనుక, గాజు తొడుగుంది గనుక సరిపోయింది గాని, దానికి బదులు అక్కడ ఏ కొవ్వొత్తో ఉండి ఉంటే, ఈ పాటికి బూడిదకూడా మిగలకుండా మాడిపోయేదానివి నీకు బుద్ధిలేదా?”…

  • జూలై 8, 2016

    తోటలోని అబ్బాయి… హెన్రీ వాన్ డైక్, అమెరికను

    చీకూ చింతలులేని ఆలోచనల ఉద్యానంలోకి నేను కొత్తగా అడుగుపెట్టగానే, తలుపు తెరిచి కనిపించింది, ఒక సారి లోనకి వెళదామా అనిపించింది, వెళ్ళి అక్కడి దారుల్నీ, అక్కడి అందమైన లతానికుంజాలనీ తాపడంచేసినట్టు విరిసినపూలని శోధిద్దామనిపించింది; ఒకప్పుడు నేను అమితంగా ప్రేమించిన ఈ తోటలోకి ధైర్యంగా అడుగుపెట్టేముందు ఒక నిష్కల్మషమైన గొంతు వినాలనిపించింది, ఆ తోట తెలియకుండానే పోగొట్టుకున్నాను, అనుకోకుండా తారసపడింది. సరిగ్గా ద్వారానికి ముందరే నాకో అబ్బాయి కనిపించేడు, చాలా వింత కుర్రాడు, అయినా నాకు ఎంతో ఆప్తుడు, …

  • జూలై 7, 2016

    మరొకసారి ప్రయత్నించు… అజ్ఞాత కవి

    ఈ పాఠం నువ్వు శ్రద్ధగా వినిపించుకోవాలి మరో సారి, మరో సారి, మరోసారి ప్రయత్నించు; మొదటిప్రయత్నంలో నువ్వు సఫలుడివి కాపోతే మరో సారి, మరో సారి, మరోసారి ప్రయత్నించు. ఒకటి, రెండు సార్లు నువ్వు విఫలమవొచ్చు, మరోసారి ప్రయత్నించు; నువ్వు చివరికి సాధించాలనుకుంటే, మరోసారి ప్రయత్నించు. మరోసారి ప్రయత్నించడం సిగ్గుచేటు కాదు మనం పందెం గెలవకపోవచ్చు; అలాంటప్పుడు ఏమిటి చెయ్యాలి? మరోసారి ప్రయత్నించాలి. నీకు నీ పని కష్టంగా తోచినపుడు, మరోసారి ప్రయత్నించు; కాలమే తగిన ప్రతిఫలం…

  • జూలై 6, 2016

    కాకవంధ్య… సీలియా గిల్బర్ట్ , అమెరికను

    (ఒకే చూలు కలిగిన స్త్రీని ‘కాకవంధ్య’  అంటారు) . చూరుమీద పావురాలు, పక్కన మంత్రసానులు, రంగురంగుల కదలిక, విధి గురించి ఏవో పిచ్చిమాటలు నా పొట్టను మించిన ఒంటరితనం, ఉమ్మనీరు, అందులో నిగూఢంగా జీవిస్తూ జీవి ఎవరూ మాటాడరు, ఎవరూ చూడరు, గడియారం కదులుతుంటే బల్లమీద కాళ్ళు జాపుకుని. సూర్యుడు బాగా ఎండ కాచి అస్తమిస్తాడు, చంద్రుడు లేస్తాడు. 15 నుండి 24, గర్భసంచీ వ్యాకోచించడం ప్రారంభిస్తుంది; లీలగా జ్ఞాపకం: ప్రాణం కడకట్టుకుపోతోంది, గుహలూ, కోటలూ… హాల్లో…

  • జూలై 3, 2016

    పోలిక… లెటీటియా ఎలిజబెత్ లాండన్, ఇంగ్లీషు కవయిత్రి

    ఒక అందమైన ఇంద్రధనుసు లాంటి జీవితం చాలు; ఆనందంతో గెంతుతూ, మిడిసిపాటుతో నిండినది: అటువంటి జీవితం వర్సైల్స్ లోని ఉద్యానవనం లాంటిది, అక్కడ అన్నీ కృత్రిమమైనవే; అక్కడ సెలయేరు చలువరాయి తొట్టెలలో బంధించబడుతుంది, లేదా వేడిగా ఉన్న గాలిలోకి చిమ్మబడుతుంది… జలపాతాల్లా అద్భుతంగా మెరుస్తూ; ఆ ప్రకృతి శక్తి, అంతటి మహత్తరశక్తీ, క్షణికమైన ఆటవస్తువైపోతుంది; అన్ని ఆటవస్తువుల్లాగే, దానిజీవితమూ బుద్బుదమే. . లెటీటియా ఎలిజబెత్ లాండన్ 14 August 1802 – 15 October 1838 ఇంగ్లీషు…

  • జూలై 2, 2016

    తర్వాత… డేవిడ్ బేకర్, అమెరికను కవి

    వేన్ లో కాసేపు ప్రయాణం చేసిన పిదప, మా ఎనమండుగురమూ అక్కడ ఎండలో— తెల్లని చొక్కాలు ఒంటికి అంటుకుపోతుంటే, ఆమె చేతులనుండి తీసిన గ్లోవ్జ్ తో ముఖం విసురుకుంటూ. పనివాళ్ళు ఒక పెద్ద నీలం గుడారం నిలబెట్టారు సమాధితవ్వుతున్న మాకు ఎండనుండి రక్షణకి ఈ మధ్యాహ్నం అంతా ఎండ మహాతీవ్రంగా కాసింది పక్కన నిటారుగా నిల్చున్న ఎల్మ్ చెట్లమీంచి అడుగులో అడుగేసుకుంటూ మా నెత్తిమీంచే నడిచేడు సూర్యుడు. ఒక సుదీర్ఘ ప్రవాహంలా చుట్టుపక్కలవాళ్ళూ, స్నేహితులూ, ఊరిలోని పెద్దలూ,…

  • జూలై 1, 2016

    పోగొట్టుకున్నవి… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి

    వార్తాపత్రికల్లోనూ, ప్రకటన ఫలకాలమీదా పోగొట్టుకున్న వస్తువులగురించి వెదుకుతుంటాను. ఈ విధంగా మనుషులు ఏమి పోగొట్టుకున్నారో వాళ్ళకి ఏవంటే ఇష్టమో నాకు తెలుస్తుంది. ఒకసారి అలసిన నా తల దట్టంగా జుట్టున్న నాగుండెపై వాలిపోయింది. అక్కడ మా నాన్న శరీర వాసన ముక్కుకి తాకింది అదీ, చాలా సంవత్సరాల తర్వాత. నా జ్ఞాపకాలు ఎలాంటివంటే తిరిగి చెకోస్లొవేకియా పోలేని వాడూ చిలీకి తిరిగిపోవాలంటే భయపడేలాంటి వాడివి. ఒక్కోసారి నాకు కనిపిస్తుంది పాలిపోయిన నేలమాళిగవంటి గదీ… అక్కడ మేజామీద ఒక…

←మునుపటి పుట
1 … 84 85 86 87 88 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు