Hear this lovely poem here
పగటికీ రాత్రికీ మధ్య మునిమాపులో
చీకటి నలుదిక్కులా ముసురుకునే వేళ
పగలుచేసే పనులకు విశ్రాంతి సమయం వస్తుంది
దాన్నే (బాల)”అసుర సంధ్యవేళ” అంటారు.
సరిగా నా నెత్తిమీది గదిలో
పిల్లల పాదాల చప్పుడు వినిపిస్తోంది,
తలుపు అప్పుడే తెరుచుకున్న ధ్వని
చిన్నారుల తియ్యని మెత్తని గుసగుసలు.
నే చదువుకునే గది దీపం వెలుగులో
పెద్ద హాలులోని మెట్లు దిగుతూ
గంభీరంగా ఏలిస్, నవ్వుతూ ఏలెగ్రా,
బంగారు జుత్తులో ఈడిత్ కనిపిస్తున్నారు.
చెవిలో ఎదో చెప్పుకుని, వెంటనే గప్ చిప్ ఐపోయారు
వాళ్ళ కొంటె కనుల మెరుపుల్లో
ముగ్గురూ కలిసి నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి
ఏదో పన్నాగం పన్నుతున్నారని పసిగట్టేను
మెట్లమీంచి ఒక ఉదుటున ఒకటే పరుగు
హాల్లోంచి అకస్మాత్తుగా నా మీదకి దాడి
తెరిచిఉంచిన మూడు ద్వారాల్లోంచీ
వాళ్ళు నా కోట గోడ ఎక్కేసారు.
వాళ్ళు నా కోట బురుజు ఆక్రమించేరు
నా చేతులమీదా, కుర్చీ వెనకా;
పారిపోడానికి ప్రయత్నిస్తే చుట్టుముట్టేరు
ఎక్కడచూసినా వాళ్ళే కనిపిస్తున్నారు.
వాళ్ళు నన్ను ముద్దులతో ముంచెత్తేరు
వాళ్ళచేతుల్లో నను బందీని చేస్తూ,
ఎలుకలనుండి తప్పించుకుందికి రైన్ నదిమీద
భవనం కట్టుకున్న బిషప్ బింజెన్ గుర్తొచ్చేడు
ఓ నీలికళ్ళ బందిపోటుదొంగలారా!
మీరు కోటగోడ ఎక్కగలిగేరు గదా అని
నాలాంటి మీసాలు నెరిసిన ముసలి
మీకు సమ ఉజ్జీ కాదనుకుంటున్నారా?
మిమ్మల్ని నా కోటలో బందీలను చేస్తాను.
మిమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టను,
నా హృదయమనే గుండ్రని కోటస్థంబం
చీకటి అరల్లో మిమ్మల్ని ఖైదు చేస్తాను.
అక్కడ మిమ్మల్ని శాశ్వతంగా కట్టిపడెస్తాను.
నిజం, కలకాలం … కల్పాంతందాకా,
ఆ కోటగోడలు శిధిలమై కూలిపోయాదాకా
చివికి చివికి మట్టిలో కలిసిపోయేదాకా!
.
హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో
February 27, 1807 – March 24, 1882
అమెరికను కవి

The Children’s Hour
.
Between the dark and the daylight,
When the night is beginning to lower,
Comes a pause in the day’s occupations
That is known as the Children’s Hour.
I hear in the chamber above me
The patter of little feet,
The sound of a door that is opened,
And voices soft and sweet.
From my study I see in the lamplight,
Descending the broad hall-stair,
Grave Alice, and laughing Allegra,
And Edith with golden hair.
A whisper, and then a silence:
Yet I know by their merry eyes
They are plotting and planning together
To take me by surprise.
A sudden rush from the stairway,
A sudden raid from the hall!
By three doors left unguarded
They enter my castle wall!
They climb up into my turret
O’er the arms and back of my chair;
If I try to escape, they surround me;
They seem to be everywhere.
They almost devour me with kisses,
Their arms about me entwine,
Till I think of the Bishop of Bingen
In his Mouse-Tower on the Rhine!
Do you think, O blue-eyed banditti,
Because you have scaled the wall,
Such an old moustache as I am
Is not a match for you all?
I have you fast in my fortress,
And will not let you depart,
But put you down into the dungeons
In the round-tower of my heart.
And there will I keep you forever,
Yes, forever and a day,
Till the walls shall crumble to ruin,
And moulder in dust away!
.
Henry Wadsworth Longfellow
February 27, 1807 – March 24, 1882
American Poet
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/2003/11/childrens-hour-henry-wadsworth.html
స్పందించండి